అమ్మాయితో అవసరం తీరిపోయాక ఆమెపై ఇంట్రెస్ట్ ఉండట్లేదా.. అయితే ఇది తెలుసుకోండి!

First Published | Nov 11, 2021, 12:18 PM IST

ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఆకర్షణ (Attraction) మాత్రమే ఉంటే సరిపోదు బలమైన ప్రేమబంధం (Love) ఉండాలి. అప్పుడే వారికి ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరిగి అది బలమైన బంధంగా మారుతుంది. ప్రస్తుత కాలంలో ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమబంధం తగ్గి, కేవలం ఆకర్షణకు మాత్రమే గురవుతున్నారు. అయితే ఈ ఆర్టికల్ ద్వారా ఒక అమ్మాయితో అవసరం తీరిపోయాక అమ్మాయిలపై ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనే విషయం గురించి తెలుసుకుందాం.  
 

ఒక అమ్మాయి ఒక అబ్బాయి రిలేషన్ షిప్స్ (Relationship) లో ఉన్నాము అన్నప్పుడు అది వారి నూరేళ్ల జీవితానికి నాంది పలకాలి. అలా కాదని వాళ్ళ అవసరాలను తీర్చుకొని తర్వాత వదిలేయడం రిలేషన్ షిప్ అనిపించుకోదు. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకోవాలి. ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలా కాదని వారి అవసరాలను తీర్చుకోవడం కాదు. వారి అవసరాలకు వాడుకోవడం (To use) రిలేషన్ షిప్ అనిపించుకోదు.
 

మనం ఎప్పుడు రిలేషన్ షిప్ (Relationship) లో ఒక అమ్మాయితోనే ఉండాలి. అప్పుడే వారి మనసును తెలుసుకోగలుగుతాం. అలా కాదని 10 మంది అమ్మాయిలతో రిలేషన్ షిప్ లో ఉంటే వారిని మోసం (Cheating) చేసినట్టు అవుతుంది. రిలేషన్ షిప్ అనే పదానికి అర్థం మారిపోతుంది. ఒక అమ్మాయిని తమ అవసరాలను తీర్చుకునే ఉద్దేశంతో (Intention) ఎప్పుడూ చూడరాదు. మీరు జీవితాంతం కలిసి ఉండాలని భావిస్తేనే వారితో రిలేషన్ షిప్ లో ఉండాలి.


వారితో సుఖం పొందిన తర్వాత వారిని పట్టించుకోకుండా వదిలి వేయడం, మరొక అమ్మాయితో రిలేషన్ (Relationship) పెట్టుకోవడం మంచిది కాదు. మొదట మన అలవాట్లను మానుకోవాలి. ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా (Mentally) ఇష్టపడేందుకు ప్రయత్నించాలి. మన మనసును మన ఆధీనంలో ఉంచుకున్నప్పుడే అది మన మాట వింటుంది. ఆ అమ్మాయినే తన మనసులో ఆరాధించుకోవాలి. అలా కాదని మనకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఒకరి జీవితాన్ని (Life) నాశనం చేసిన వాళ్ళమవుతాము.
 

ప్రతి అమ్మాయిని తమ కోరికలు తీర్చుకోవడానికి వాడరాదు. ఇలా అందరి విషయంలోనూ చేస్తే వారికి మీ మీద ఉన్న నమ్మకం పోతుంది. మిమ్మల్ని ఒక మనిషి లాగా కూడా చూడరు. అందరి దృష్టిలో మీరు ఒక చీడపురుగుల మిగిలిపోతారు. మొదట అమ్మాయిలను గౌరవించడం నేర్చుకోవాలి. ఒక అమ్మాయిని మనస్పూర్తిగా (Mentally) ఆరాధించినప్పుడు తన ఇష్టాలు మీ ఇష్టాలుగా మారుతాయి. అప్పుడే ఆ అమ్మాయి పై మీకు మరింత ఇంట్రెస్ట్ (Interest) పెరుగుతుంది.
 

అలాంటప్పుడు ఆమెతో కోరిక తీరాక వదిలేయాలి అనిపించదు. తనతో జీవితాంతం (Lifelong) నడవాలి అనిపిస్తుంది. ఇలా కాదని మీరు అమ్మాయిని మీ అవసరానికి వాడుకొని వదిలేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. ఇలా అందరితోనూ కలయికలో పాల్గొంటే మీకు ఆరోగ్య సమస్యలు (Health problems) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పులను మానుకొని సరైన దారిలో నడవండి. ఇది మీ జీవన గమ్యానికి మంచిది.

Latest Videos

click me!