కొందరు అమ్మాయిలు నమ్మకమైన, మంచిగా మాట్లాడే, కేర్ చేసే అబ్బాయిలకన్నా.. బ్యాడ్ బాయ్స్ నే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకు అమ్మాయిలు ఇలా థ్రిల్, రిస్క్, ఆకర్షణను ఎక్కువగా కోరుకుంటారు? ఇలాంటి అమ్మాయిల గురించి సైకాలజీ ఏం చెప్తోందో ఇక్కడ తెలుసుకుందాం.
ఎందుకు కొందరు అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ నే ఇష్టపడతారనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఎలాంటి నియమాలు పట్టించుకోని, రఫ్‌గా , కొంచెం డేంజరస్‌గా అనిపించే అబ్బాయిల వైపు కొందరు అమ్మాయిలు ఆకర్షితులవుతుంటారు. అసలు ఈ తరహా ఆకర్షణ ఎందుకు ఏర్పడుతుంది. సైకాలజీ విశ్లేషణలు ఏం చెబుతున్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
27
అలాంటి వ్యక్తుల వైపు..
సైకాలజీ ప్రకారం కొందరు బాయ్స్ అతి ఆత్మవిశ్వాసంతో ఉండటం, వారికి నచ్చినట్టు ప్రవర్తించడం, ఇతరుల అభిప్రాయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఈ లక్షణాలు కొంతమంది అమ్మాయిలకు బలమైన వ్యక్తిత్వంలా కనిపిస్తాయి. మనిషి మెదడు సహజంగానే శక్తిమంతంగా, ఆధిపత్యంగా కనిపించే వ్యక్తుల వైపు ఆకర్షితమవుతుందని సైకాలజీ చెబుతుంది. అందుకే కొంతమంది అమ్మాయిలకు బ్యాడ్ బాయ్స్ చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తారు.
37
ఎమోషనల్ ఎక్సైట్మెంట్
ఇంకో ముఖ్యమైన కారణం ఎమోషనల్ ఎక్సైట్మెంట్. బ్యాడ్ బాయ్స్‌తో ఉండటం ఎప్పుడూ ఊహించని అనుభవంగా ఉంటుంది. వారి ప్రవర్తనలో అనిశ్చితి, రిస్క్, థ్రిల్ ఉంటాయి. సైకాలజీ నిపుణుల ప్రకారం మన మెదడు బోర్ అనిపించే పరిస్థితులను ఇష్టపడదు. అందుకే కొందరు అమ్మాయిలకు స్థిరమైన, ప్రశాంతమైన వ్యక్తుల కంటే బ్యాడ్ బాయ్స్ ఆసక్తికరంగా అనిపిస్తారు.
చిన్ననాటి అనుభవాలు కూడా ఈ ఆకర్షణకు కారణమవుతాయని సైకాలజీ చెబుతోంది. ఒక అమ్మాయి బాల్యంలో భావోద్వేగ నిర్లక్ష్యం, తండ్రితో లేదా కుటుంబంతో అసురక్షిత అనుబంధాన్ని కలిగి ఉంటే, ఆమెకు అన్‌ప్రెడిక్టబుల్ వ్యక్తులు నచ్చవచ్చు. ఇలాంటి అమ్మాయిలు డ్రామా, ఎమోషనల్ హై అండ్ లో ఉన్న సంబంధాలనే ప్రేమగా పొరబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
57
మార్చగలమనే నమ్మకం..
సైకాలజీ నిపుణుల ప్రకారం కొంతమంది అమ్మాయిలకు బ్యాడ్ బాయ్ లోని లోపాలను సరిదిద్దగలననే నమ్మకం ఉంటుంది. ఇది వారికి ఒక ఎమోషనల్ ఛాలెంజ్‌గా అనిపిస్తుంది. అతను తన కోసం మారతాడని నమ్మడం వారికి ప్రత్యేకమైన స్థానం దక్కిన ఫీలింగ్ ని ఇస్తుంది. కానీ చాలా సందర్భాల్లో ఇది నిరాశకే దారి తీస్తుందని సైకాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
67
వీటిది కీలకపాత్ర
సామాజిక ప్రభావం కూడా ఈ ఆకర్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కథల్లో బ్యాడ్ బాయ్స్‌ను రొమాంటిక్ గా చూపించడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. నియమాలు పాటించని హీరో, ప్రేమలో మాత్రం నిజాయతీగా ఉంటాడన్న భావన చాలామందిలో బలంగా నాటుకుపోయింది. అందుకే రియల్ లైఫ్‌లో కూడా అలాంటి వ్యక్తుల పట్ల కొందరిలో ఆకర్షణ పెరుగుతుంది.
77
ఇది శాశ్వతం కాదు..
నిపుణుల ప్రకారం బ్యాడ్ బాయ్స్ పట్ల ఆకర్షణ శాశ్వతం కాదు. వయసు పెరిగే కొద్దీ, జీవిత అనుభవాలు పెరిగే కొద్దీ చాలా మంది అమ్మాయిలకు భద్రత, గౌరవం, భావోద్వేగ స్థిరత్వం ముఖ్యమవుతాయి. అప్పుడు వారు ఎక్సైట్మెంట్ కంటే ఎమోషనల్ సేఫ్టీని ఎంచుకుంటారు. ఇది మానసిక పరిపక్వతకు సంకేతమని సైకాలజీ చెబుతోంది.