ప్రేమ అనేది కేవలం యువకులకు మాత్రమే సొంతమైన విషయంలా చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే.. 40ఏళ్లు వచ్చాయంటే.. వారు జీవితంలో అన్నీ చూసేశారని.. వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటారని అందరూ అనుకున్నారు. దాదాపు 40ఏళ్లు వచ్చిన వారంతా ఉద్యోగం, ఫ్యామిలీ, బంధాలు, ప్రమోషన్స్, పిల్లలు వంటి బంధాల్లో చిక్కుకొని ఉంటారు అని అనుకుంటారు. కానీ.. ఆ వయసులోనూ కొందరిలో ప్రేమ పుడుతుంది. అసలు ఆ వయసులో ప్రేమ సాధ్యమేనా..? ఈ వయసులో డేటిటంగ్ చేస్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో.. ఇప్పుడు చూద్దాం..
Dating
నాలుగు పదుల వయసు దాటిన వారిలో ప్రేమ పుట్టడం, డేటింగ్ కి వెళ్లాలని అనుకోవడం లాంటివి వారికి సరదాగానే ఉండొచ్చు. కానీ దాదాపు చుట్టూ ఉన్నవారు వాటిని యాక్సెప్ట్ చేయకపోవచ్చు.
ఈ సంగతి పక్కన పెడితే... వయసులో ఉన్నవారు తాము ప్రేమించిన వారికోసం ఏదైనా చేస్తారు. వాళ్లు ఎలా మారాలని కోరుకున్నా మారగలరు. కానీ.. నాలుగు పదులు దాటిన తర్వాత.. జీవితంలో అన్ని విషయాలు అర్థమైన తర్వాత.. ఎదుటివారి కోసం మారడం అంత సులవేమీ కాదు. అలా మారడానికి ఇష్టపడని వ్యక్తితో ప్రేమలో పడటానికి ఎవరూ ముందుకు రారనే విషయాన్ని గుర్తించాలి.
కొందరికి 40ఏళ్ల వయసులో విడాకులు తీసుకుంటారు. ఆ తర్వాత మరో బంధంలోకి అడుగుపెట్టాలని చూస్తుంటారు. అలాంటప్పుడు.. వీరు త్వరగా ఏ బంధానికి దగ్గరకాలేరు. ఎదుటివారిని పూర్తిగా నమ్మలేరు కూడా. గతంలో ఒకసారి విడిపోయి ఉండటం కారణంగా.. దాని ఎఫెక్ట్ వారిపై ఎక్కువగా ఉంటుంది.
అంతేకాదు.. నాలుగు పదులు దాటిని వారు చాలా స్వతంత్రంగా ఉంటారు. కాబట్టి.. ఎవరిమీదా డిపెండ్ అవ్వాలని అనుకోరు. కాబట్టి.. తొందరగా రిలేషన్ లో ఇమడలేరు.
ఇక.. 40 దాటిన తర్వాత వారి జీవితంలోకి అదే వయసు వారు వస్తారని అనుకోలేం. కాబట్టి.. తక్కువ వయసు వారు మీ జీవితంలోకి వస్తే.. వయసు తేడా అనేది ఇబ్బంది పెడుతుంది. ఈ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే.
20, 30 ఏళ్ల వయసులో ఉన్నవారు.. ప్రపంచాన్ని చుట్టి రావడానికి ఇష్టపడతారు. కొత్త వ్యక్తులను కలవడానికి ఆసక్తి పడతారు. కానీ.. నడి వయసు చేరుకున్న వారు ఈ విషయంలో కాస్త ఇబ్బంది పడతారనే చెప్పాలి. తొందరగా ఎవరినీ కలవలేరు. కొత్త అలవాట్లు నేర్చుకోలేరు.
ఇక.. ఈ విషయంలో కొత్త బంధం అంటే.. ప్రతి ఒక్కరూ జడ్జిమెంట్ చేయాలని చూస్తారు. వాళ్లు జడ్జి చేస్తారనే విషయాన్ని పక్కన పెడితే.. మీలో చార్మింగ్ తగ్గుతుంది. ముఖంపై ముడతలు రావడం మొదలౌతాయి. వయసు పెరుగుతుంది కాబట్టి.. తొందరగా మీ జీవితంలోకి రావడానికి ఎవరూ ముందుకు రారు.
ఈ విషయంలో మీలో కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా తగ్గుతాయి. కొందరిలో హార్మోనల్ సమస్యలు కూడా తలెత్తుతాయి. దాని వల్ల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి.. ఈ వయసులో ప్రేమ, డేటింగ్ అంటే కాస్త కష్టమైన పనే అని చెప్పాలి.