శృంగారం తర్వాత పురుషులు ఏం ఆలోచిస్తారో తెలుసా?

First Published | Dec 1, 2023, 3:52 PM IST

శృంగారం తర్వాత పురుషులు ఏం చేయాలనుకుంటారు? ఏం ఆలోచిస్తుంటారని ప్రతి మహిళ తన భర్త ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటుంది. మీకు కూడా ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ ను చదివేయండి.

శృంగారం స్త్రీ పురుషుల మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది. నమ్మకాన్ని కలిగిస్తుంది. అయితే కొంతమంది పురుషులు తమ భాగస్వామితో సెక్స్ లో పాల్గొన్న తర్వాత  చాలా ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటారు. మరికొందరు సరసాలు ఆడుతారు. కొందరు తమ భాగస్వామితో మాట్లాడతారు.
 

సెక్స్ లో పాల్గొన్న తర్వాత పురుషులు ఏమనుకుంటారనేది మిస్టరీగానే మిగిపోయింది. భార్యలు ఆ మిస్టరీని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ పురుషులు మాత్రం చెప్పరు. అయితే సెక్స్ తర్వత భర్త మనసులో ఏముందో తెలుసుకోవాలని మహిళలు ఎంతగానో ట్రై చేస్తుంటారు. మీకు కూడా దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పదండి.. కొన్ని అధ్యయనాలు దీని గురించి ఏం చెప్పాయో ఇప్పుడు తెలుసుకుందాం..  


భార్య నిజంగా శృంగారాన్ని ఆస్వాదించిందా?

సెక్స్ తర్వాత ప్రతి పురుషుడు ఆలోచించే ఒక విషయం ఇదే.. సెక్స్ ను భాగస్వామి ఆస్వాదించిందా? లేదా? అని. కానీ దీనిపై ఆడవారి సమాధానం కూడా పెద్ద మిస్టరీనే. దీన్ని అంత సులువుగా తెలుసుకోలేరు కదా.. 
 

భావప్రాప్తి

స్త్రీ భావప్రాప్తి పురుషుడికి ఒక గొప్ప విజయమేనంటారు కొందరు. ఎందుకంటే పురుషుల మాదిరిగా ఆడవారు అంత తొందరగా భావప్రాప్తిని పొందలేరు. వీరు భావప్రాప్తి పొందడానికి చాలా సమయం పడుతుంది. అందుకే సెక్స్ తర్వాత పురుషులు వారి భార్య భావప్రాప్తి పొందిందా? లేదా? అని ఆలోచిస్తారట.

కౌగిలించుకోవాలా లేక నిద్రపోవాలా?

అవును సెక్స్ తర్వాత పురుషులు తమ భాగస్వామిని కౌగిలించుకోవాలా లేక వెంటనే నిద్రపోవాలా అని ఎక్కువగా ఆలోచిస్తారట. కొంతమంది సెక్స్ చేసిన తర్వాత వెంటనే నిద్రపోవాలనుకుంటారట. మొత్తం మీద ఈ కన్ఫ్యూజన్ వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
 

జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం

ఒక వ్యక్తి సెక్స్ తర్వాత ప్రశాంతంగా ఉంటే.. అతను కొంతకాలం కిందట పడకపై చేసిన అన్ని మధుర క్షణాలను గుర్తుచేసుకుంటున్నాడని అర్థం. ఇలాంటి వారు మీరు అందించిన ఆనందాన్ని రహస్యంగా ఆస్వాదిస్తారు. అలాగే నతదుపరి రౌండ్ గురించి కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు.
 

స్నానం చేయాలనుకోవడం

సెక్స్ లో పాల్గొనడం వల్ల పురుషులకు విపరీతంగా చెమట పడుతుంది. అందుకే శృంగారం తర్వాత స్నానం చేయడం గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తారు. 
 

Latest Videos

click me!