సెక్స్ కి నో చెప్పే హక్కు ఉందా..? లేదా..?

First Published | Jul 6, 2021, 11:05 AM IST

అసలైన లైంగిక సమ్మతి అంటే ఏంటి..? దాని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు చూద్దాం..

‘ లైంగిక సమ్మతి’ దీని గురించి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సి అవసరం ఎంతో ఉంది. చాలా మంది పెళ్లి అయ్యిందంటే చాలు.. తమకు భార్యతో సెక్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది అనుకుంటారు. అయితే.. నిజం ఉండచ్చేమో కానీ... అది వారి భార్య నుంచి అనుమతి లభిస్తేనే వారితో సెక్స్ చేయగలరు అనే విషయం తెలుసుకోవాలి.
అసలైన లైంగిక సమ్మతి అంటే ఏంటి..? దాని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు చూద్దాం..

మీరు కానీ.. మీ భాగస్వామి కానీ.. ఒక్కసారి సెక్స్ కి ఒకే చెప్పారు అంటే.. అది జీవితాంతం వర్తిస్తుందని అర్థం కాదు. కేవలం అప్పటి వరకు మాత్రమే అంగీకారం తెలిపినట్లు అని అర్థం చేసుకోవాలి. ప్రతిసారీ... సెక్స్ లో పాల్గొనే సమయంలో.. ఖచ్చితంగా అంగీకారం తీసుకోవాల్సిందేనట. వారికి ఇష్టమైతేనే సెక్స్ లో పాల్గొనాలి. వారు నో చెబితే... వద్దు అని అర్థం చేసుకోవాల్సిందే.
అవతలి వ్యక్తికి ఏది మంచిది.. ఏం కావాలనే విషయాన్ని మీరు డిసైడ్ చేయకూడదు. సెక్స్ విషయంలో ప్రతి ఒక్కరికీ వారకంటూ ఓ అభిప్రాయం ఉంటుంది.
కాబట్టి.. ప్రతిదానిని మీరు గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. ఎదుటివారు అభిప్రాయానాకి గౌరవం ఇవ్వాలి. భాగస్వామితో కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే.. వారు ఏం కావాలని అనుకుంటున్నారో.. వద్దు అనుకుంటున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.
ఎవరైనా శృంగారానికి నో చెప్పినప్పుడు.. వారిని విస్మరించడం.. విమర్శించడం.. లేదా బలవంతంగా ముద్దు పెట్టుకోవడం లాంటివి చేయకూడదట. అంతేకాకుండా... సెక్స్ కోసం ఒత్తిడి చేయడం లాంటివి చేయకూడదట.
మీరు రిలేషన్ లో ఉన్నా.. పెళ్లి చేసుకున్నాం కదా అని.. వారి పై మీకు పూర్తిగా అధికారం ఉంది అనుకోవద్దు. వారు ఒక వేళ.. వద్దు అని చెప్పడానికీ వారి వద్ద అనేక కారణాలు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.
ఒక్కసారి వద్దు అంటే... అది జీవితాంతం వద్దు అని కాదు.. అదే విధంగా... ఒక్కసారి ఒకే అంటే.. జీవితాంతం ఒకే అని చెప్పినట్లు కూడా కాదని అర్థం చేసుకోవాలి.

Latest Videos

click me!