Happy Teddy Day 2022: మీ ప్రియమైన వ్యక్తికి టెడ్డీ డే రోజు ఇలా విష్ చెయ్యండి!

First Published | Feb 10, 2022, 8:16 AM IST

Happy Teddy Day 2022: నేడు టెడ్డీ డే.. వాలెంటైన్స్ డేకు వారం ముందు నుంచే వాలెంటైన్ వీక్ ప్రారంభం అవుతుంది. అలా ప్రారంభమైన వీక్ లో మొదటి రోజు రోజ్ డే, రెండో రోజు ప్రపోజ్ డే, మూడో రోజు చాక్లెట్ డే, నాలుగో రోజు టెడ్డీ డే జరుపుకుంటారు. అలా ఈరోజు ప్రేమికులు జరుపుకునే టెడ్డీ డే గురించి తెలుసుకొని మన ప్రియమైన వారికి టెడ్డీ డే శుభాకాంక్షలు చెపుదాం..
 

ప్రియమైన వ్యక్తులకు ఈరోజు టెడ్డీ ఇచ్చి టెడ్డీ డే శుభాకాంక్షలు చెప్తుంటారు. అమ్మాయిలకు చిన్నప్పటి నుంచి మొదటి ఫ్రెండ్ గా టెడ్డీ బేర్స్ ఉంటాయి.. నిజానికి మన ప్రియమైన వారికి గిఫ్ట్ గా ఇవ్వడానికి టెడ్డి బాగా సెట్ అవుతుంది.. టెడ్డీ బేర్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే..
 

అందుకే మొదటి మూడు రోజుల్లో రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే లలో కూడా రోజ్ తో టెడ్డీ, ప్రపోజ్ డే రోజు టెడ్డి బేర్ ని, చాక్లెట్ డే రోజు కూడా ప్రియమైన వారికి టెడ్డీ బెర్ ఇస్తారు. అలాంటిది ఈరోజు టెడ్డి బెర్ డే కాబట్టి టెడ్డి బెర్ ని ఇచ్చి ఇలా శుభాకాంక్షలు చెప్పండి..
 


నేను ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా..
నా మనసు నీతోనే ఉంటుంది..
నీ గురించే ఆలోచిస్తుంది..
ఈ టెడ్డీ నా ప్రేమను నీతో షేర్ చేసుకుంటుంది..
(Happy Teddy Day 2022)

నేను ఏడిస్తే నువ్వు తట్టుకోగలవేమో.. కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చనిపోతా.. అంతలా పిచ్చి ప్రేమ నువ్వంటే.. (Happy Teddy Day 2022)
హ్యాపీ టెడ్డీ డే
 

జీవితమనే పడవ ప్రయాణంలో ఎందరు ప్రయాణికులున్నా.. నా జీవితాన్ని మాత్రం నీతో పంచుకుంటా.. అలాంటి అవకాశం నాకే కావాలని కోరుకుంటా..
హ్యాపీ టెడ్డీ డే (happy teddy day 2022)
 

ప్రియా నిన్ను ప్రేమించాకే తెలిసింది...
కనులతో కూడా మాట్లాడవచ్చని...
హృదయంతో కూడా చూడవచ్చని...
మౌనంతో కూడా భాష ఉంటుందని...
మనసులో మనసును చదవవచ్చని..
హ్యాపీ టెడ్డీ డే (happy teddy day 2022)

కళ్ళకు నచ్చిన వారిని కన్నుమూసి తెరిచేలోగా మరిచిపోవచ్చు కానీ..
మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరువలేము...
హ్యాపీ టెడ్డీ డే (happy teddy day 2022)

తెలియని వ్యక్తిగా పరిచయం అయ్యావు....
ప్రేమ అనే బంధంతో ప్రాణం అయ్యావు.....
నా మనసులో చెరగని రూపమై నిలిచావు....
ఏ జన్మ బంధానిలో తెలియదు కానీ...
ఈ జన్మలో అనుబంధమై చేరావు....
మన బంధం ఏమిటో మాటల్లో చెప్పడానికి ఈ ప్రపంచంలో ఏ బాషాలో ఏ పదం సరిపోదు.... ఎందుకంటే కళ్ళ ముందు ఉంటేనే గుర్తు పెట్టుకునే ఈ రోజుల్లో ఎప్పటికీ మనం కలిసి ఉండలేం అని తెలిసినా కలువరించే అనుబంధానివి నీవు... లవ్ యు బంగారం
హ్యాపీ టెడ్డీ డే (happy teddy day 2022)
 

పదిసార్లు కలిసి, పది నెలలు తిరిగి రోజుకు పది మెసేజ్ లు పంపుకుంటే పుట్టేది ప్రేమ కాదు అలవాటు... 
ఒక్కక్షణంలో పుట్టేదే ప్రేమంటే క్షణంలో పుట్టే ప్రాణం నిజం అయినప్పుడు క్షణంలో వచ్చే చావు నిజం అయినప్పుడు క్షణంలో పుట్టే ప్రేమ కూడా అంతే నిజం...
హ్యాపీ టెడ్డీ డే (happy teddy day 2022)

భాషలు వేరైనా భావాలు ఒక్కటే..
మనసులు వేరైనా మమతానురాగాలు ఒక్కటే..
దారులు వేరైనా గమ్యం ఒక్కటే..
నువ్వు నేను వేరైనా మన ప్రేమ ఒక్కటే.....
హ్యాపీ టెడ్డీ డే (happy teddy day 2022)

Latest Videos

click me!