ఇలాంటి భార్యలున్న వారు నిజంగా చాలా అదృష్టవంతులు

First Published | Aug 15, 2024, 10:19 AM IST

భార్య రెండు అక్షరాల పదమే అయినా.. ఆమె పాత్ర ఎనలేనిది. భార్యే కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. అందరి బాగోగులు చూసుకుంటూ.. ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఎదగడానికి సహాయపడుతుంది. అయితే కొన్ని లక్షణాలున్న భార్యలు దొరకడం నిజంగా భర్తలు చేసుకున్న అదృష్టమేనంటారు చాలా మంది. 
 

ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే భర్త కంటే భార్యకే మంచి గుణాలుండాలంటారు. ఏ ఇంట్లో అయినా.. భర్తల కంటే భార్యలకే సర్దుకుపోయే గుణం ఉంటుంది. వీళ్లే ప్రశాంతంగా ఆలోచిస్తారు. ఏ సందర్భాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో? కష్టాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఆడవాళ్లే బాగా ఆలోచిస్తారు. అందుకే చాలా మంది ఇండ్లలో ఆడవాళ్లే డబ్బు వ్యవహారాలను చూసుకుంటారు. చాలా మంది భర్తలు సంపాదించి భార్యల చేతిలోనే పెడతారు. వాళ్లు మాత్రం ఖర్చు చేయరు. ఎందుకంటే దేనికి ఎంత ఖర్చు చేయాలి? ఎలా పొదుపు చేయాలి అనే సంగతి ఆడవాళ్లకే బాగా తెలుసు అన్న ముచ్చట మగవారికి తెలుసు. నిజానికి భార్య ఒక్కతే కుటుంబానికి మూలస్తంభం. గృహిణులు తమ కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపిస్తేనే కుటుంబమంతా ఉన్నత శిఖరాలకు వెళ్తుంది. ఉదాహరణకు భర్త తమ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోకపోయినా, బాధ్యతారహితంగా ప్రవర్తించినా.. భార్య బాగుంటే.. ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతుంది. ఎందుకంటే మంచి గుణాలున్న స్త్రీలు మాత్రమే ఇది చేస్తారు. 

అయితే భార్యగా మారిన ఆమె స్వభావం బాగుండకపోతే ఆమె ఆ కుటుంబంలో బతకలేదు. ఇలాంటి మహిళలకు కుటుంబంలో ఉండటం ప్రశాంతంగా ఉండదు. అసలు భార్యలకు ఏ లక్షణాలుంటే భర్తలు  అదృష్టవంతులో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


భర్తకు అండగా..

ఏ భార్యైనా సరే ఎలాంటి సందర్భంలోనైనా భర్తకు అండగా నిలుస్తుంది. ఎప్పుడూ మీకు అండగా ఉండే భార్య దొరికితే మీరు ఎలాంటి డిప్రెషన్ కు గానీ, ఒత్తిడికి గానీ లోనుకారు. ఇంట్లో అంతా సవ్యంగా ఉంటుంది. కేవలం సుఖాలకే కాదు దుఃఖాలకు కూడా అండగా ఉంటుంది. జీవితం సాఫీగా సాగిపోతున్నప్పుడు సంతోషంగా ఉండాలి. ఏదైనా కష్టం వస్తే భర్త ఒక్కడే బాధ్యతను వదిలేయకుండా.. అతనికి అండగా ఉండి సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి. ఇలాంటి భార్యలు దొరికితే భర్తకు కష్టాలు వచ్చినా కుంగిపోడు. 
 

భర్తను గౌరవించే భార్య..

రిలేషన్ షిప్ లో భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా అవసరం. ప్రతి భార్య తన భర్తను ఎంతగానో ప్రేమిస్తుంది. అప్పుడప్పుడు ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి. అలా అని నలుగురిలో భర్తను అవమానించకూడదు. భర్తను పదిమందిలో అవమానించే విధంగా భార్య ప్రవర్తించకూడదు. అలాగే వేరేవాళ్లు తమ భర్త గురించి చెడుగా మాట్లాడినా, అతనిని ఇబ్బంది పెట్టినా లేదా మీ భర్త తప్పు చేసినా.. ఏ భార్యైనా సరే నలుగురిలో భర్తను అవమానించకూడదు. మీరు ఇద్దరే ఉన్నప్పుడు ఏది తప్పు, ఏది మంచో చెప్పే ప్రయత్నం చేయండి. 
 

భర్త బాగోగులపై ఆసక్తి ..

భర్తకు ఏది ఇష్టం, వారికి ఉన్న కోరికలు ఏంటి? వాళ్లకు దేనిపై ఇంట్రెస్ట్ ఉంది, వారితో మాట్లాడటం,  భర్త చేసే మంచి పనులకు మద్దతునివ్వడం.. ఇవన్నీ భార్యాభర్తల మధ్య బంధాన్ని మరింత బలంగా చేస్తాయి. భర్త ఇష్టాఅయిష్టాలను తెలుసుకోవడం భార్య బాధ్యత. అలాగే భార్య కోరికల గురించి భర్త తెలుసుకోవడం కూడా ముఖ్యమే. భార్యలాగే భర్త కూడా ఆమె మనోభావాలను గౌరవించాలి. ఇలా చేస్తే కుటుంబం సుఖసంతోషాలతో నిండిపోతుంది. 
 

కోపంగా 

గొడవ పడినంత మాత్రాన చెడ్డవారు కారు. అసలు ఆమె కోపం దేనికి, ఎందుకే ఈ గొడవ జరుగుతుందో తెలుసుకోవాలి. ఏ భార్య గొడవ వెనుకైనా సరే కుటుంబ సంక్షేమం ఉంటుంది. ఉదాహరణకు.. మీరు డబ్బును వృథాగా ఖర్చు చేయకూడదని, లేదా డబ్బును పొదుపు చేయాలని మీ భార్య పోరాడితే ఆమెపై కోపగించుకోకండి. ఇది ఆమె కుటుంబం కోసం చేసే ఆలోచన. ఇలాంటి భార్య దొరకడం నిజంగా మీ అదృష్టం. 
 

Latest Videos

click me!