Better Half: భార్యాభర్తల సంబంధం ఎంతో పవిత్రమైనది. ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు జీవించే బంధమే భార్యాభర్తల సంబంధం అంటారు. అయితే చాలా మంది భర్తలు తమ భార్యాలను బెటర్ హాఫ్ అని అంటుంటారు.
భార్యాభర్తల బంధం పవిత్రమైనది, స్వచ్ఛమైనది. ఈ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒకరికోసం ఒకరుగా జీవిస్తారు. స్వార్థం ఉండదు. అయితే పెళ్లి తర్వాత భార్య అయినా, భర్త అయినా తమ భాగస్వామిని ప్రేమగా పిలుచుకుంటారు. భార్యల సంగతి పక్కన పెడితే.. భర్తలు ఎక్కువగా తమ భార్యలను బెటర్ హాఫ్ అనే ఎక్కువగా పిలుస్తుంటారు.
ఇదొక ఇంగ్లీష్ పదమే అయినా.. దీనికి లోతైన అర్థం ఉంది. ఈ బెటర్ హాఫ్ అనే పిలుపులో ప్రేమ, ఆప్యాయత, గౌరవం, గర్వం దాగున్నాయి. బెటర్ హాఫ్ అనే పదానికి అసలు అర్థం ఏంటో? ఇలా ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
26
బెటర్ హాఫ్ అంటే ఏంటి?
బెటర్ హాఫ్ అంటే జీవిత భాగస్వామి అని అర్థం వస్తుంది. ఆడవారైనా, మగవారైనా తమ భాగస్వామిని ఈ పేరుతో పిలవొచ్చు. కానీ మగవారే ఎక్కువగా తమ భార్యలను బెటర్ హాఫ్ అని గర్వంగా చెప్తుంటారు. ప్రేమగా పిలుస్తుంటారు. ఈ పదానికి అసంపూర్ణంగా ఉన్న లైఫ్ ను పూర్తి చేసే సహచరుడు అని కూడా అర్థం వస్తుంది. ఒక రిలేషన్ షిప్ పూర్తికావాలంటే బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకోవాలి. ఇద్దరూ కలిసి జీవితాన్ని గడిపితేనే వైవాహిక జీవితం సంపూర్ణం అవుతుంది.
36
అన్ని విధాలా ఆక్సెప్ట్ చేస్తుంది
భార్యను బెటర్ హాఫ్ అని పిలవడానికి ఇది కూడా ఒక కారణమే. ప్రతి భార్య తన భర్త కష్ట, సుఖాలు, ఆనందం, దు:ఖంలో, బాధ్యతల్లో సమానంగా పాలు పంచుకుంటుంది. భర్తలో ఉన్న మంచి, చెడు గుణాలను యాక్సెప్ట్ చేస్తుంది. భర్తకు ఉన్న ప్రతీదీ తన సొంతంగా భావిస్తుంది. అంటే అతని కష్ట సమయాలు, కుటుంబం, సంతోషం ఇలా ప్రతి దాంట్లో భార్య పాలు పంచుకుంటుంది. భార్య తన భర్తను అన్ని విధాలుగా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టే.. భార్యను బెటర్ హాఫ్ అంటారు.
పురుషుల జీవితంలోకి భార్య రాకతో ఎన్నో మార్పులొస్తాయి. ముఖ్యంగా భార్య రాకతో ఒంటరితనం, స్వార్థం భర్తలో లేకుండా పోతాయి. ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. నిజం చెప్పాలంటే పురుషులు ఎవ్వరితోనూ ఏమీ చెప్పుకోరు. కానీ భార్యతో మాత్రం ఖచ్చితంగా చెప్పుకుంటారు. భావాలను ఒకరికొకరు పంచుకోవడం ఎంతో ముఖ్యమని భార్యలు తమ భర్తలకు నేర్పుతుంది. దీంతోనే భార్యాభర్తల సంబంధం బలపడుతుంది. ప్రేమానురాగాలు పెరుగుతాయి.
56
సినిమాల్లో కూడా ఉంటుంది
ఈ తరం సినిమాలు, టీవీ సీరియల్స్ లో ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. అంటే భర్త భార్యను మొదట్లో ప్రేమించక పోయినా.. ఆమె చూపించే ప్రేమకు భర్త భార్యను తిరిగి ప్రేమించడం మొదలుపెడతారు. నిజానికి ప్రేమ ఎలాంటి కఠిన మనుషులనైనా మారుస్తుంది.
66
పవిత్ర బంధం
కష్టాలెన్ని ఎదురైనా తనతోనే భార్య ఉండాలని ప్రతి భర్త కోరుకుంటాడు. అందుకే వివాహ బంధం ఎంతో పవిత్రమైనది. ఈ బంధంలో ప్రేమ, నిజాయితీ, విశ్వాసం, అవగాహన ఉంటాయి. భార్య భర్తను, భర్త భార్యను అన్ని విధాలా యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ బంధంలో ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోకుండా ఉంటారు. భార్య భర్తను మానసికంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే భార్యను బెటర్ హాఫ్ అంటారు.