భర్త కోపం వెనుక దాగి ఉన్న ప్రేమను అమ్మాయిలు ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా?

First Published | Feb 12, 2022, 3:08 PM IST

వివాహబంధంతో ఒక్కటైన భార్య భర్తల జీవితంలో కోపతాపాలు (Anger) సర్వసాధారణం. బంధంలో మాటలతో గొడవలు రాకుండా చూసుకోవాలి. ఎవరో ఒకరు తగ్గి ప్రేమతో సర్దుకుపోవాలి. అలా కాకుండా వాదనకు (Argument) దిగితే హద్దులు దాటే ప్రమాదం ఉంది. వారి వెనుక గల కోపానికి అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. ఇలా భర్త కోపం వెనుక దాగి ఉన్న ప్రేమను ఎలా అర్థం చేసుకుంటే దాంపత్యజీవితం బాగుంటుందో తెలుసుకుందాం..

దాంపత్య జీవితంలో ఏ కారణం చేతనైనా గొడవ (Conflict) మొదలయితే భర్త ఆవేశం హద్దులు దాటితే మీరే సారీ చెప్పవచ్చు. దాన్ని చిన్నతనంగా భావించరాదు. మీ గోడలకు ముగింపు కోరడాన్ని చిన్నతనంగా ఆలోచించరాదు. భర్త తన తప్పును ఒప్పుకొని అహాన్ని, పురుషాధిక్యతను పక్కన పెట్టి క్షమాపణ (Apologies) కోరినప్పుడు భార్య వెంటనే క్షమిస్తే బంధం బలపడుతుంది.

అలాకాకుండా వాదనకు దిగితే అప్పుడు అది  పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. వాదన కారణంగా ఎటువంటి పరిష్కారం (Solution) లభించదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని పెద్దలు అంటారు. కనుక ఇద్దరూ ఒకరికొకరు పరస్పరం అర్థం చేసుకుంటూ గొడవలను సామరస్యంగా (Harmony) పరిష్కరించుకోవాలి.
 


అతిగా మాట్లాడి వాదనకు దిగితే పొరపాట్లు (Mistakes) జరిగే అవకాశం ఉంటుంది. బయట వ్యక్తులు మనల్ని ఓ మాట అంటే పెద్దగా పట్టించుకోము. మనం మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు, ఆత్మీయులు, బాగా ఇష్టమైన వారు మనపై కోపగిస్తే మనసుకు చాలా బాధ (Suffering) కలుగుతుంది. వారు అన్నమాట చిన్నదే అయినా మనసుకు ఎంతగానో బాధ కలుగుతుంది.

ఇలా బాధ కలగడానికి వారిపై పెంచుకున్న ప్రేమ (Love), నమ్మకం (Believe) కారణం. మనకు ఇష్టమైన వారు మనల్ని ఒక మాట అన్నారంటే అందులో కోపాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే బంధం మధ్య దూరం ఏర్పడి బంధం బీటలు వారే అవకాశం ఉంటుంది. కనుక మనకు ఇష్టమైన వారు మనపై కోపగించుకున్నప్పుడు ఆ కోపం వెనుక ఉన్న ప్రేమను అర్థం చేసుకోవాలి.

అప్పుడే బంధం బలపడుతుంది. ఇలా వారి కోపం వెనుక ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటే బంధం (Bonding) పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది. మనకు ఇష్టమైన వారు మనపై కోప్పడ్డారంటే అది కచ్చితంగా మన మంచి కోసమే అని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా మీ తప్పు లేకుండా వారు అనవసరంగా (Unnecessarily) కోప్పడ్డారంటే మీ తప్పులు ఏమీ లేదని వారికి వివరంగా అర్థం అయ్యేలా చెప్పాలి.

అదేవిధంగా కోప్పడింది మనకు ఇష్టమైన వారే కదా పోనీలే (Adjusted) ఏదో చికాగోలో అని ఉంటారని అని సర్దుకుపోయి మనల్ని కాకపోతే ఎవరిని అంటారని ఆ కాస్త సమయం మౌనంగా (Silence) ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ఏ బంధంలోనైనా ఆలోచిస్తే ఆ బంధం బలంగా ఉంటుంది.
 

Latest Videos

click me!