సెక్స్ సమయంలో పురుషులు చేయకూడని తప్పులు ఇవే..!

First Published | Dec 2, 2023, 3:37 PM IST

సెక్స్ లో భార్యాభర్తలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలుగుతాయి. అయితే సెక్స్ సమయంలో పురుషులు చేసే కొన్ని తప్పులు వారి లైంగిక జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. అవేంటంటే?
 

సెక్స్ తో ఎన్నో శారీరక, మానసిక సమస్యలు తగ్గిపోతాయి. కానీ సెక్స్ సమయంలో పురుషులు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మీ లైంగిక జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఇవి మహిళలకు చికాకును కలిగిస్తాయి. అంతేకాదు ఇవి భార్యాభర్తలు విడిపోయే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. మరి సెక్స్ సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పురుషులు చేసే తప్పులు

సాధారణంగా భార్యాభర్తల మధ్య పరస్పర సంతృప్తి ఉన్నప్పుడే దాన్ని ఇద్దరూ ఆస్వాధిస్తారు. కానీ సెక్స్ సమయంలో పురుషులు కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇది స్త్రీలకు చికాకు కలిగిస్తుంది. వైవాహిక జీవితంలో కలయిక ప్రక్రియకు దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే కలయిక ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది. నమ్మకాన్ని కలిగిస్తుంది. కానీ చాలా మంది పురుషులు సెక్స్ సమయంలో తమ భాగస్వామి కోరికలను గౌరవించరు. ఇదే ఆడవారికి ఎంతో బాధను కలిగిస్తుంది. ఈ తప్పును చాలా మంది పురుషులు చేస్తుంటారు. ఇది మీ మొత్తం లైంగిక జీవితాన్ని పాడు చేస్తుంది.
 


భావోద్వేగ అవసరం

సాధారణంగా పురుషులు శృంగారాన్ని కేవలం శారీరక శ్రమగానే భావిస్తారు. కానీ ఆడవారు సెక్స్ సమయంలో తన భర్త తనతో భావోద్వేగానికి గురి కావాలని కోరుకుంటుంది. అందుకే భార్య అనుమతితోనే పురుషులు సెక్స్ లో పాల్గొనాలి. ప్రేమ, అంగీకారంతో శృంగారంలో పాల్గొనంటే మీ భార్య సంతోషంగా ఉంటుంది. అలాగే ఇది లైంగిక సంతృప్తిని కలిగిస్తుంది. 
 

భాగస్వామి కోరికలకు విలువ ఇవ్వండి

సెక్స్ ఇద్దరికీ అవసరమే. అందుకే మీ కోరికలతో పాటుగా మీ భార్య కోరికలను కూడా గౌరవించండి. జీవిత భాగస్వాములకు వారి స్వంత ఆలోచనలను ఉంటాయి. కాబట్టి మీ ఇద్దరి కోరికలను ఒకరికొకరు చెప్పుకోవడంలో ఎలాంటి తప్పుతు లేదు. 

వారిని కూడా సంతృప్తి పరచండి

మీతో శృంగారంలో పాల్గొన్న తర్వాత కూడా మీ భార్యకు సంతృప్తి కలగపోతే.. వారి నుంచి సలహా తీసుకోండి. సాధారణంగా పురుషులు శృంగారంలో పాల్గొన్న ఐదారు నిమిషాల్లోనే స్ఖలనం చేస్తారు. కానీ స్త్రీలు తక్కువ సమయంలో భావప్రాప్తిని పొందరు. వీరు ఎక్కువ సేపు సెక్స్ ను ఆస్వాధించడానికి ఇష్టపడతారు. మహిళలు పదిహేను నిమిషాల శృంగారాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. కానీ పురుషులు సెక్స్ లో పాల్గొన్న ఐదారు నిమిషాల్లోనే భావప్రాప్తిని పొందుతారు. కాబట్టి పురుషులు స్ఖలనానికి ముందు ఎక్కువసేపు రొమాన్స్ చేస్తే మీ భాగస్వామికి ఆనందం కలుగుతుంది. నిజానికి దీన్ని ఆడవారు ఎక్కువగా కోరుకుంటారు. స్ఖలనం జరిగిన వెంటనే మీరు నిద్రలోకి జారుకుంటే మీ భార్య అసంతృప్తి చెందుతుంది. 
 

సెక్స్ పొజీషన్స్

ఒకే సెక్స్ పొజీషన్స్ మీ భార్యకు బోరింగ్ గా అనిపించొచ్చు. అందుకే సెక్స్ లో పాల్గొన్న ప్రతి సారి మీకు అనుకూలంగా ఉండే కొత్త సెక్స్ పొజీషన్ ను ట్రై చేయండి. ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. లేదంటే మీ జీవిత భాగస్వామి శారీరకంగా, మానసికంగా మీపై ఆసక్తిని కోల్పోతారు

Latest Videos

click me!