Relationship: అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ గా బాయ్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు.. ఎందుకో తెలుసా!

First Published | Oct 19, 2023, 4:48 PM IST

 Relationship: స్నేహానికి లింగ బేధం ఉండదు. నేటి కాలం అమ్మాయిలు తమ బెస్ట్ ఫ్రెండ్ గా అబ్బాయిల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అందుకు స్ట్రాంగ్ రీజన్ కూడా చెబుతున్నారు. అయితే ఆ రీజన్స్ ఏమిటి? ఆ కారణాలు సరి అయినవేనా ఇప్పుడు చూద్దాం.
 

 ఒకప్పుడు స్నేహం అంటే ఇద్దరు అమ్మాయిలకి లేదంటే ఇద్దరు అబ్బాయిలకి ఉండేది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్నేహం చేస్తే వాళ్లని ఏదో తప్పు చేసిన వారి లాగా చూసేవారు కానీ నేటి సమాజం అందుకు పూర్తిగా విరుద్ధం. ఇప్పటి స్నేహానికి లింగ బేధం లేదు. ఇద్దరి మధ్యన అవగాహన పెరిగింది.

మహిళలు తమ ఆలోచనలను మరియు బాధలను వారి బెస్ట్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటున్నారు. పైగా వారి బెస్ట్ ఫ్రెండ్స్ గా అబ్బాయిలనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అందుకు కారణాలు కూడా చెప్తున్నారు అవేంటో చూద్దాం.


 మగవాళ్ళు అభిప్రాయాలని కచ్చితంగా చెప్తారు. అలాగే ఖచ్చితమైన సజెషన్స్ కూడా చేస్తారు. అలాగే తన స్నేహితురాలు ఎంచుకునే భాగస్వామిని జడ్జి చేయడంలో మేల్ ఫ్రెండ్స్ ఎక్కువగా హెల్ప్ చేస్తారట.

 ఎందుకంటే మగవారి యొక్క మనోభావాలు ఎక్కువగా మగవారికి తెలుస్తాయి కాబట్టి. అలాగే తన  ఫ్రెండ్ ని సరిగ్గా చూసుకోమని అవతలి వ్యక్తికి చెప్పటానికి ఎలాంటి మొహమాటం చూపించడు. అలాగే తన లేడీ ఫ్రెండ్ కి ఒక అబ్బాయి భర్తగా నప్పుతాడో లేదో కూడా మెయిల్ ఫ్రెండ్ కరెక్ట్ గా జడ్జ్ చేయగలడు.

అలాగే ఒక అమ్మాయి అబ్బాయితో స్నేహం చేయడం వలన బయట అబ్బాయిలతో మాట్లాడటానికి నిర్మొహమాటంగా వ్యవహరిస్తారు. అలాగే వాళ్లని అర్థం చేసుకుంటారు కూడా. ఒక అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ గా అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు చెప్తున్న ఒక బెస్ట్ రీసన్ సరియైన సమయంలో సహాయం చేయటం.
 

 ఒక ఆడపిల్ల కష్టంలో ఉన్నప్పుడు తన లేడీ ఫ్రెండ్ హెల్ప్ చేయటానికి రాలేకపోవచ్చు. ఎందుకంటే ఆమెకి ఇంట్లో ఉండే రెస్ట్రిక్షన్స్  ఆమెకి ఉంటాయి కాబట్టి. ఒక అబ్బాయి అయితే ఎలాంటి సమయంలోనైనా అతని సహాయాన్ని తన ఫ్రెండ్ కి అందించగలడు.

Latest Videos

click me!