డేటింగ్ లో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా..?

First Published Aug 14, 2021, 3:16 PM IST

ఇక ఒక ప్రొఫైల్ నచ్చిన తర్వాత వారితో మాట్లాడాలి అనిపించినప్పుడు..  బోరింగ్ మెసేజ్ లు చేయకూడదు. 

ఈ కాలం యువత ఎక్కువ గా డేటింగ్ మీద ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. వీరికి తగినట్లు డేటింగ్ యాప్ లు కూడా కుప్పలు తెప్పలుగ ా అందుబాటులో ఉండటంతో వాటిపై మరింత ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయితే.. ఈ ఆల్ నైట్ డేటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
తెలిసీ తెలియక ఈ డేటింగ్ సమయంలో.. కొందరు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దాని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఆన్ లైన్ డేటింగ్ సమయంలో చేయకూడని పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

bumble dating app

డేటింగ్ యాప్స్, వెబ్ సైట్లలో అన్ని ప్రొఫైల్స్ నిజమే ఉండవు. కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. కాబట్టి కనిపించిన ప్రతి ప్రొఫైల్ నిజమని నమ్మకూడదు. కాబట్టి.. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చీటింగ్ చేయాలని చూసేవారు చాలా మంది ఉన్నారు. ఈ విషయంలో అస్సలు మోసపోకూడదు.
undefined
ఇక అందులో చాలా మంది తమ వరిజినల్ ఫోటోలు పెడతారనుకోవడం కూడా చాల పొరపాటు. టెక్నాలజీని ఉపయోగించి.. తమను తాము అందంగా చూపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి.. ఆ ఫోటోల్లో ఉన్నట్లే బయట కూడా ఉంటారని నమ్మి మోసపోవద్దు. ఆ విషయంలోనూ అలర్ట్ గా ఉండాలి.
undefined
ఇక ఒక ప్రొఫైల్ నచ్చిన తర్వాత వారితో మాట్లాడాలి అనిపించినప్పుడు.. బోరింగ్ మెసేజ్ లు చేయకూడదు. బోరింగ్ మెసేజ్ లు చేయడం వల్ల .. వారికి మీ మీద ఇంట్రస్ట్ తగ్గిపోయే అవాకశం ఉంటుంది. కాబట్టి.. ఇంట్రస్టింగ్ మాట్లాడటం కూడా ఒక ఆర్ట్ అన్న విషయం గుర్తించుకోవాలి.
undefined
కొందరు ఆన్ లైన్ డేటింగ్ సమయంలో పిక్కీగా.. నిర్ణయాత్మకంగా ఉంటారు. అలా ఉండటం వల్ల ఏ మ్యాచింగ్ పెద్దగా సెట్ అవ్వదు కాబట్టి.. ఇలాంటి వ్యక్తే కావాలని కూర్చుంటే దొరకకపోవచ్చు. కాబట్టి.. కనెక్ట్ అయిన వారితో మాట్లాడితే నచ్చుతారో లేదో తెలిసే అవకాశం ఉంటుంది.
undefined
చాలా మంది అబద్దాలతోనే డేటింగ్ యాప్స్ వాడుతుంటారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీ వ్యక్తిత్వం గురించి.. మీ ఫోటో , మీ అభిరుచుల విషయంలో అబద్ధాలు చెప్పకుండా.. నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ మిస్టేక్స్ చేయకుంటే... ఎలాంటి సమస్యలు తలెత్తవు.
undefined
click me!