అనేక మంది యువతీ యువకులు తమలోని లైంగిక కోర్కెలను అణిచి పెట్టుకోలేక హస్త ప్రయోగం ద్వారా స్వయంతృప్తి పొందుతుంటారు. ఇలాంటి వారిలో కొంతమంది రోజుకు ఐదారుసార్లు కూడా హస్త ప్రయోగం చేస్తుంటారు.
అయితే... ఈ హస్తప్రయోగం అలవాటు పురుషులకు మాత్రమే కాదు.. స్త్రీలల్లో కూడా చాలా మందికి ఉంటుుంది. అయితే.. దీని కారణంగా పురుషులు మాత్రమే ఎక్కువ తృప్తి పొందుతారని అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే.. అది నిజం కాదని నిపుణులు చెబుతున్నారు.
ఈ విషయం గురించి మహిళలు ఎక్కువగా మాట్లాడుకోకపోయినా వారు పొందే సుఖం అమితమైనదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి సంబంధించి వారు ఒక పరిశోధన చేపట్టగా.. మహిళలే హస్త ప్రయోగం బెటర్‌గా చేసుకోగలరని తేలిందట. ట్రోజన్ అనే కండోమ్ బ్రాండ్ 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న 1500 మందిపై సర్వే నిర్వహించింది.
ఆ సర్వేలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది హస్త ప్రయోగం వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందినట్లు వెల్లడించారు. వైబ్రేటర్లు, సెక్స్ టాయ్స్ వంటిని వాడుతూ వాళ్లు తమ కోరికల్ని తీర్చుకుంటున్నారని తేలింది. దీని కారణంగా వాళ్లు తమ లోని ఒత్తిడి పోగొట్టుకోగలుగుతున్నామని చెబుతుండటం విశేషం. అంతేకాకుండా త్వరగా నిద్రపడుతుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. హస్తప్రయోగం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది. ముఖ్యంగా.. కీళ్ల నొప్పులు రావడం, కళ్లకింద నల్లటి మచ్చలు ఏర్పడటం, శరీరమంతా నీరసంగా ఉండటం లాంటివి దీని వల్లే జరుగుతున్నాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే.. అదంతా వట్టి అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.
హస్త ప్రయోగం పై ఉన్నన్ని అపోహలు మరేదానిపై కూడా లేవంటున్నారు. దీని మీద జరిగినంత చర్చ మరే అంశంపై కూడా జరిగి ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. హస్త ప్రయోగం వల్ల సెక్స్ జీవితానికి ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు హామీ ఇస్తున్నారు.
అయితే... చాలా మందికి హస్తప్రయోగం వల్ల పెళ్లికాని వారు వర్జినిటీ కోల్పోయే అవకాశం ఉందని నమ్ముతుంటారు. అయితే.. అది కూడా వట్టి అపోహ అని తేలిపోయింది. కేవలం స్త్రీ అంగంలోని పురుషుడి అంగం చొచ్చుకుపోయినప్పుడు మాత్రమే వర్జినిటీ కోల్పోతారని.. అలా జరగన్పుడు.. వర్జినిటీ కోల్పోయే అవకాశమే ఉండదని చెబుతున్నారు.
అయితే... చాలాల మంది యువతులకు చిన్నప్పటి నుంచే సైకిల్ తొక్కడం, స్కిప్పింగ్ ఆడటం, పరుగు పందేలలో పాల్గొనడం లాంటివి చేస్తుంటారు. అలా చేసేవారికి మాత్రం కన్నెపొర చిరిగిపోతుంది. అంతే తప్ప వారి వర్జినిటీ మాత్రం అలానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంకొందరికి దీని వల్ల నీరసపడిపోతరానే భ్రమ ఉంటుంది. అది కూడా నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. వీర్యం బయటకు వెళ్లడానికే మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. అది దాచుకోవాల్సిన ద్రవం కాదని చెబుతున్నారు. వీర్యం ఎప్పుడెప్పుడు బయటకు వెళదామా అనే చూస్తుందట.
శరీరంలోని వీర్యం 72గంటలలోపు బయటకు వెళ్లాలి. అలా వెళ్లకుండా ఉండిపోతే.. దానిలోని శుక్రకణాలు లోపలే చచ్చిపోతాయి. లేకపోతే.. స్వప్న స్కలనం ద్వారా బయటకు వస్తాయి. ఇదిలా ఉంటే.. హస్త ప్రయోగం కారణంగా పురుషుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.