కట్టుకున్న భర్తతో ఆనందంగా ఉండాలని ప్రతి భార్య కోరుకుంటుంది. అందుకోసం వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ.. దంపతులు అన్నాక.. వారి మధ్య ఏదో ఒక బేధాభిప్రాయం రావడం చాలా సహజం. కొందరు సర్దుకొని.. జీవితాన్ని ముందుకు పోనిస్తారు. కొందరు.. ఆ గొడవలను పెంచుకొని చివరకు విడిపోయేదాక చేసుకుంటారు.
divorce
ఈ విషయంలో ఇద్దరిలో ఎవరో ఒకరు కాస్త సహనంగా ఉంటే.. బంధాన్ని నిలపెట్టుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా.. ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా ఇవైనా తేడాలు వస్తే.. వాటిని పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
divorce
భర్త మీకు దూరంగా ఉండటం, లేదే విడిపోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు.. అసలుఏం చేయాలో.. నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి.
divorce
మీ భర్త మీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాని చెప్పగానే.. ఆ వార్త మిమ్మల్ని కలచివేస్తుంది. కానీ.. అది మీకు నచ్చనప్పుడు.. విడాకులు ఇవ్వొద్దు అంటూ.. మీరు బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు. వారు విడాకులు ఇస్తాను అన్నారు అంటే.. వారు అప్పటికే నిర్ణయం తీసుకున్నారని అర్థం. కాబట్టి.. మీరు బ్రతిమిలాడి మరీ.. వద్దు అని చెప్పాల్సిన అవసరం లేదు. మీ విలువ తగ్గిపోతుంది.
divorce
విడాకులు తీసుకున్న మహిళకు కొన్ని హక్కులు ఉంటాయి. అది ఏ దేశంలోనైనా ఉంటాయి కాబట్టి. భరణం, పిల్లల పెంపకం, వారి బాధ్యత లాంటి విషయాల్లో మీ భర్తను డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పులేదని నిపుణులు సూచిస్తున్నారు. మీ విడాకులు మీ పిల్లలకు శాపంగా మారకుండా చూసుకోవాలి.
divorce
మీ భర్త మీకు విడాకులు ఇస్తున్నారు అనగానే.. మీది కూడా తప్పు ఉంది అన్నట్లుగా బంధువులు, కుటుంబసభ్యులు మాట్లాడే ప్రమాదం ఉంది. కాబట్టి.. అన్నింటికీ సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. అంతేకాదు.. అన్ని విషయాల్లో ఇప్పటి వరకు భర్తపై ఆధారపడి ఉంటారు. కాబట్టి.. స్వతంత్రంగా బతకడానికి కావల్సిన అన్నింటినీ నేర్చుకోవాలి.
భర్త విడాకులు ఇచ్చినంత మాత్రం మీరు ఏదో కోల్పయినట్లు తల దించుకొని బతకాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎలాంటి భయం లేకుండా తలెత్తుకొని జీవించవచ్చు.
మీకు జరిగినదానికి ఎదుటివారిని ఎవరినీ నిందించకుండా ఉండటమే మంచిది. ఎదుటివారిని నిందించడం వల్ల మీకు ఒరిగింది ఏమీ లేదు అన్న విషయం గుర్తించుకోవాలి.
కాకపోతే.. ఆ విడాకులు తీసుకోవడం అనే విషయం వెంటనే మీకు జీర్ణం కాకపోవచ్చు. కాబట్టి.. ముందుగా ఆ గాయాన్ని తగ్గించుకునే పని చేయాలి. మీకంటూ సమయం కేటాయించుకొని.. ఆ గాయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
మీ మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. మీరు ఏడుస్తూ కూర్చోవడం.. బాధపడుతూ కూర్చోవడం లాంటివి చేయకూడదు. మీరు బాగానే ఉన్నారనే విషయాన్ని మీ బుర్రకు ముందు చెప్పాలి. ఆ తర్వాత.. వాటంతట అవే పరిస్థితులు చక్కపడతాయి.