Relationship: ఆదర్శ దాంపత్యం కోసం.. భార్యాభర్తలు చేయవలసిన పనులివే?

First Published | Aug 16, 2023, 3:10 PM IST

 Relationship: జీవితంలో పెళ్లి అనేది ఒక అపురూపమైన సంఘటన. స్త్రీ పురుషులిద్దరూ ఈ జీవితంలో అనేక రకాల పాత్రలు పోషించవలసి వస్తుంది. అయితే భార్య భర్తలు ఎలా ఉంటే అది అన్యోన్య దాంపత్యం అవుతుందో ఇప్పుడు చూద్దాం.
 

 భార్య భర్తలు ముందుగా మనం ఇద్దరు కాదు, ఒకటే అన్న విషయం గ్రహించాలి. ఒకరికి తోడుగా ఒకరు.. ఒకరి కష్టంలో మరొకరు పాలుపంచుకోవాలి. భర్త భార్యకి మొదటి బిడ్డ అయితే భార్య భర్త కి మరో తల్లి లాగా మసులుకోవాలి. ఒకరికి కన్నీరు వచ్చినప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పాలి.
 

భర్త అలిగాడని భార్య, భార్య అలిగిందని  భర్త ఇద్దరూ పంతానికి పోతే ఆ కాపురం సజావుగా సాగదు. ఒకరు అలిగినప్పుడు మరొకరు బుజ్జగించాలి బ్రతిమిలాడాలి.ఒక భర్త సంపాదనని అర్థం చేసుకొని తన ఖర్చులని తగ్గించుకునే భార్య ఉంటే ఆ భర్త చాలా అదృష్టవంతుడు.
 

Latest Videos


 దేవుడు మనతో ఉండలేక తల్లిని ఇస్తాడు తల్లి చివరి వరకు మనతో ఉండలేదు కాబట్టి భార్యని ఇస్తుంది అలాంటి భార్యని  కన్నీరు రాకుండా చూసుకోవడం భర్త బాధ్యత. ఒక భార్య ఎప్పుడైతే భర్త అభిమానాన్ని కాకుండా సంపాదనను ఆశిస్తుందో అప్పటినుంచి ఆ భర్తని బాధ్యతగా కాకుండా భారంగా భావించడం మొదలుపెడుతుంది.
 

భార్యాభర్తలలో ఎవరికి కష్టం వచ్చినా ముందుగా తన భాగస్వామికి చెప్పుకోగలిగే అంత జనం ఇద్దరికీ ఉండే తీరాలి. అప్పుడే వారిద్దరూ సమస్య నుంచైనా కష్టం నుంచైనా బయటపడగలుగుతారు. మీ భార్యను ఒక పసిపిల్లలా చూసుకున్నట్లయితే..

మీ ముదిమి వయసులో ఆమె మిమ్మల్ని ఒక తల్లి లాగా చూసుకుంటుంది కాబట్టి మగవాడిని అనే అహంకారం పక్కనపెట్టి భార్యని బాధ్యతగా చూసుకోండి. అలాగే భార్యలు కూడా భర్తలని అర్థం చేసుకొని మసులుకోవాలి. భర్తను బానిసను చేసి ఆ బానిసకి యజమానిగా ఉండటం కంటే తన భర్తను..
 

రాజును చేసి ఆ రాజుకి రాణిగా ఉండడం ఎంతో గౌరవం అని అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలు ఉన్నప్పుడే ఒకరిని ఒకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా మసులుకోండి. ఎందుకంటే ఒక బంధం దూరమైన తర్వాత ఆ బంధం విలువ తెలుసుకున్నా ఉపయోగం ఉండదు.

click me!