విడాకులకు అసలు కారణాలు ఇవే..!

First Published | Oct 19, 2023, 11:18 AM IST

పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. నిజానికి విడాకులు తీసుకోవడానికి ఎన్నో కారణాలుంటాయి. కలిసి సంతోషంగా లేనప్పుడు విడాకులు తీసుకుని వేర్వేరుగా బతకడం బెటర్ అని చాలా మంది నమ్ముతున్నారు. అందుకే సెలబ్రిటీలే కాదు సాధారణ జనాలు సైతం విడాకులు తీసుకుంటున్నారు. అసలు భార్యాభర్తలకు విడాకులు తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుందో తెలుసా? 

Divorce

విడాకులు అనే నాలుగు అక్షరాల పదం ఇద్దరిని శాశ్వతంగా విడదీస్తుంది. కొన్నేండ్ల బంధాన్ని బ్రేక్ చేస్తుంది. పిల్లలకు కూడా తల్లిదండ్రుల ప్రేమ ఉండదు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. ఇది చాలా కామన్. అయితే సాధారణ జనాలు సైతం విడాకులు తీసుకుంటూ విడిపోతున్నారు. విడాకులు తీసుకోవడానికి భాగస్వామి మోసం చేయడమే ప్రధాన కారణమని మనలో చాలా మంది నమ్ముతారు. ఇదొక్కటే కాదు.. విడాకులు తీసుకోవడానికి ఎన్నో కారణాలుంటాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడం కష్టంగా మారినప్పుడు చాలా  మంది జంటలకు విడాకులు తీసుకోవాలన్ని ఆలోచన వస్తుంది. విడాకులు తీసుకోవడానికి ఇంకా ఏమేం కారణాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

divorce

ఒకరినొకరు గౌరవించుకోకపోవడం

దీనికి ఎన్నో కారణాలున్నాయి. ఒకప్పుడు మన సమాజంలో పురుషాధిక్యత ఉండేది. కానీ ఇప్పుడు మన సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను గౌరవిస్తున్నారు. వారికి విలువనిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా పురాషాధి్యతే ఉంది. ఇలాంటి చోట ఆడవారికి సరైన గౌరవం దగ్గకు. అలాగే రెండోది.. నచ్చని పెళ్లి చేసినప్పుడు కూడా ఇలాంటిది కనిపిస్తుంది. మూడోది.. ఇద్దరి మధ్య నమ్మకం లేకపోవడం. దీనివల్ల ఒకరినొకరు గౌరవించుకోరు. కారణం ఏదైనప్పటికీ.. ఎప్పుడూ ఒకరినొకరు దిగజార్చకోవడానికి ప్రయత్నిస్తే ఆ సంబంధం ఎక్కువ కాలం నిలబడదు. 
 

Latest Videos


divorce

ప్రేమ, సాన్నిహిత్యం లేకపోవడం

వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే మాత్రం భార్యాభర్త మధ్య ప్రేమ, సాన్నిహిత్యం ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఎప్పుడూ గొడవలొస్తాయి. ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవ పడుతుంటే ప్రేమించుకోవడానికి సమయం, మనసు ఎక్కడి నుంచి వస్తాయి? దీనివల్ల క్రమంగా భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. విడాకులు తీసుకునే అవకాశం కూడా ఉంది. 
 

divorce

అవగాహన, కమ్యూనికేషన్ లేకపోవడం

పరస్పర అవగాహన సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇలాంటి వారు విడిపోయే అవకాశమే ఉండదు. మీ రిలేషన్ షిప్ సాఫీగా సాగాలంటే ఒకరి అవసరాలను, లక్ష్యాలను మరొకరు అర్థం చేసుకోవాలి. అలాగే కమ్యూనికేషన్ కూడా బాగుండాలి. మీ భాగస్వామిపై మీకు కోపం ఉంటే లేదా వారి గురించి ఏదైనా నచ్చకపోతే.. ఈ విషయాలపై వారితో మాట్లాడండి. లేదంటే మీ బంధం బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. 
 

click me!