ఈ ప్రపంచంలో ప్రతీ వ్యక్తి ప్రత్యేకమే. ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి నచ్చనిదాన్ని మరొకరు మెచ్చుకోవచ్చు. కానీ కొంతమంది పురుషుల్లో మహిళలకు నచ్చని కొన్ని లక్షణాలు ఉన్నాయి. కొంతమంది మహిళలు ఈ లక్షణాలు ఉన్న పురుషులను ఇష్టపడకపోవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం పదండి.
కమ్యూనికేషన్ లోపం
సంబంధంలో కమ్యూనికేషన్ చాలా చాలా అవసరం. ఈ కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే సంబంధంలో ఎన్నో సమస్యలు వస్తాయి. పురుషులు తమ భావాలను వ్యక్తీకరించలేకపోతే లేదా వారి ఆలోచనలు, భావాలను అర్థం చేసుకోలేకపోతే కొంతమంది మహిళలు నిరాశ చెందుతారు. ఏలాంటి సంబంధమైనా సరే కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అలాగే వారితో మనస్ఫూర్తిగా మాట్లాడకపోవడం వల్ల ఎన్నో గొడవలు జరుగుతాయి. అపార్థాలు వస్తాయి. చివరికి బంధం విడిపోయే దాకా వస్తుంది. అందుకే కొంతమంది మహిళలు స్పష్టమైన కమ్యూనికేషన్ లేని పురుషులను ఇష్టపడరు.
అగౌరవ ప్రవర్తన
సాధారణంగా మహిళలు అగౌరవపరిచే ప్రవర్తనను అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా ఇతరులను కించపరచడం, నిర్లక్ష్య వైఖరి గుణాలున్న వారంటే అస్సలు ఇష్టపడరు. ఒకరినొకరు గౌరవించుకుంటేనే సంబంధాలు బలంగా ఉంటాయి. గౌరవం ఇవ్వని సంబంధాలు అసంతృప్తిని కలిగిస్తాయి. అందుకే తమను అవమానించే ధోరణి ఉన్న పురుషులను మహిళలు ఇష్టపడరు.
తమను గౌరవించని పురుషులను మహిళలు ఇష్టపడరు. కొంతమంది మహిళలు తమపై దృష్టి పెట్టడం లేదని భావించొచ్చు. ముఖ్యంగా ఎంతో ముఖ్యమైన తేదీలను మర్చిపోవడం నుంచి మాట్లాడుకునే సమయంలో వాటిని వినకపోవడం వరకు చిన్న చిన్న విషయాలు కూడా మహిళల్లో అసంతృప్తిని కలిగిస్తాయి. సంబంధంపై ఆసక్తి ఉన్న పురుషులను, ప్రతి చిన్న విషయాన్ని గుర్తుంచుకుని వారిని సంతోషపెట్టే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు.
వృత్తిపరమైన జీవితం అయినా, వ్యక్తిగత ఎదుగుదల అయినా జీవితంలోని వివిధ అంశాల్లో చొరవ చూపని పురుషులను మహిళలు ఇష్టపడరు. రిలేషన్ షిప్ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. మితిమీరిన అభద్రతాభావం, అసూయ ఉన్న భాగస్వామిని కూడా మహిళలు ఇష్టపడరు. నువ్వు నాకు మాత్రమే చెందుతావనే భావన కొంతవరకు సహజమే కావొచ్చు. కానీ మహిళలను ఎక్కువగా నియంత్రించే లేదా ఎల్లప్పుడూ వారిని అనుమానించే పురుషులను మహిళలు అస్సలు ఇష్టపడరు. ఆరోగ్యకరమైన రిలేషన్ షిప్ లో నమ్మకం ఒక ముఖ్యమైన భాగం. అలాగే ఎక్కువ అసూయ ఆ నమ్మకాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ లక్షణాలున్న పురుషులను మహిళలు ఇష్టపడరు.