Happy Valentine's Day: ప్రేమికులు ఎదురుచూసే రోజు వచ్చేసింది.. మీ ప్రియమైన వ్యక్తికి ఇలా విష్ చెయ్యండి!

First Published | Feb 14, 2022, 8:20 AM IST

Happy Valentine's Day: ప్రేమికులు ప్రతి ఏటా ఎంతో ఆశగా ఎదురు చూసే రోజుల్లో వాలెంటైన్స్ డే (ప్రేమికుల దినోత్సవం) ఒకటి అని చెప్పవచ్చు. ఎంతోమంది ప్రేమికులు ఈ రోజు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 14వ తేదీ ప్రతి ఏడాది ప్రేమికుల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
 

ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఒక వారం రోజులపాటు ఈ ప్రేమికుల దినోత్సవ వారోత్సవాలు జరుగుతాయి. ఈ క్రమంలోనే మొదటగా రోజ్  డేతో ప్రారంభం అవుతుంది. ఇలా మొదటి రోజు మనకు ఎవరిపై ప్రేమ ఉందో వారికి ఇలా రోజ్ ఇచ్చి వారిలో ఉన్న ప్రేమను వ్యక్త పరుస్తారు. ఈ విధంగా వారి ప్రేమకు పునాది రోజ్  డేతో ప్రారంభం అవుతుంది. అలాగే ప్రపోస్ డే, చాక్లెట్ డే రోజు చాక్లేట్ ద్వారా ప్రేమికులు నోటిని తీపి చేసుకుంటారు, టేడ్డిడే రోజు టెడ్డీబేర్ బహుమతిగా ఇచ్చి తన ప్రేమను తెలియజేస్తారు.
 

ఇక ప్రామిస్ డే రోజు ఎలాంటి సమయంలో కూడా తాను వదిలిపెట్టనని కష్టసుఖాలలో తనకు తోడుగా ఉంటానని ఎలాంటి పరిస్థితులలో కూడా ఇచ్చిన మాట తప్పను అంటూ ప్రామిస్ చేస్తారు. హగ్ డే రోజు ఒకరికొకరు ఆప్యాయంగా హగ్ చేసుకుంటారు.
 


కిస్ డే రోజు ప్రేమికుల జంట వారి మధ్య ఉన్న హద్దులు చేరుపుతూ ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. ఈ విధంగా వారం రోజుల పాటు ప్రేమికుల వారోత్సవాలు జరుగుతాయి. ఇక చివరిగా ప్రేమికులు ఫిబ్రవరి 14వ తేదీని ప్రేమికుల దినోత్సవంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
 

ఇలా ఏడాది మొదట్లో వచ్చే ప్రేమికుల దినోత్సవాన్ని ప్రేమికులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఒకరికొకరు కానుకలు ఇచ్చుకోవడం, ఒకరి పై ఉన్న ప్రేమను మరొకరు వ్యక్తపరుస్తూ ఈ రోజు మొత్తం ప్రేమికులు ప్రేమలో మునిగి తేలుతుంటారు.
 

రోజంతా మీ ప్రియమైన వారితో సమయం గడుపుతూ వారు సంతోషంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి . అయితే ఈ రోజు ఏం చేసినా మంచి మనసుతో ప్రేమతో చేయాలి. హృదయంతో నిండిన ప్రేమను వ్యక్తపరచడం ఈ ప్రేమికుల దినోత్సవం.
 

ఈ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంతోమంది ప్రేమికుల వారి ప్రేయసికి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. వాట్సాప్, ఫేస్ బుక్ వంటి వాటి ద్వారా తమలో ఉన్న ప్రేమను కొటేషన్లు రూపంలో తెలియజేస్తూ ఉంటారు.
 

ఈ క్రమంలోనే కొందరి ప్రేమికులలో దాగి ఉన్న రచయితలు బయటపడి ఎంతో అద్భుతమైన కవిత్వాన్ని అల్లుతూ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రేమికులు ఈ రోజు ప్రేమికుల దినోత్సవాన్ని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. మీ ప్రియురాలుకు, ప్రియుడుకు పంపాల్సిన కొన్ని క్యూట్ విశేష్ ఇక్కడ తెలుసుకొని పంపండి...
 

నీ ప్రేమ ఒక అనుబంధం
నీ ప్రేమ కోసం అనుక్షణం నిరీక్షిస్తాను
- హ్యాపీ వాలెంటైన్స్ డే
జీవితం ఓ ప్రయాణం... జీవనం ఓ ప్రమాణమని ఎవరో అన్నారు.
నీతో జీవితం నా ప్రయాణం కావాలి. నీ ప్రేమ నాకు ప్రమాణం కావాలి
- హ్యాపీ వాలెంటైన్స్ డే

ప్రేమించాలంటే మనసుండాలి ప్రేమను తెలపాలంటే ధైర్యముండాలి ప్రేమను పొందాలంటే సహనముండాలి. ప్రేమించబడాలంటే అదృష్టముండాలి. ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలంటే నమ్మకం ఉండాలి.
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

నువ్వులేని ఈ క్షణము ఓ యుగంలా ఉంది. యుగమంతా ఎదురుచూస్తా నీతో గడిపే ఆ క్షణం కోసం
- హ్యాపీ వాలెంటైన్స్ డే
పరిస్థితుల్ని బట్టి మారిపోయేది ప్రేమ కాదు పరిస్థితుల్ని అర్థం చేసుకునేది అసలైన ప్రేమ - హ్యాపీ వాలెంటైన్స్ డే
మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు. మనల్ని వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ!
 

నిను చూసాకే తెలిసింది. నా కలలు నిజమవుతాయని.. నిను పలకరించాకే తెలిసింది నా మౌనానికి మాటలు వచ్చని.. నిను కలిసాకే తెలిసింది. నాకూ ఓ మనసుందని.. నిను చేరాకే తెలిసింది. నా హృదయానికి స్పందన ఉందని... నిను ప్రేమించాకే తెలిసింది. నా ప్రపంచమే నువ్వని... నీతో జీవితం పంచుకున్నాకే తెలిసింది ప్రతి రోజూ ఒక ప్రేమికుల రోజని..
 

ఓ ప్రియతమా,
నీ గమ్యం లేని గమనం లేదు నా పయనానికి.. నీ రూపం లేని స్వప్నం లేదు నా కనులకి... నీ భావం లేని కవిత లేదు నా కాలానికి.....
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

Latest Videos

click me!