తాజా సర్వే.. వయసు పెరుగుతుందా..? కోరికలు కూడా పెరుగుతాయి

First Published | Nov 14, 2019, 2:21 PM IST

మనిషి మరణించేవరకు వారిలో లైంగిక ఆసక్తి ఉంటుందని ఓ సర్వేలో వెల్లడయ్యింది. అయితే..  యుక్త వయసులో ఉన్న స్థాయిలో ఉండకపోవచ్చు కానీ.. కోరికలు మాత్రం తగ్గవు అంటున్నారు. దాదాపు 2,002మంది వృద్ధులపై సర్వే చేయగా... ఈ విషయం వెల్లడయ్యింది.

మంచి వయసులో ఉన్నవారికి సెక్స్ పట్ల ఆసక్తి, శృంగారంలో పాల్గొనాలనే కోరికలు ఉంటాయి అని మనమంతా అనుకుంటాం. కాస్త వయసు పైబడిన వారిని చూస్తే... జీవితంలో అన్ని చూసేసి ఉంటారు అని భావిస్తాం. కాస్త వయసు మళ్లీ ఇద్దరు దంపతులు కాస్త చనువుగా ఉంటే... ఈ వయసులో ఇదే పాడు బుద్ధి అని నోళ్లు నొక్కుకునేవాళ్లు కూడా ఉంటారు.
undefined
అయితే..కేవలం వయసులో ఉన్నవారికి మాత్రమే కాదు... వయసు మళ్లినవారికి కూడా కోరికలు కలుగుతాయింటున్నారు. వారి వయసు పెరిగే కొద్ది వారిలోని శృంగార వాంఛ తగ్గిపోతుందని అనుకోవడం పొరపాటు అని చెబుతున్నారు.
undefined

Latest Videos


మనిషి మరణించేవరకు వారిలో లైంగిక ఆసక్తి ఉంటుందని ఓ సర్వేలో వెల్లడయ్యింది. అయితే.. యుక్త వయసులో ఉన్న స్థాయిలో ఉండకపోవచ్చు కానీ.. కోరికలు మాత్రం తగ్గవు అంటున్నారు. దాదాపు 2,002మంది వృద్ధులపై సర్వే చేయగా... ఈ విషయం వెల్లడయ్యింది.
undefined
65 ఏళ్లు పైబడిన వారిలో 52 శాతం మంది తాము కోరుకొనే స్థాయిలో శృంగారానుభూతిని పొందలేకపోతున్నామని చెప్పారు. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో, తొలి డేట్ సందర్భంగానే సెక్స్‌లో పాల్గొనేందుకు తాము సిద్ధమని మూడో వంతు మంది తెలిపారు.
undefined
75 ఏళ్లు పైబడిన ప్రతీ పదిమందిలో ఒకరు వారికి 65 ఏళ్లు నిండినప్పటి నుంచి ఒకరి కంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొన్నారు.శృంగారానికి వయసు అడ్డు కాదని సర్వే చేబుతోంది. 65ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నవారిలో ప్రతి ఆరుగురిలో ఒకరు తాము శృంగారానికి దూరంగా ఉండటానికి ప్రధాన కారణం అవకాశం దొరకకపోవడమే అంటుడం విశేషం.
undefined
80ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్నవారిలో ప్రతి ఆరుగురిలో ఒకరు మాత్రమే కోరుకున్నంత శృంగారాన్ని పొందగలుగుతున్నామని చెబుతున్నారు. సెక్స్ విషయంలో 65 ఏళ్లు పైబడినవారు చాలా మంది అనుకొనేదాని కన్నా చురుగ్గా ఉంటారని సర్వేలో తేలింది.
undefined
కొత్తవారితో సంభోగంలో పాల్గొనేటప్పుడు, శృంగారం వల్ల సంక్రమించే ఇన్‌ఫెక్షన్లను(ఎస్‌టీఐలను) నివారించేందుకు తాము ముందస్తు జాగ్రత్తలేమీ తీసుకోవట్లేదని 65 ఏళ్లు పైబడినవారిలో ప్రతీ 11 మందిలో ఒకరు సర్వేలో చెప్పడం విశేషం.
undefined
click me!