శివుడు
మహిళలు శివుని ఎడమ వైపు నుంచి సృష్టించబడ్డారని నమ్ముతారు. అందుకే ఈ భాగం శివుని అర్ధనారీశ్వరునితో ముడిపడి ఉంది. ఈ కారణంగా పెళ్లి సమయంలో వధువు ఎప్పుడూ వరుడి ఎడమ వైపునే కూర్చుంటుంది.
marriage
ప్రేమ, సంతోషానికి చిహ్నం
ఎడమ వైపు.. ప్రేమ, సంతోషానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే వధువు వరుడిని ఎడమవైపున కూర్చుంటుంది. ఇలా కూర్చోవడం వల్ల దాంపత్య జీవితం ఎప్పుడూ ఆనందం, ప్రేమతో నిండి ఉంటుందని నమ్ముతారు.
మానవ హృదయం
నిజానికి మన గుండె ఎడమవైపున ఉంటుంది. అంటే ఎడమ సైడు గుండె ఎక్కువగా ఉంటుంది. అందుకే వధువును వరుడికి ఎడమవైపు కూర్చోబెట్టడం బెట్టి.. ఆమె జీవితాంతం భర్త హృదయానికి దగ్గరగా ఉంటుందనే నమ్మకం ఉంది. ఫలితంగా వారిద్దరి దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. అలాగే ఇద్దరి మధ్య మంచి సఖ్యత కూడా ఉంటుంది.
లక్ష్మీ, విష్ణువు
శాస్త్రాలు, పురాణాల ప్రకారం.. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా విష్ణువుకు ఎడమవైపునే కూర్చుంది. అందుకే హిందూ వివాహంలో వరుడిని విష్ణుమూర్తి రూపంగా, వధువును లక్ష్మీ రూపంగా భావిస్తారు. అందుకే వధువును ఎడమవైపు మాత్రమే కూర్చోబెడతారు.
ఎడమ చేయి ప్రేమకు చిహ్నం
వేదాల్లో మనిషి కుడి చేతిని పనికి చిహ్నంగా, ఎడమ చేతిని ప్రేమ, సామరస్యానికి చిహ్నంగా భావిస్తారు. కాగా పెళ్లి సమయంలో వరుడు ఎడమవైపు వధువును కూర్చోవడం వల్ల వారి మధ్య ప్రేమ, సామరస్యం జీవితాంతం కొనసాగుతాయని నమ్ముతారు. అంతేకాకుండా భర్త ఎడమ చేతి రూపంలో అతని పనులన్నింటికీ సహకరిస్తుందని అర్థం వస్తుంది.
MARRIAGE
మరొక నమ్మకం ఏమిటంటే పురాతన కాలంలో.. వివాహ సమయంలో.. పెళ్లిని ఆపడానికి దెయ్యాలు వచ్చాయి. ఆ సమయంలో వాటిని ఎదుర్కొనేందుకు వరుడికి కుడివైపు ఆయుధాలు, వధువును ఎడమవైపు కూర్చోబెట్టారు. అందుకే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానిని వెంటనే ఎదుర్కోవచ్చని ఇలా కూర్చోబెడతారని నమ్మకం ఉంది.