Relationship: మీరు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే భర్తగా ఫెయిల్ అయినట్టే?

Published : Aug 12, 2023, 02:37 PM IST

Relationship : భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది దానిని అందమైన అనుబంధంగా మార్చుకోవాలి అంతేకానీ భర్తనే అహంకారంతో ఆ భార్యకి నరకం చూపించకూడదు ఒక భర్తగా ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.  

PREV
16
Relationship: మీరు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే భర్తగా ఫెయిల్ అయినట్టే?

 భార్యాభర్తల బంధం లో ఇద్దరూ రెండు బండి చక్రాల వంటి వారు. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటూ ఒకరి మాట ఒకరు ఉంటూ సంసారం సాగిస్తే అంతకు మించిన స్వర్గం మరొకటి ఉండదు. అలాకాకుండా మగవాడిననే అహంకారం ఆ భర్తలో కనిపిస్తే ఆ భార్య జీవితం నరకంగా మారుతుంది.
 

26

ఒక భర్తగా ఎలాంటి పనులు చేయకూడదో ఇక్కడ చూద్దాం. మీ ఇల్లాలికి  ఇంటిని జైలుగా భావించే పరిస్థితి తీసుకురాకండి. అప్పుడప్పుడు ఆమెని బయటికి తీసుకెళ్లడం వలన ఆమె మనసుకి శరీరానికి కూడా విశ్రాంతి ప్రశాంతత లభిస్తాయి.
 

36

అప్పుడు ఆమె మరింత చురుకుగా మరింత అభిమానం గా మసలుకుంటుంది. అలాగే మీ భార్యకి ఆర్థిక స్వతంత్రం ఉండేలాగా చూడండి. ఇతరుల ముందు మీ భార్యని దూషించి ఆమెని అవమానపడేలాగా చేయకండి.

46

అలా చేయడం వలన ఆమెకి మీ మీద మనసు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఆమె చేసిన వంటలకి వంకలు పెట్టకండి. ఆమె మీ మీద ప్రేమతో చేసింది కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా సర్దుకొని తినటం వల్ల ఆమె మనసు గెలుచుకున్న వారు అవుతారు.
 

56

అలాగే ఆమెని మీ హక్కుగా భావించి ఆమెపై అధికారం చలాయించడం చేయకూడదు ఆమె బంధువులతో గొడవలకు దిగకూడదు. అలా చేయడం వలన ఆమె చులకన అవటం కాకుండా ఆమెతో పాటు మీరు కూడా అందరి ముందు చులకన అవుతారు. పిల్లల ముందు మీ భార్యతో చనువుగా ప్రవర్తించకండి.
 

66

అది పిల్లల మనసుల మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే మీ భార్య అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వండి. ఇద్దరూ కలిసి కూర్చొని చర్చించుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకుంటే వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.

click me!

Recommended Stories