మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే.. ఏజ్ గ్యాప్ ఎంతుండాలో తెలుసా?

First Published | Nov 27, 2021, 1:12 PM IST

ఇక అమ్మాయిలు కూడా.. తమ కంటే చాలా పెద్ద వాళ్లను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేవారు కొందరు ఉంటే.. తమతో సమాన ఏజ్ వాళ్లని ఇష్టపడేవారు కూడా ఉంటారు. నిజానికి.. దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలంటే.. ఏజ్ గ్యాప్ అసలు ఎంత ఉండాలి..? 

మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే... దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుందనే విషయం కూడా చాలా ముఖ్యమట.  పెళ్లికి సిద్ధపడే యువతీ యువకులు.. ముఖ్యంగా ఈ ఏజ్ గ్యాప్ ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. కొందరు పెళ్లి చేసుకునే దంపతులు ఏజ్ గ్యాప్ రెండు సంవత్సరాలు ఉండేలా చేసుకుంటారు. కొందరు.. కనీసం పది సంవత్సరాలు అయినా లేకపోతే ఏం బాగుంటుంది అని అనుకుంటారు.
 

ఇక అమ్మాయిలు కూడా.. తమ కంటే చాలా పెద్ద వాళ్లను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేవారు కొందరు ఉంటే.. తమతో సమాన ఏజ్ వాళ్లని ఇష్టపడేవారు కూడా ఉంటారు. నిజానికి.. దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలంటే.. ఏజ్ గ్యాప్ అసలు ఎంత ఉండాలి..? ఎంత గ్యాప్ ఉన్న దంపతులు.. వారి జీవితాన్ని ఆస్వాదించగలరు. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
 


5-7 ఏజ్ గ్యాప్..

 ఈ ఏజ్ గ్యాప్ తో పెళ్లి చేసుకునే దంపతుల మధ్య గొడవలు, అపార్థాలు, వాదనలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఏజ్ గ్యాప్ తో ఉన్న దంపతుల్లో ఎవరో ఒకరు మెచ్యూరిటీ కలిగి ఉంటారు. దాదాపు గొడవలు రాకుండా చూసుకుంటారు. వచ్చినా వెంటనే సర్దుమణిగేలా చేస్తారు. వివాహ బంధం కుప్పకూలిపోకుండా జాగ్రత్తపడతారు.  ఈ గ్యాప్ ఉన్నవారు.. ఒకరినొకరు తొందరగా అర్థం చేసుకుంటారట. ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.

10 ఏళ్ల ఏజ్ గ్యాప్..

ఈ ఏజ్ గ్యాప్ తో పెళ్లి చేసుకొని.. చాలా ఆనందంగా ఉన్నవారు.. చాలా మందే ఉన్నారు. అయితే... ఇదే ఏజ్ గ్యాప్ కారణంగా.. గొడవలు పడి.. విడిపోయేవారు కూడా ఉన్నారు. పది సంవత్సరాల గ్యాప్ అంటే.. దాదాపు ఒక తరానికి మధ్య తేడా ఉన్నట్లే. దీంతో... ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకోకలిగితే పర్వాలేదు. అలా కాకుండా..  ఒక్కసారి బేధాభిప్రాయాలు వస్తే మాత్రం.. మళ్లీ సర్దుకోవడం చాలా కష్టం.
 

20ఏళ్ల ఏజ్ గ్యాప్..

20ఏళ్ల ఏజ్ గ్యాప్ తొ.. పెళ్లిళ్లు చేసుకోవడం చాలా వేస్ట్. ఇంత గ్యాప్ తో పెళ్లి అస్సలు చేసుకోకూడదు. ఏ ఒక్క విషయంలోనూ అభిప్రాయాలు కలవవు.  లక్ష్యాలు, ఆశయాలు, అభిప్రాయాలు.. ఇలా అన్ని విషయాల్లోనూ వ్యత్సాసం ఉంటుంది. అన్నింటికంటే పెద్దది పిల్లలను కలిగి ఉండటం; పెద్ద జీవిత భాగస్వామి వీలైనంత త్వరగా పిల్లలను కలిగి ఉండాలని కోరుకుంటారు కానీ చిన్న జీవిత భాగస్వామి ఈ అవకాశంపై అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. వారి ఆలోచనా స్థాయిలలో వ్యత్యాసం అతిపెద్ద లోపాలలో ఒకటి.

అసలు... పెళ్లికి ఏజ్ గ్యాప్ మ్యాటరేనా..? అంటే అవుననే చెబుతున్నారు నిపుణులు. రోజు రోజుకీ ప్రపంచం మారిపోతూ ఉంటోంది. కాబట్టి.. ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే.. అభిప్రాయ బేధాలు చాలా ఎక్కువగా ఉంటాయి.  సాధారణంగా, పెద్ద వయస్సు అంతరం, జంటలు ఎదుర్కొనే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చిన్న వయస్సు అంతరం కూడా ప్రభావవంతంగా ఉంటుంది. మరీ ఎక్కువగా , మరీ తక్కువగా లేకుండా చూసుకోవాలి. 

Latest Videos

click me!