జాయింట్ ఫ్యామిలీలో.. సెక్స్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?

First Published | Nov 26, 2021, 2:30 PM IST

మీరు మంచి సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు, కుటుంబ సభ్యులలో ఒకరు ఇంట్లో ఏదో మరచిపోయో లేదంటే.. ఏదైనా మీతో అవసరం వచ్చి డోర్ కొట్టడం. జాయింట్ ఫ్యామిలీలో ఉండే చాలా మంది  ఈ సిట్యూవేషన్  ఎదుర్కొనే ఉంటారు

ఇప్పడంటే.. ఎవరికి వారు యమునా తీరు అంటూ.. భార్య, భర్త , పిల్లలు అన్నట్లుగా బతుకుతున్నారు. కానీ.. ఒకప్పుడు  జాయింట్ ఫ్యామిలీలే ఎక్కువగా ఉండేవి. మరి.. అలా జాయింట్  ఫ్యామిలీస్ లో ఉండేవారు.. సెక్స్ లైఫ్ ని ఆస్వాదించేవారా..? అసలు వాళ్ల సెక్స్ లైఫ్ ఎలా ఉండేది..? వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనేవారో ఇప్పుడు చూద్దాం..

ఈ రోజుల్లో చాలా మంది చాలా క్యాజువల్ గా సెక్స్ టాయ్స్ వినియోగిస్తున్నారు. అదే.. మీరు కనుక జాయింట్ ఫ్యామిలీలో ఉండి.. అప్పుడు కూడా సెక్స్ టాయ్స్ వాడుతూ.. ఇంట్లో ఎవరికైనా అవి కంట పడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒక సారి. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉండి.. వారు వాటిని ఆడుకునే టాయ్స్ అనుకొని వాటితో ఆడుకుంటామని మారం చేస్తే.. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ పరిస్థితి ఇప్పటి వరకు చాలా మందే ఫేస్ చేసి ఉంటారు


loud sex

మీరు మంచి సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు, కుటుంబ సభ్యులలో ఒకరు ఇంట్లో ఏదో మరచిపోయో లేదంటే.. ఏదైనా మీతో అవసరం వచ్చి డోర్ కొట్టడం. జాయింట్ ఫ్యామిలీలో ఉండే చాలా మంది  ఈ సిట్యూవేషన్  ఎదుర్కొనే ఉంటారు. అయితే.. సడెన్ గా అలా డోర్ కొట్టడం వల్ల.. సెక్స్ మీద ఇంట్రస్ట్ తగ్గిపోతుందట. ముఖ్యంగా పురుషులు.. మళ్లీ సెక్స్ మూడ్ తెచ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది.

inner wear


మీరు అదృష్టవశాత్తూ లాండ్రీ గది లేదా ఎవరూ రాని ప్రత్యేక స్నానాల గదిని కలిగి ఉంటే.. మీరు సేఫ్ అనే చెప్పొచ్చు. కానీ...  అలా కాకుండా.. అందరికీ ఒకటే కామన్ బాత్రూమ్ ఉన్నా.. లో దుస్తులు కూడా ఒకేచోట ఆరేయాల్సి వస్తే.. చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

sex

ఇక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నవారు.. తమకు నచ్చినట్లుగా సెక్స్ ని ఎంజాయ్ చేయలేరట. ఉద్వేగంతో.. గట్టిగా శబ్దాలు చేసే స్వాతంత్రం కూడా ఉండదు. ఎలాంటి శబ్దం రాకుండా.. మీరు గదిలో ఏం చేస్తున్నారనే విషయం బయటకు తెలీకుండా ఉండేలా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. అలా చేయకపోతే.. తర్వాతి రోజు మీరు మీ కుటుంబసభ్యుల ముఖంలోకి కూడా చూడలేరు.

Love bite

ఇక.. ఒకరికి మరొకరు లవ్ బైట్స్ కూడా ఇవ్వలేరు. ఇస్తే.. వెంటనే ఇంట్లో వాళ్లు పసిగట్టేస్తారు. సులభంగా దొరికేస్తారు. దీంతో.. వారి ముందు తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. మరి.. ఇలాంటివి మీ లైఫ్ లో కూడా ఎదుర్కొన్నారా...?

Latest Videos

click me!