కొత్తగా పెళ్లైందా? ఫస్ట్ నైట్ గురించి ముందే ఈ విషయాలను తెలుసుకుంటే.. ఆ రాత్రిని బాగా ఎంజాయ్ చేస్తారు

First Published | Nov 25, 2023, 2:08 PM IST

ప్రస్తుతం ఎక్కడా చూసినా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే ఫస్ట్ నైట్ గురించి అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. వారు అనుకున్నట్టు జరగకపోతే ఎంతో డిసప్పాయింట్ అవుతారు. అలాగే గొడవలు, ఇతర సమస్యలు కూడా రావొచ్చు. అందుకే ఫస్ట్ కు ముందే కొన్ని విషయాలను మీరు తెలుసుకుంటే ఇలాంటి సమస్యలేం రావు. 
 

ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎక్కడ చూసినా పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో కొత్త కొత్త ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న జంటలలు తొలిరాత్రి గురించి ఎన్నో కలలు కంటుంటారు. నిజానకి చాలా మందికి ఫస్ట్ నైట్ గురించి సరైన అవగాహన ఉండదు. అంటే ఎన్నో అపోహలను గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఇవే వారిని ఎన్నో సమస్యల్లోకి నెడతాయి.

ప్రతి జంట తమ వైవాహిక జీవితం అద్భుతంగా సాగాలని కోరుకుంటారు. అయితే తొలిరాత్రిపై ఎన్నో దుష్ప్రచారాలు, అపోహలు ఉండటంతో నవ వధూవరులు  ఎంతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా స్నేహితులు, బంధువులు చెప్పే ఎన్నో విషయాలు వారిని అయోమయానికి గురిచేస్తాయి. ఇవి వారి మొదటి రాత్రిని పాడు చేసుకోవడమే కాకుండా.. వారి జీవితాన్ని సందేహాలతో నింపుతాయి. మరి మొదటి రాత్రి గురించి ఎలాంటి విషయాలను నమ్మకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
 


రక్తస్రావం

చాలా మంది పురుషులు సెక్స్ లో పాల్గొన్న మొదటి రాత్రి మహిళలకు రక్తస్రావం అవుతుందని నమ్ముతారు. అలా జరగకపోతే ఆమె కన్య కాదని వారిని అనుమానించడం మొదలుపెడతారు. నిజమేంటంటే.. ఇది పూర్తిగా అవాస్తవం. 

నిజానికి కన్నెపొర చాలా పల్చగా ఉంటుంది. ఇది చీలిపోవడం వల్ల రక్తస్రావం కలుగుతుందిజ. కానీ అది కేవలం సెక్స్ వల్లే చిరిగిపోదు. ముఖ్యంగా టీనేజ్ లో ఉన్నప్పుడు సైక్లింగ్ చేయడం, ఎక్కువ బరువు మోయడం, స్పోర్ట్స్ ఆడటం వంటి వివిధ కారణాల వల్ల ఈ పొర చిరిగిపోతుందని డార్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 63 శాతం మంది మహిళలు మొదటిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు రక్తస్రావం జరగదని ఒక అధ్యయనం కనుగొంది.
 

ఆడవారు భయపడతారు

శృంగారంలో పాల్గొనాలంటే చాలా మంది మహిళలు ఎంతో భయపడతారు. ఎందుకంటే కొంతమంది మహిళలకు సెక్స్ తర్వాత తీవ్రమైన యోని మంట కలుగుతుంది. అయితే ఇది సర్వసాధారణమైన విషయమని డాక్టర్లు చెబుతున్నారు. కానీ దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమస్య రావొద్దంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుని సేఫ్ సెక్స్ లో పాల్గొనాలి. 
 

సౌండ్స్

శృంగారంలో ఆహ్లాదకరమైన సౌండ్స్ చాలా సహజం. కానీ కొందరు మాత్రం గట్టి గట్టిగా అరుస్తుంటారు. కొంతమంది సెక్స్ సమయంలో ఎక్కువ శబ్దం చేయొద్దని చెప్తుంటారు. నిజానికి ఈ సౌండ్స్ మీకు ఎక్కువ ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా సెక్స్ లో ఎక్కువగా పాల్గొనడానికి సహాయడపడతాయి. అందుకే వీటన్నింటినీ పట్టించుకోకుండా సౌండ్ తో శృంగారాన్ని ఆస్వాదించండి.
 

నొప్పి

చాలా మంది మహిళలు మొదటిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు వారికి విపరీతమైన నొప్పి కలుగుతుంది. అయితే మీరు ఎక్కువగా ఫోర్ ప్లేలో పాల్గొనండి. ఇది నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

కండోమ్ లేకుండా..

కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొంటే మంచిదని స్నేహితులు సలహానిస్తుంటారు. దీనివల్ల శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారని చెప్తారు. కానీ ఇది మంచిది కాదు. సురక్షితమైన సెక్స్ కోసం ముందుగానే కండోమ్ ధరించడం మంచిదని నిపుణులు సలహానిస్తున్నారు. 
 

పరిమాణం ముఖ్యం

శృంగారంలో పురుషాంగం పరిమాణం చాలా ముఖ్యమని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి దీనిలో అస్సలు నిజం లేదు. ఎందుకంటే పురుషాంగం పరిమాణం కంటే భాగస్వాముల మధ్య సాన్నిహిత్యం, కంఫర్ట్ లెవెల్, ప్రేమే చాలా ముఖ్యం.

Latest Videos

click me!