తెలివైన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే.. అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుంది..?

Published : Aug 21, 2025, 02:12 PM IST

ఒక వ్యక్తి IQ స్థాయి ఎక్కువగా ఉంటే, అతను సాధారణంగా కెరీర్, చదువు విషయంలో టాప్ లో ఉంటారు అని మనందరికీ తెలుసు. కానీ, తెలివైన వ్యక్తులు తమ రిలేషన్స్ ని కూడా చాలా విజయవంతంగా మేనేజ్ చేయగలరని మీకు తెలుసా?

PREV
14
relationship

పెళ్లి విషయంలో ప్రతి అమ్మాయికీ చాలా కలలు, కోరికలు ఉంటాయి.ముఖ్యంగా.. తమ జీవితంలోకి వచ్చే అబ్బాయి ఇలా ఉండాలి.. అలా ఉండాలి.. అతనిలో ఇలాంటి క్వాలిటీలు ఉండాలి ఇలా చాలా ఊహించుకుంటారు. అలా అమ్మాయిలు కోరుకునే లక్షణాల్లో మంచితనం, అందం, డబ్బు, గుణం తో పాటు తెలివితేటలు కూడా ఉండొచ్చు. మరి.. తెలివైన అబ్బాయి జీవితంలోకి వస్తే.. వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది..? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

24
IQ ఎక్కువగా ఉంటే..

ఒక వ్యక్తి IQ స్థాయి ఎక్కువగా ఉంటే, అతను సాధారణంగా కెరీర్, చదువు విషయంలో టాప్ లో ఉంటారు అని మనందరికీ తెలుసు. కానీ, తెలివైన వ్యక్తులు తమ రిలేషన్స్ ని కూడా చాలా విజయవంతంగా మేనేజ్ చేయగలరని మీకు తెలుసా? చాలా మంది అమ్మాయిలు తెలివైన భర్త రావాలని కోరుకోవచ్చు..కోరుకోపోవచ్చు. కానీ కోరుకుంటే మాత్రం మీ లైఫ్ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే.. వీరికి లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలో.. భార్యను ఎలా సంతోషంగా ఉంచాలో బాగా తెలుస్తుంది. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు.. ఒక సర్వే చెబుతోంది.

US లోని ఓకాండ్ విశ్వవిద్యాలయంలోని మనస్తత్వవేత్త గవిన్ ఎస్. వాన్స్, అతని బంధం ఈ విషయంపై చాలా కాలం పాటు పరిశోధనలు చేశారు. ఆ పరిశోధన ప్రకారం, తెలివైన అబ్బాయిలు.. ఎలాంటి రిలేషన్ ని అయినా.. చాలా బాగా హ్యాండిల్ చేయగలరని తేలింది.

34
పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎన్నో సవాళ్లు ఎదురౌతాయి. అలవా సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కచ్చితంగా తెలివితేటలు అవసరం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. భార్యభర్తల సంసబంధం సరిగా సాగడానికి కూడా ఈ తెలివి తేటలు ఉపయోగపడతాయి. బ్రిటన్ పర్సనాలిటీ అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనంలో 18 నుంచి 65 ఏళ్ల సంవత్సరాల మధ్య ఉన్న దాదాపు 202 మంది పురుషులను పరిశీలించారు. ఈ సమయంలో వారి సమస్య పరిష్కార నైపుణ్యాలు, ఆలోచనలు అంచనా వేశారు.

పరిశోధనలో వారు ఆశ్చర్యకరమైన విషయాలను కనుగొన్నారు. ఇలాంటి అబ్బాయిలు ప్రతి విషయంలో గొడవలు పడటం, వాదించడం, మోసపూరితంగా వ్యవహరించడం, మోసం చేయడం, శారీరకంగా బలవంతం చేయడం లాంటివి చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని సర్వేలో తేలడం గమనార్హం. వారు ప్రతి రిలేషన్ లో తమ భాగస్వామి అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అలాంటి పురుషులు తమపై చాలా మంచి నియంత్రణ కలిగి ఉంటారు. దీనితో పాటు, మరింత ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేసే ముందు, ఈ వ్యక్తులు భవిష్యత్తులో వారి సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించి అడుగులు వేస్తారు.

44
తెలివితేటలు అంటే మార్కులు కాదు...

అయితే ఇక్కడ తెలివితేటలు అంటే.. విద్య, ఉద్యోగంలో విజయం సాధించడం కాదు. భావోద్వేగ నియంత్రణ, మీ భావాలను నియంత్రించే సామర్థ్యం ఆధారంగా తెలివితేటలను అంచనా వేశారు.మీ భాగస్వామి తెలివైనవారు అయితే... మీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే.. తెలివిగా సహనంతో, అవగాహనతో పరిష్కరిస్తారు. ఈ లక్షణాల కారణంగానే.. ఇలాంటి అబ్బాయిలతో జీవితం చాలా ఆనందంగా సాగుతుందని అధ్యయనం చెబుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories