పెళ్లయిన కొత్తలో వైవాహిక జీవితం (Marital life) చాలా హ్యాపీగా ఉంటుంది. భార్య జాబ్ చేయకుండా ఇంటిపట్టున ఉన్నప్పుడు ఇంటి పనులు చేసుకునే సమయం ఎక్కువగా దొరుకుతుంది. అలాంటప్పుడు భర్తకు కావలసిన అన్ని అవసరాలను తను దగ్గర ఉండి తీరుస్తూ భర్తను ఆనందంగా ఉంచుతుంది. దాంతో భర్త హ్యాపీగా (Happy) ఫీల్ అవుతాడు. కానీ భర్తకు తనను ఇంటికే పరిమితం చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆమెకు మంచి ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పుడు తను ఏదైనా సాధించాలని ప్రోత్సహిస్తాడు. ఇలా ప్రోత్సహించే భర్త దొరకడం భార్య అదృష్టం.
భార్య భర్త మాటను గౌరవించి ఒక మంచి జాబ్ కు ట్రై చేస్తుంది. ఆమె కష్టానికి ఫలితంగా ఒక పెద్ద కార్పోరేట్ కంపెనీలో జాబ్ సాధిస్తుంది. ఆ జాబ్ లో మంచి పేరు కూడా సంపాదించుకుంటుంది. తనకు ఉద్యోగ పనిపరంగా ఒత్తిడి పెరగడంతో ఇంటి పనిలో ఆసక్తి చూపడం తక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం ఆమె పని ఒత్తిడి అని భావించాలి. భార్యను అర్థం చేసుకోవడానికి భర్త ప్రయత్నించాలి. కొందరు మహిళలు జాబ్ లో చేరిన తరువాత భర్త పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. దాంతో భర్త మనోవేదన (Depression) చెందుతాడు. భర్త ప్రోత్సాహంతోనే (Encouragement) భార్య ఉద్యోగం వైపు అడుగులు వేస్తోంది. భర్త సహకారం లేనిదే భార్య ఉద్యోగం చేయడానికి కష్టమవుతుంది.
అలాంటప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించిన మీ భర్తను నిర్లక్ష్యం (Neglected) చేయరాదు. మీకు ఎంత పని ఒత్తిడి ఉన్నా భర్త కోసం తగిన సమయాన్ని కేటాయించాలి. మీ వైవాహిక జీవితానికి దూరంగా ఉండరాదు. వైవాహిక జీవితానికి దూరంగా ఉంటే మీ మధ్య దూరం పెరుగుతుంది. దీంతో అపార్థాలు (Misunderstandings) చోటుచేసుకుంటాయి. ఇది మీ వైవాహిక జీవితానికి మంచిది కాదు. కుటుంబంతో గడపడానికి తగిన సమయాన్ని కేటాయించాలి. మీ కెరీర్ లో ఎప్పుడు పిల్లలు కావాలని ఇద్దరూ చర్చించుకోవాలి. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలి. అప్పుడు మీ ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది.
మీకు ఏదైనా ఇబ్బంది కలిగించే సమస్య (Problem) ఉంటే భర్తకు తెలియచేసి అతని సలహాలను తీసుకోవాలి. అప్పుడు భర్తకు మీరు ఇస్తున్న ప్రాముఖ్యతను అతను అర్థం చేసుకుని మిమ్మల్ని మరింత ప్రోత్సహిస్తాడు. భర్త కోసం మీరు కేటాయిస్తున్న సమయం అతను ఆనంద పరుస్తుంది. మీరు జాబ్ లో ఎంత మంచి పొజిషన్ కి వెళ్ళినా భర్తను నిర్లక్ష్యం చేయరాదు. అప్పుడే మీరు చేస్తున్న జాబ్ మీ వైవాహిక జీవితానికి అవరోధంగా (Barrier) మారదు.