బాయ్ ఫ్రెండ్ అయినా, భర్త అయినా.. పార్టనర్ దగ్గర వీటిని మాత్రం సీక్రేట్ గా ఉంచుతారు తెలుసా?

First Published | Sep 4, 2024, 11:04 AM IST

నా భర్త అలా కాదు.. నా దగ్గర అన్ని విషయాలను చెప్తాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అవును మరి.. ఏ మగాడైనా కొన్ని విషయాలను పార్టనర్ దగ్గర చాలా సీక్రేట్ గా ఉంచుతాడట. అవేంటో తెలుసా?
 

మా ఆయనకు నేనంటే చాలా ఇష్టం. ఏదున్నా నాకు చెప్పేస్తాడు. అని చాలా మంది ఆడవాళ్లు మురిసిపోతుంటారు. కానీ బాయ్ ఫ్రెండ్ నుంచి భర్త వరకు.. ప్రతి పురుషుడు తన భార్య దగ్గర కొన్ని విషయాలను దాచిపెడతాడట. అవును ప్రతి మగాడికి తన పార్టనర్ కి కూడా చెప్పుకోలేని కొన్ని సీక్రేట్స్ ఉంటాయట.

అందుకే భార్యను ఎంత ప్రేమించినా.. ఆమె దగ్గర మాత్రం ఖచ్చితంగా కొన్ని విషయాలను దాస్తాడట. ఎదుకంటే ఇలాంటి విషయాలను చెప్పుకుంటే భార్యలు వారిని చులకనగా చూస్తారనే భయం ఉంటుందట. అందుకే కొన్ని విషయాలను మాత్రం దాచేస్తారు. అసలు పురుషులు ఏయే విషయాలను భార్యల దగ్గర దాస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

కన్నీళ్లను.. 

ఆడవాళ్లైతే కష్టమొచ్చినా, బాధొచ్చినా.. బోరున అందరూ చూసేలా ఏడుస్తారు. తమ బాధను బయటపెడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ పురుషులు ఇలా కానే కాదు. ఒకవేళ మీరు బాధను తట్టుకోలేక ఏడ్చినా ఆడవాళ్లలా అలా ఏడుస్తావేంటిరా అని ఏగతాలి కూడా చేస్తుంటారు.

అందుకే పురుషులు ఎప్పుడూ ఏడవరు. అలాగని వీళ్లకు కష్టాలు రావు. కన్నీళ్లు రావు. బాధంటూ ఉండదు అనుకుంటే పొరపాటే. కానీ మగవారికి కూడా బాధ ఉంటుంది. బాధొచ్చినప్పుడు చాలా మంది ఎవ్వరికీ కనిపించకుండా ఏడుస్తారు.

కానీ ఏడిస్తే ప్రపంచం ముందు బలహీనుడను అనే అపవాద పడుతుందనే ఉద్దేశ్యంతో ఎంత బాధొచ్చిన ఏడవరు. ధ్యైర్యంగా ఉన్నట్టు కనిసిస్తారు. ప్రతి పురుషుడు తన భార్యకు తన కన్నీళ్లను చూపించడానికి అస్సలు ఇష్టపడడు. కానీ ఎవరూ లేనప్పుడు మాత్రం ఎవరికీ వినిపించకుండా ఏడుస్తారు. 
 



ఒత్తిడి ఉన్నా లేనట్టుగానే ఉంటారు..

మగాళ్ల జీవితంలో ఒత్తిడి ఉండటం సర్వ సాధారణం.  కుటుంబ పోషన, పిల్లల చదువులు అంటూ చాలా సార్లు ఒత్తిడికి లోనవుతుంటారు. కానీ ఈ విషయాన్ని ఇంట్లో చెప్పుకోవడానికి మాత్రం ఇష్టపడరు. చాలా సందర్భాలలో మగవారు తమకున్న సమస్యలను కుటుంబం లేదా వారి భాగస్వామికి కూడా చెప్పుకోరు.

కానీ ఇలాంటి పరిస్థితిలో పురుషులను ఒంటరిగా ఒదిలేయకుండా వారి ఒత్తిడి గురించి తెలుసుకుని దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే వారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. 
 

ట్రెండ్ ను ఇస్టపడటాన్ని దాస్తారు...

ప్రతి ఒక్కరికీ ట్రెండ్ ను ఫాలో అవ్వలని ఉంటుంది. అంటే మంచి మంచి బట్టలు, షూష్ ధరించాలని ప్రతి ఒక్క పురుషుడికీ ఉంటుంది. కానీ చాలా వరకు మగవారు ట్రెండ్ ను ఫాలో అయ్యే వారిని చూసే త్రుప్తి పడుతుంటారు.

ఇంటి బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల ట్రెండ్ కు చాలా దూరంగా ఉండేవారు చాలా మందే ఉంటారు. ఈ విషయాన్ని కూడా పార్టనర్ కు తెలియనివ్వరు. 
 


మీ సోషల్ మీడియాను చెక్ చేసే విషయాన్ని దాస్తారు..

అమ్మాయిలు ఏది ఏమైనా తమ బాయ్ ఫ్రెండ్, భర్తల సోషల్ మీడియాలను ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే.. పురుషులు కూడా వారి పార్టనర్ సోషల్ మీడియాను చెక్ చేస్తారు. ఇలా గమనించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.

 సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అయ్యే వ్యక్తులు లేదా మీరు ఏ వ్యక్తులను ఫాలో అవుతున్నారు, వారు ఎలాంటి మెసేజ్ లను పంచుకుంటారు. మీ పోస్ట్ ను ఎవరు ఎక్కువగా ఇష్టపడతారు అనే విషయాలను  పురుషులు గమనిస్తూ ఉంటారట.

ఇలా గమనించడం కొందరికి తప్పుగా అనిపించొచ్చు కానీ ..కొన్ని సందర్భాలలో అపరిచిత వ్యక్తుల నుంచి మిమ్మల్ని రక్షించుకొవడానికి కూడా ఇలా చేస్తుంటారు. అయితే ఈ విషయాన్ని కూడా పురుషులు తమ భాగస్వామికి అస్సలు చెప్పరు. 
 


అందమైన అమ్మాయిల వైపు చూడటాన్ని దాస్తారు..

నా భర్త లేదా భాయ్ ఫ్రెండ్ తమను కాకుండా వేరే అమ్మాయిని కన్నెత్తి కూగా చూడడు అని గుడ్డిగా నమ్ముతుంటారు అబ్బాయిలు. కానీ అబ్బాయిలు అందమైన అమ్మాయి కనిపిస్తే ఖచ్చితంగా వారివైపు చూస్తారట. నమ్మశక్యంగా లేకపోయినా నమ్మాల్సిన నిజం ఇది.

కానీ వేరే వానిని చూసినంత మాత్రాన మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు కాదు. మిమ్మల్ని కాకుండా వేరే అమ్మాయిని చూసి ఊరుకుంటే ఓకే కానీ మీకు తెలియకుండా వారితో చాట్ చేయడం,రహస్యంగా మాట్లాడితే అనుమానించాల్సిందే.
 

Latest Videos

click me!