మీకు ఏ కలర్ అంటే ఇష్టం? ఆ రంగు మీ సీక్రెట్స్ అన్నీ బయట పెట్టేస్తుంది తెలుసా?

First Published | Sep 12, 2024, 1:50 PM IST

కలర్ సైకాలజీ ప్రకారం ప్రతి రంగుకు ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తిత్వాన్ని తెలిపే లక్షణం, భావోద్వేగాల గురించి కూడా మీ ఫేవరేట్ కలర్ చెప్పేస్తుంది. ఇక్కడ వివిధ రంగుల గురించి పూర్తి సమాచారం ఉంది. అందులో మీకు నచ్చిన కలర్ మీ గురించి ఏం చెబుతోందో తెలుసుకోండి. 

ఎరుపు(red)
ఎరుపు రంగు చాలా స్ట్రాంగ్ కలర్. ఇది మీ ఫేవరేట్ కలర్ అయితే మీరు బలమైన, నమ్మకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారని అర్థం. ఇది చాలా పవర్ ఫుల్ కలర్. ఈ రంగును ఇష్టపడేవారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం ఎక్కువగా ఉంటుంది.  రెడ్ కలర్ దుస్తులు వేసుకొనే వారు ఎక్కడున్నా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. అందరిలోనూ చాలా ప్రత్యేకంగా, ఎల్లప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తారు. 

గోధుమ రంగు(brown)
బ్రౌన్ కలర్ స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఈ రంగును ఇష్టపడే వారు ఎక్కువ స్టెబిలిటీ కలిగి ఉంటారు. ఆలోచనల్లో, చేసే పనుల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ రంగును ఇష్టపడేవారు నమ్మకంగా, విశ్వాసం కలిగిన వ్యక్తులుగా పేరుపొందుతారు. వారికి ఇష్టమైన వారి కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. 

గులాబీ రంగు(pink)
ప్రేమకు చిహ్నం గులాబీ రంగు. ఈ రంగును ఇష్టపడే వారు ప్రేమ పూర్వకంగా జీవిస్తారు. అందరితోనూ సంతోషాన్ని పంచుకుంటారు. సౌమ్యంగా ఉంటారు. ఆప్యాయంగా మాట్లాడతారు. సున్నిత మనస్కులు. వీరికి సానుభూతి ఎక్కువ. 

ఊదా రంగు(purple)
ఊదా రంగును ఇష్టపడే వారు రాయల్టీగా, లగ్జరీగా ఉంటారు. లేటెస్ట్ ట్రెండ్ ను ఫాలో అవతారు. వీరు తెలివైన వారిగా సమాజంలో గుర్తింపు పొందుతారు. వీరికి కూడా సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. వీరు ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. ఇతరుల నుంచి కొత్త ఆలోచనలను స్వీకరిస్తారు. విలాసంగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. 


పసుపు(yellow)
పసుపు రంగు ఆనందానికి గుర్తు. ఈ రంగును ఇష్టపడే వారు ఆశావాద ఆలోచనలతో ఉంటారు. వీరు ప్రశాంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి సానుభూతి ఎక్కువగా ఉంటుంది. మంచి కారెక్టర్ కలిగి ఉంటారు. పసుపు రంగును ఇష్టపడే వారికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. వీరు సమాజంలో చురుకుగా ఉంటారు. వీరు ఎక్కడుంటే అక్కడ సంతోషకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. 

తెలుపు(white)
తెలుపు రంగు ఎంత స్వచ్ఛంగా ఉంటుంతో ఈ రంగు ఇష్టపడే వారు ఆలోచనలు కూడా అంత స్వచ్ఛంగా ఉంటాయి. వీరు సంపూర్ణత్వాన్ని కోరుకుంటారు. ఏ పనిచేసినా పూర్తి చేసే దాకా ఊరుకోరు. ఈ రంగును ఇష్టపడే వారు ఎక్కువగా సాధారణంగా జీవించడానికి ఇష్టపడతారు. చిత్తశుద్ధితో పనులు చేస్తారు. వారు పాటించే క్రమశిక్షణ అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుంది. ఎదుటి వారి తప్పులను కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఇబ్బందులు ఎదుర్కోవడం వీరికి అలవాటుగా మారిపోతుంది. 

నీలం(blue)
నీలం రంగు ప్రశాంతతకు నిదర్శనం. ఇది శాంతిని సూచిస్తుంది. ఈ రంగును ఇష్టపడే వారు కూడా ప్రశాంతంగా జీవించడానికి ఆసక్తి చూపుతారు. వీరు సాధారణంగా కనిపించడానికి, నమ్మకమైన వ్యక్తులుగా సమాజంలో పేరు తెచ్చుకుంటారు. వీరు చాలా ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉంటారు. సున్నిత మనస్కులు. భావోద్వేగాలను బాగా కంట్రోల్ చేసుకోగలరు. 

నారింజ రంగు(orange)
ఆరెంజ్ రంగును ఇష్టపడే వారు మానవ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. వీరు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండటానికి ఇష్టపడతారు. కాన్సన్ ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఈ రంగును ఇష్టపడేవారు ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. సామాజిక కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొంటారు. 

నలుపు(black)
నలుపు రంగు సాధారణంగా లగ్జరీ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ రంగును ఇష్టపడేవారు లగ్జరీ జీవితాన్ని కోరుకుంటారు. తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎప్పుడూ మూడీగా ఉంటారు. నలుపు రంగును ఇష్టపడే వారు తమ భావాలను బయటకు వ్యక్తీకరించడానికి ఇష్టపడరు. వీరి మాటలు, ఆలోచనలు అంత ఈజీగా ఎవరికీ అర్థం కావు. 

ఆకుపచ్చ(green)
ఆకుపచ్చ ప్రకృతిని సంకేతం. ఈ రంగును ఇష్టపడే వారు ప్రశాంతంగా ఉంటారు. కోపం వస్తే అదే విధంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతారు. సాధారణంగా ఉదార స్వభావం కలిగి ఉంటారు. ఎవరైనా మోసం చేస్తే తట్టుకోలేరు. సహజ వాతావరణాన్ని ఇష్టపడతారు. మానవ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. దయా గుణం, దాన గుణం కలిగి ఉంటారు. 

Latest Videos

click me!