వయసుకీ, మనకు చాలా సంబంధం ఉంది. పుట్టినప్పటి నుంచి.. కాటికి కాళ్లు చాపుకునే వరకు.. ప్రతి విషయాన్ని మన సమాజం వయసుతోనే ముడిపెడుతుంది. ఈ వయసులో అలా చేయాలి.. ఈ వయసులో ఇలా చేయాలి.. ఈ వయసులో ఆయనకు ఇదేం బుద్ధి.. ఇలాంటి మాటలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం.
అంతేకాదు..దాదాపు ఒక వయసుకు వచ్చాకే.. అమ్మాయికైనా.. అబ్బాయికైనా ఒక తోడు కావాలనే ఆశపుడుతుంది. అప్పుడే డేటింగ్ కూడా మొదలుపెడతారు. అయితే.. నిజానికి అమ్మాయిలు.. తమ జీవితంలోకి వచ్చే అబ్బాయిలు ఏ వయసు వారై ఉండాలని కోరుకుంటారు..? దీనికి నిపుణులు ఎలాంటి సమాధానం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
అమ్మాయిలు తమ పార్ట్ నర్ గా వచ్చే అబ్బాయి వయసులో తమకన్నా పెద్దగా ఉండాలని కోరుకుంటారట. మరీ ఎక్కువ గ్యాప్ కాకపోయినా... వయసులో పెద్దవాడైతే జీవితంలో అన్నీ విషయంలో స్థిరపడి ఉంటారని వారు అనుకుంటారట.
తమ వయసు తో సమానమైనవారి పట్ల పెద్దగా ఇంట్రస్ట్ చూపించరట. తమ వయసువారైతే.. తమలానే ఉంటారని.. పెద్దగా సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండదని.. వారు భావిస్తుంటారట
ఈ సంగతి పక్కన పెడితే.. మరో విషయంలోనూ అమ్మాయిలు చాలా నిక్కచ్చిగా ఉంటారట. అది మరెంటో కాదు శృంగారం.
శృంగారం విషయంలో.. అబ్బాయిలకు కాస్త తొందర ఎక్కువగా ఉంటుంది. వాళ్లకు కావాలి అని అనిపించగానే.. చేసేయాలనే ఆతురతగా ఉంటారు. అయితే... ఈ విషయం అమ్మాయిలకు పెద్దగా నచ్చదట. తాము రెడీగా లేకుండా.. సెక్స్ కి ఒత్తిడి చేసే అబ్బాయిలంటే అస్సలు ఇష్టం చూపించరట. కాబట్టి.. అమ్మాయిల ఇష్టం తెలుసుకొని మసులుకునే వాళ్లంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారట.
అయితే.. వయసులో పెద్దవారిని చేసుకుంటే.. ఈ ఒక్క విషయంలో మాత్రం ఇబ్బంది పడతామని అమ్మాయిలు ఫీలౌతుంటారట. వాళ్లు వయసులో పెద్దవారు కాబట్టి.. తమదే పై చేయిలా ఉండాలని భావిస్తుంటారని.. అమ్మాయిల మనసు పెద్దగా అర్థం చేసుకునే సమయం కూడా ఇవ్వరని ఓ పరిశోధనలో తేలిందట.
కాబట్టి.. ఆ ఒక్క విషయంలో.. కాస్త దూకుడు తగ్గించుకుంటే.. తమకన్నా వయసులో పెద్దగా ఉన్నవారికే అమ్మాయిలు మా ఓటు అంటున్నారు.