కలయిక తర్వాత ఇలా చేస్తే గర్భం రాదా..?

First Published Nov 14, 2019, 1:06 PM IST

ఎందుకంటే..కలయిక వెంటనే నీటితో శుభ్రం చేస్తే.. వీర్యం మొత్తం బయటకు వెళ్లిపోతుంది. దీంతో ప్రెగ్నెన్సీ రావడం కుదరదు. అని అనుకుంటూ ఉంటారు. అయితే... దీనిపై నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు.  ఇది కేవలం అపోహ మాత్రమేనని చెబుతున్నారు.

పెళ్లైన దంపతులందరూ తమ జీవితంలోకి మరో చిన్నారిని ఆహ్వానించాలని కోరుకుంటారు. చిన్నారులు ఉండే ఇళ్లు.. ఎంతో ఆనందంగా ఉంటుంది. పాపాయి బోసి నవ్వులు.. కేరింతలు కోరుకోని వారు ఉండరు. అయితే... దంపతులు చేసే కొన్ని చిన్ని చిన్న పొరపాట్ల కారణంగా గర్భం రావడం ఆలస్యం అవుతుందంటున్నారు నిపుణులు.
undefined
చాలా మంది దంపతులు పిల్లలు కలగడం లేదని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారిలో కొందరికి ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుపోయినా.. సంతానం కలగడం ఆలస్యమౌతూ ఉంటుంది.
undefined
అయితే.. కలయిక తర్వాత చేసే కొన్ని పొరపాట్ల కారణంగా పిల్లలు పుట్టరు అని కొందరు భావిస్తుంటారు. కలయిక తర్వాత స్త్రీ, పురుషులు తమ జననాంగాలను శుభ్రం చేసుకుంటారు. అలా చేసుకోవాలి కూడా. కలయిక తర్వాత శుభ్రం చేసుకోకపోతే.. ఇరువురికి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పురుషులు వెంటనే శుభ్రం చేసుకుంటే పర్లేదు.కానీ.. పిల్లలు కావాలనుకుంటున్నవారు మాత్రం స్త్రీలు కలయిక జరిగిన వెంటనే శుభ్రం చేసుకోకూడదు అని కొందరు అంటూ ఉంటారు.
undefined
ఎందుకంటే..కలయిక వెంటనే నీటితో శుభ్రం చేస్తే.. వీర్యం మొత్తం బయటకు వెళ్లిపోతుంది. దీంతో ప్రెగ్నెన్సీ రావడం కుదరదు. అని అనుకుంటూ ఉంటారు. అయితే... దీనిపై నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమేనని చెబుతున్నారు.
undefined
పురుషాంగం నుంచి వీర్యం బయటకు వస్తున్న సమయంలోనే శుక్రకణాలు చిక్కటి, ఓ చిన్న ముద్దలాగా తాయరై వేగంగా బయటకు వస్తాయి. స్ఖలన సమయంలో ఇదేమీ పల్చటి ద్రవంలా ఉండదు. కాబట్టి కడిగేసుకుంటే అంత తేలికగా పోయేది కాదు. పైగా యోని అనేది ఒక సొరంగ మార్గంలా కాకుండా.. ఒక గరిటెలాగా ఉంటుంది.
undefined
దీంతో ఒక్కసారిగా వీర్యం లోపలికి వెళ్లి లోపలే ఉండిపోతాయని నిపుణులు చెబుతున్నారు. వీర్యంలో శుక్రకణాలతోపాటు ఉండే ద్రవమంతా కూడా ఆ శుక్రకణాలకు కావాల్సిన పోషకాహారమే. స్ఖలనం తర్వాత పురుషుడి శరీరం నుంచి బయటపడిన శుక్రకణాలు ఇక అక్కడి నుంచి స్త్రీ శరీరం నుంచి పోషకాలను గ్రహించడమ మొదలుపెడతాయి.
undefined
యోనిలోకి పెట్టిన పురుషాంగం తీసేయ్యగానే యోని దగ్గరకు ముడుచుకుంటుంది. శుక్రకణాలన్నీ లోపల చిక్కుకున్నట్లుగా ఉండిపోతాయి. స్త్రీ బయటి నుంచి.. పైపైన ఎంతగా శుభ్రంగా చేసుకున్నా.. లోపలికి వెళ్లిన శుక్రకణాలు పోవడం లాంటివి ఉండదు అని చెబుతున్నారు.
undefined
కాబట్టి... కలయిక తర్వాత శుభ్రం చేసుకుంటే...గర్భం రాదు అనుకోవడం పొరపాటు. చాలా మంది కలయిక తర్వాత మూత్రం చేస్తే కూడా గర్భం రాదు అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇది కూడా అపోహ అని చెబుతున్నారు.
undefined
click me!