గడ్డం ఉన్న మగవారితో సంబంధాలు పదిలమట.. మీకు తెలుసా?

First Published | Nov 27, 2021, 1:23 PM IST

గడ్డం పెంచుకున్న అబ్బాయిలంటే (Bearded boy) అమ్మాయిలకు చాలా ఇష్టం ఉంటుందట. ఈ మధ్య అబ్బాయిలు గడ్డం పెంచడం ట్రెండ్ గా మారింది. ఈ ట్రెండ్ కు అమ్మాయిలు ఫిదా అయిపోతున్నారట. ఇలా గడ్డం పెంచుకున్న అబ్బాయిలను చూస్తే అమ్మాయిలు ఆకర్షణకు గురవుతున్నారని ఒక తాజా అధ్యయనంలో తేలింది. నీట్ గా షేవ్ చేసుకున్న అబ్బాయిల కంటే గడ్డం పెంచుకున్న అబ్బాయిలకే ఎక్కువగా ఆకర్షణకు గురవుతున్నట్లు తేలింది. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా గడ్డం పెంచుకున్న మగవారితో సంబంధాలు పదిలంగా ఉంటాయని అమ్మాయిలు ఎందుకు భావిస్తారో తెలుసుకుందాం..
 

మహిళలు సాధారణంగా గడ్డం ఉన్న మగవారిని బాగా ఇష్టపడుతుంటారు. గడ్డం పెంచుకుని సినిమా, సీరియల్ హీరోలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు (Impressive). గడ్డం పెంచుకున్న మగవారిలో మగతనం ఎక్కువగా ఉంటుందని కొందరు మహిళలు భావిస్తున్నారట. గడ్డం పెంచుకున్న మగవారితో బాంధవ్యం సుదీర్ఘకాలం కొనసాగుతుందని మహిళల నమ్మకం (Believe).
 

ఇది నిజమేనని ఒక సంస్థ చేపట్టిన అధ్యయనంలో తేలింది. గడ్డం పెంచుకున్న మగవారిని ఆడవారు చాలా ఇష్టపడతారట. గడ్డానికి మగతనానికి (Masculinity) మధ్య సంబంధం ఉందని తాజా పరిశోధనలో తేలింది. ఇప్పుడున్న యువత గడ్డం పెంచడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. సినిమాలలో వారికి ఇష్టమైన హీరోలని చూసి వారి ట్రెండ్ (Trend) ను ఫాలో అవుతున్నారు.
 


పూర్వంలో భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రమే గడ్డం పెంచుకునే వారు కానీ ఇప్పుడు గడ్డం పెంచుకోవడం కొత్త ట్రెండ్ (New trend) గా హల్ చల్ చేస్తోంది. ఈ ట్రెండ్ తో అబ్బాయిలు అమ్మాయిలను అట్రాక్ట్ (Attract) చేస్తున్నారు. అమ్మాయిలు కూడా వారు  ప్రేమించిన అబ్బాయి గడ్డం తెలుసుకోవాలని కొత్త లుక్ లో ఉండాలని కోరుకుంటారు.
 

గడ్డం పెంచుకున్న అబ్బాయి హుందాగా (Sober) గంభీరంగా కనిపిస్తాడట. గడ్డం లుక్ లో అబ్బాయిలు హ్యాండ్సమ్ (Handsome) గా కనిపిస్తారు. గడ్డం పెంచుకోవడానికి అబ్బాయిలకు ఓపిక ఎక్కువగా ఉంటుందట. మొత్తానికి గడ్డం ఎక్కువగా పెంచుకున్న అబ్బాయిలని చూస్తే అమ్మాయిలు ఈజీగా అట్రాక్ట్   అవుతారని నిపుణులు తెలుపుతున్నారు.
 

గడ్డం పెంచుకునే అబ్బాయిలలో పిల్లలను కనే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని వారిలో శృంగార (Romance) వాంఛలు ఎక్కువగా ఉంటాయని అమ్మాయిలు భావిస్తారు. గడ్డం ఎక్కువగా పెంచుకున్న అబ్బాయిలతో రిలేషన్షిప్ లో  ఉండడానికి అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. గడ్డం పెంచుకున్న అబ్బాయిలకు ఓపిక (Patience) ఎక్కువ అని అమ్మాయిలు చేసే చిలిపి చేష్టలను భరించగలరని మహిళల నమ్మకం.
 

గడ్డం పెంచుకున్న అబ్బాయిలు అమ్మాయిలను ఆ విషయంలో ఎక్కువగా సంతోష పెట్టగలరని భావిస్తారు. చివరికి పెళ్లిలో కూడా పెళ్లి కొడుకులు గడ్డం పెంచుకుని కొత్త లుక్ (New look) లో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అబ్బాయిలు కూడా అమ్మాయిలకు ఇష్టమైన కొత్త లుక్ లో కనపడుతూ వారిని సంతోష పెడుతున్నారు. ఈ విధంగా గడ్డం పెంచుకున్న మగవారితో వారి  సంబంధం (Relationship) పదిలంగా ఉంటుందని మహిళలు భావిస్తారు.

Latest Videos

click me!