నిపుణుల ప్రకారం.. ఎక్సర్ సైజ్ చేసిన తర్వాత స్వీట్లను అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిలో కేలరీలు మాత్రమే ఉంటాయి. వీటిని తింటే కండరాల నష్టం మరమ్మత్తుకు ఆటంకం కలుగుతుంది.
వ్యాయామం చేసిన తర్వాత ఎట్టిపరిస్థితిలో నూనె పదార్థాలను తినకూడదు. వీటివల్ల కడుపు ఉబ్బరం పెరిగి నీరసంగా అనిపిస్తుంది.
ఎక్సర్ సైజ్ చేసిన తర్వాత ప్రాసెస్ చేసిన ఆహారాలను కూడా తినకూడదు. ఎందుకంటే ఇవి శరీరంలో వాటర్ కంటెంట్ ను తగ్గించి కండరాల అలసట, కడుపు ఉబ్బరం సమస్యను కలిగిస్తుంది.
వ్యాయామం తర్వాత మీరు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. అలాగే కండరాల నష్టం మరమ్మత్తుకు ఆటంకం కలుగుతుంది.
ఎక్సర్ సైజ్ చేసిన తర్వాత హెవీగా అస్సలు తినకూడదు. దీనివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.
వ్యాయామం చేసిన తర్వాత కడుపు సున్నితంగా మారుతుంది. కాబట్టి మీరు ఎక్కువ కారంగా ఉండే ఆహారాలను తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
వ్యాయామం తర్వాత ప్రోటీన్ బార్, షేక్స్ ను కూడా తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు.
ఎక్సర్ సైజ్ చేసిన తర్వాత మందును తాగకూడదు. సిగరేట్ కాల్చకూడదు. ఇవి మీ శరీరంలో నీటిని తగ్గించి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.