Valentine Week of 2022 : మీరెలాంటి గర్ల్ ఫ్రెండ్? దుంప తెంచుతారా? ప్రేమలో ముంచేస్తారా?..

Published : Feb 11, 2022, 01:08 PM IST

ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మీరు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్... మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి విషయంలో మీరు ఎలా ఉంటారు? దుంప తెంచుతారా? ప్రేమలో ముంచేస్తారా? సరదాలతో సరాగాలు కురిపిస్తారా? మీ రాశిచక్రం ఏం చెబుతోంది... చూడండి... 

PREV
113
Valentine Week of 2022 : మీరెలాంటి గర్ల్ ఫ్రెండ్? దుంప తెంచుతారా? ప్రేమలో ముంచేస్తారా?..

గర్ల్ ఫ్రెండ్ అనగానే గారం చేయించుకోవడానికి ఇష్టపడతారు. ప్రేమగా బుజ్జగించాలి, బతిమాలాలి.. అపురూపంగా చూసుకోవాలని కోరుకుంటారు. అయితే అదే సమయంలో మీరు ప్రేమించే వ్యక్తిని అంతే అపురూపంగా చూసుకోవడానికి కూడా ఇష్టపడతారు. గర్ల్ ఫ్రెండ్ గా మీలో అనేక కోణాలుంటాయి. మీలోని అనేక గుణాలను మీ రాశిచక్రం నిర్ణయిస్తుందన్న విషయం మీకు తెలుసా?

213
aries

మేషం (Aries)
మేషరాశివారు అత్యంత సాహసోపేతమైన స్నేహితురాలుగా ఉంటారు. వీరు ఎవ్వరి జీవితంలోనైనా ఎంతో ఎనర్జీని నింపుతారు. జీవిత పయనంలో ఎదురయ్యే.. వివిధ పరిస్థితులకు తొందరగా అడాప్ట్ అయిపోతారు. ఎత్తుపళ్లాలను ఈజీగా ఎదుర్కొని, సమస్యలను ధైర్యంగా ఎదురొడ్డి ఎదుర్కుంటారు. కానీ విడిచిపెట్టడమో, సాకులు చెప్పడమో చేయరు. 

313
Taurus

వృషభం(Taurus)
మీరు చాలా స్వీట్ గర్ల్ ఫ్రెండ్. దీంతో పాటు చాలా హేతుబద్ధంగా ఆలోచిస్తారు కూడా. ఏదైనా సందర్భంలో గొడవలు అయినప్పుడు మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా, స్పష్టంగా తెలియజేస్తారు, మీరేలా ఆలోచిస్తున్నారో.. మీ భాగస్వామికి తెలిసేలా క్లియర్ గా చెబుతారు. దానిమీద అతని రియాక్షన్ అతనికే వదిలేస్తారు.

413

మిథునం (Gemini)
సహజంగానే మీరు చక్కటి గర్ల్ ఫ్రెండ్. ఎంతో అందమైన బంధాన్ని ఇస్తారు. కానీ, ప్రేమతో ఆంక్షలకు కట్టుబడడం మీకు ఇష్టం ఉండదు. పదే పదే వెనకబడి నీడలా తిరగడాన్ని తట్టుకోలేరు. అలాగని అతని నుంచి దూరం అవ్వడానికి ఇష్టపడరు. 

513

క్యాన్సర్ (Cancer)
ఈ రాశివారు ప్రేమను బేషరతుగా అందిస్తారు. చాలా సున్నితమైన స్నేహితురాలు మీరు. చాలా లోతైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. బాగా శ్రద్ధ చూపిస్తారు. అయితే, కొన్నిసార్లు మీ భాగస్వామికి ఇది కొంచెం చికాకును కలిగిస్తుంది. 

613
(Leo)

సింహరాశి(Leo)
ఈ రాశి అగ్నికి సంకేతం.. చాలా బోల్డ్ గా ఉంటారు. అటెన్షన్ తనమీద ఉండాలని.. గుర్తించబడడాన్ని ఇష్టపడతారు. మీ భాగస్వామిని మీకు భయపడేలా చేసుకుంటారు. దీంతోపాటు మీ భాగస్వామి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే సామర్థ్యమూ మీకు ఉంటుంది. మీ బంధాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో మీకు బాగా తెలుసు. దీనికి మీ లోపి ఫైర్ బాగా ఉపయోగపడుతుంది. 

713
Virgo

కన్య(Virgo)

ఈ రాశివారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. మీ భాగస్వామికి చాలా ముఖ్యమైనవారిగా ఉంటారు. అంతేకాదు చాలా బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉంటారు. ఈ లక్షనం వల్లే అతను మిమ్మల్ని చాలా విలువైనవారిగా పరిగణిస్తారు. అస్థిర పరిస్థితులలో మీరు వజ్రంలా మీ భాగస్వామికి కనిపిస్తారు. 

813
Libra

తులారాశి (Libra)
మీ భాగస్వామికి మీరు ఎల్లప్పుడూ అవసరమైన మంచి స్నేహితురాలిగా ఉంటారు. మీరు సామరస్యాన్ని విశ్వసిస్తారు. అన్నింటినీ స్థిరంగా ఉంచాలనే మీలో ఉన్న అభిరుచి.. మీ భాగస్వామికి శాంతిని కలిగిస్తుంది.

913
(Scorpio)

వృశ్చిక రాశి (Scorpio)
స్కార్పియన్‌గా, మీరు చాలా సెన్సిబుల్ గా ఉంటారు. అలా ఉండడానికే ఇష్టపడతారు. అయితే మిమ్మల్ని హర్ట్ చేస్తే మాత్రం మామూలుగా వదలిపెట్టరు. అంతకంటే ఎక్కువ హర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. మీది చాలా ఆకర్షణీయమైన, నమ్మకమైన వ్యక్తిత్వం. ఏ రిలేషన్ లో నైనా మీరు మరపురాని, ఇర్రెసిస్టిబుల్‌గా ఉంటారు.

1013
Sagittarius

ధనుస్సు (Sagittarius)
కొంచెం మందబుద్దిగా ఉన్నా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. కామెడీ కింగ్ అనుకోవచ్చు. దీంతో మీ ప్రియుడు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు. మీలోని స్వేచ్ఛా స్ఫూర్తి మీ భాగస్వామిని ప్రతిరోజూ మీతోనే ఉండాలని కోరుకునేలా చేస్తుంది. అతనితో గడపడానికి మీరూ అంతే ప్రయత్నం చేస్తారు. మీలోని ఆశావహ దృక్ఫథం అతన్ని బాగా ఆకర్షిస్తుంది. 

1113
Image: Getty Images

మకరం (Capricorn)
కాస్త ఓల్డ్ ఫ్యాషన్ గా ఉంటారు. కానీ చాలా మెచ్యూర్డ్ వ్యక్తులు. అందుకే మీ ప్రేమను చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇలాంటి వారికి సరైన వ్యక్తి దొరికితే చక్కటి ప్రశంసలు పొందుతారు. 

1213
(Aquarius)

కుంభం (Aquarius)
కుంభరాశిగా, మీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీరు చాలా ఉద్వేగభరితమైన స్నేహితురాలిగా ఉంటారు. మీకు కానీ తగినంత టైం స్పెండ్ చేయలేదనుకోండీ.. మీ భాగస్వామికి చుక్కలు చూపిస్తారు. 

1313
(Pisces)

మీనం (Pisces)
స్నేహితురాలుగా మీరు ఇతర ప్రాపంచికులు కానీ మీ ఆధ్యాత్మికత అతన్ని మీతో అతుక్కుపోయేలా చేస్తుంది. శాంతిని ప్రేమించే నో డ్రామా అమ్మాయిలు ఈ రాశివారు. మీరు అనవసరమైన ఉద్రిక్తతను కరిగించడానికి ప్రయత్నిస్తారు, దీనివల్ల మీ భాగస్వామి కూడా ప్రశాంతంగా ఉంటాడు. మీ సపోర్టివ్‌గా ఉండే మీ సామర్థ్యం అతను మిమ్మల్ని ఎక్కువగా ఆదరించేలా చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories