valentine Week: నేడు చాక్లెట్ డే.. స్పెషాలిటీ ఏంటి..?

First Published | Feb 9, 2022, 10:35 AM IST

ప్రేమించిన వారికి చాక్లెట్ బహుమతిగా ఇవ్వడం వల్ల... వారికి మీ పై ప్రేమ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు.. చాక్లెట్లు ఇచ్చి పుచ్చుకోవడం వల్ల..  ఇద్దరి మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంట.

వాలంటైన్ వీక్ లో భాగంగా.. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన  చాక్లెట్ డే సెలబ్రేట్ చేసుకుంటారు.  వాలంటైన్ వీక్ లో.. చాక్లెట్ డే కి ప్రాముఖ్యత ఎక్కువ. సాధారణంగా... చాక్లెట్ తియ్యగా ఉంటుంది కాబట్టి.. శుభం జరుగుతుందని భావిస్తారు. అందుకే.. తమకు నచ్చిన వారికి ప్రేమతో చాక్లెట్ ని అందిస్తూ ఉంటారు. మరి ఈ చాక్లెట్ డే గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా..

ఎవరికైనా మన ప్రేమను తెలియజేయాలన్నా.. మన ఫీలింగ్స్ వారికి అర్థం కావాలన్నా.. చాక్లెట్ ఇస్తే సరిపోతుందట. ఎందుకంటే.. చాక్లెట్ మన ప్రేమ, ఎఫెక్షన్ ని తెలియజేసే శక్తి కలిగి ఉంటుందట. అందుకే.. ఇష్టమైన వారికి చాక్లెట్ ఇవ్వాలట. ఈ చాక్లెట్ డే రోజున మీరు మీకు నచ్చిన వారికి చాక్లెట్ ఇచ్చేయండి.

Latest Videos


చాక్లెట్ ఒక బైట్ కొరుక్కొని తిన్న తర్వాత.. దాదాపు ఎవరిలో అయినా.. ప్రేమ కలిగిన ఫీలింగ్ కలుగుతుందట. అందుకే.. ప్రేమికులకు ఈ చాక్లెట్ కి వీడదీయరాని సంబంధం ఉందని చెబుతుంటారు.

ప్రేమించిన వారికి చాక్లెట్ బహుమతిగా ఇవ్వడం వల్ల... వారికి మీ పై ప్రేమ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు.. చాక్లెట్లు ఇచ్చి పుచ్చుకోవడం వల్ల..  ఇద్దరి మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంట.
 

ఇదే కాక.. చాక్లెట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శరీరంలో రక్త ప్రసరణ బాగా జరగడానికి సహకరిస్తాయి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయి.
 

అంతేకాకుండా.. చాక్లెట్స్ మూడ్ ని మార్చేస్తాయి. ఒక్కసారి నోట్లో చాక్లెట్ వేసుకోవడం వల్ల.. ఫీల్ గుడ్ మూడ్ కలిగేలా.. శీరరంలో హార్మోన్లు విడుదలౌతాయట. ఒంటరిగా అనిపించినప్పుడు, బాధ కలిగినప్పుడు.. ఒక్కోసారి నోట్లో చాక్లెట్ వేసుకుంటే సరిపోతుందట.
 

వాషింగ్టన్ DCలోని స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, 19వ శతాబ్దంలో ఒక బ్రిటీష్ కుటుంబం రిచర్డ్ క్యాడ్‌బరీ మరింత రుచికరమైన డ్రింకింగ్ చాక్లెట్‌ని తయారు చేయడానికి కనుగొన్న ప్రక్రియ. కోకో బటర్‌ను ఉపయోగించి చాకొలేట్ తయారీని ప్రారంభించారు.

వాటిని సెల్ఫ్ డిజైన్ చేసి ఒక బాక్స్లో ప్యాక్ చేయడం ప్రారంభించారు. మార్కెటింగ్ మేధావి, క్యాడ్‌బరీ 1861లో హార్ట్ షేప్ ఆకారపు బాక్స్ పై కపిడ్స్ , రోజ్‌బడ్‌లను ఉంచడం ప్రారంభించింది. దీంతో "ప్రేమ లేఖల వంటి మెమెంటోలను పొందుపరచి, లవ్ మెసేజెస్ లనుకూడా రాయడం మొదలు పెట్టింది. దీంతో చాలామంది ఈ అందమైన చాక్లెట్‌లను ఉపయోగించడం ప్రారంభించారు" అని అధికారిక సైట్ తెలిపింది.
 

click me!