ఏ భార్య భక్తులకైనా తన భాగస్వాముల నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. భార్య కి భర్త తన కోసం బహుమతులు కొనాలని, బాగా చూసుకోవాలని ఉంటుంది. అలాగే భర్తకి కూడా భార్య తన మాటను వినాలి అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.
అయితే ఎక్స్పెక్టేషన్స్ మితిమీరడం వల్ల భార్య భర్తల మధ్య గొడవలు కూడా రావచ్చు.మనిషికి ఆశ అనేది ఉండొచ్చు భార్య ఒక వంద బహుమతులు అడిగితే మితిమీరిన ఆశ అంటారు. కానీ అందులో కనీసం ఒక పదైనా భర్త తీర్చగలిగితే అది ఆ భార్యకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
కొన్ని కుటుంబాలలో ఇది ఇలాగ నడవగా మిగిలిన కుటుంబాలలో ఈ ఆశలే గొడవలకి దారితీస్తాయి. భార్య, భర్త నుంచి ఏదో ఆశిస్తుంది కానీ భర్త అది ఇవ్వలేకపోతాడు. దీనివల్ల మనస్పర్ధలు వచ్చి ఒకరి మీద ఒకరికి ద్వేషం కలుగుతుంది. ఆ కారణం చేత మనం బంధాలని వదులుకోలేము.
అందుకే ఆశని వదులుకోవడం మంచిది. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు.మనకి బంధం కావాలంటే ఆ ఆసలు వదులుకోవడం మేలు. లక్క, బంగారం రెండూ ఒకటి కాదు కానీ లక్క లేకపోతే బంగారం వంగిపోతుంది. ఇది పాత సిద్ధాంతమే కావచ్చు కానీ ఇది ఎప్పటికైనా బంగారం లాంటి మాటే.
భార్యాభర్తల బంధంలో కూడా ఈ మాట వర్తిస్తుంది. దంపతులు మధ్య ఎన్ని గొడవలు వచ్చినా సరే ప్రేమ అనే ఒక్క పదం కోసం వాళ్లు జీవితంలో ముందుకు సాగుతూనే ఉండాలి. ఆ బంధం కోసం ఆశల్ని వదులుకోవడంలో కూడా తప్పులేనే లేదు. కనుక గొడవలు వస్తాయి అని అనుకున్నప్పుడు ఆశల్ని వదులుకోవడమే మేలు.
ఎందుకంటే ఎంత ఆశపడినా భార్య కాని భర్త కాని ఆ కోరికని తీర్చలేనప్పుడు ఆశపడి బాధపడడం కన్నా ఆశపడకుండా ఉండడమే మేలు. అలాగని ఫారెన్ కంట్రీలలో లాగా ఆసలు తీర్చలేదు అని విడిపోతే అందరి దగ్గర చులకన అయిపోతాము. కనుక కొన్ని విషయాలలో అడ్జస్ట్ అవ్వడమే మంచిది.