శృంగారం సమయంలో ఇలా ఆలోచిస్తున్నారా? తప్పేం లేదట..

First Published | Mar 4, 2022, 1:29 PM IST

మహిళలు అత్యంత సాధారణంగా శృంగారం సమయంలో సెక్స్ కాకుండా.. వేరే విషయాల గురించి ఆలోచిస్తారట. అవేంటో.. ఎలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారో చూద్దాం... 

obesity _sex life

శారీరక, మానసిక ఆరోగ్యానికి శృంగారం ఎంతో మంచిది. అయితే చాలాసార్లు మంచి మూడ్ లో ఉన్న సమయంలో మనసు పరి పరి విధాలా ఆలోచిస్తుంటుంది. అనేక రకాల అంశాలు మదిలో మెదులుతుంటాయి. ముఖ్యంగా స్త్రీలకు రకరకాల విషయాలు ఆ సమయంలో గుర్తుకు వస్తుంటాయి. అంటే తమ భాగస్వామి విషయంలో నెగెటివ్ గా ఉన్నారని కాదు.. వారు సెక్స్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నారని కాదు. ఇది చాలా సర్వ సాధారణంగా ప్రతీ మహిళకు అనుభవంలోకి వచ్చే విషయమే.. 

obesity

బరువు తగ్గడం
“ఇప్పుడు ఉన్నదానికంటే కాస్త బరువు తగ్గాలా? నేను చాలా సన్నగా ఉన్నానా? నా ఎముకలు అతనిని కుచ్చుకునే అవకాశం ఉందా? సెక్స్ తర్వాత ఎన్ని క్యాలరీలు కోల్పోయానో చూసుకోవాలి...లాంటి ఆలోచనలు బరువు సమస్యతో ఇబ్బంది పడే మహిళల్లో తరచుగా.. ఇంకా చెప్పాలంటే సర్వసాధారణంగా ఉంటాయి. 


ఆహారం
చాలామంది ఆడవారు వారు అనుకోకుండానే ఆహారం వాటి చుట్టూ ఆలోచనలు పరిగెడుతుంటాయి. సెక్స్ సమయంలో కూడా ఇవి మామూలే. పాలు మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టానా? సెక్స్ తరువాత ఆకలేస్తుంది. ఫ్రిజ్ లో తినడానికి ఏమున్నాయి? స్టవ్ ఆఫ్ చేశానా? మర్చిపోయానా? ఇలాంటివి అతి సాధారణంగా వచ్చే ఆలోచనలు. 

ఆహారం
చాలామంది ఆడవారు వారు అనుకోకుండానే ఆహారం వాటి చుట్టూ ఆలోచనలు పరిగెడుతుంటాయి. సెక్స్ సమయంలో కూడా ఇవి మామూలే. పాలు మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టానా? సెక్స్ తరువాత ఆకలేస్తుంది. ఫ్రిజ్ లో తినడానికి ఏమున్నాయి? స్టవ్ ఆఫ్ చేశానా? మర్చిపోయానా? ఇలాంటివి అతి సాధారణంగా వచ్చే ఆలోచనలు. 

బెస్ట్ ఫ్రెండ్ గురించి... 
శృంగారం సమయంలో స్త్రీలు తమ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి కూడా ఆలోచిస్తారు. తన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నఎలాంటి వ్యక్తితో డేటింగ్ చేస్తుందో అని చాలా ఆందోళన పడుతుంటారు. "అతనిలో నిబద్ధత అంతగా కనిపించడం లేదు. అతను ఆమెకు బాగానే చూసుకుంటాడా? అని కూడా ఆలోచిస్తారు. 

పుస్తకం.. పోలికలు..
తాము చదివిన శృంగార నవలల్లోని కథానాయకుడిలా తమ భాగస్వామి ఉన్నాడా? లేదా అనే పోలికను చేస్తుంటారు. క్లాస్టీ గిఫ్ట్ లు చక్కటి డేటింగ్ ఇలా అనేకం ఆలోచిస్తారు. 

kids

పిల్లలు
ఇక తల్లులైతే పిల్లల గురించి ఆలోచన చాలా కామన్. వారు హోం వర్క్ చేశారో లేదో, టీచర్ తో చీవాట్లు పడకుండా ఉండాలి.. స్కేటింగ్ లేదా గేమ్స్ లో ప్రాబ్లం రాకుండా ఉండాలి. టీచర్లు సరిగానే చెబుతున్నారా? వీళ్లు సరిగానే వింటున్నారా? బాగా చదువుతారో లేదో... ఇలా అనేకం పిల్లల విషయంలో ముప్పిరిగొంటాయి. 

పని ఒత్తిడి..
వర్క్ హాలిక్ గా ఉండే స్త్రీలు ఎప్పుడూ అలాంటి ఆలోచనల్లోనే ఉంటారు. సెక్స్ సమయంలోనూ ప్రాజెక్ట్ రిపోర్ట్, అన్ని స్టోరీల ఆన్-టైమ్ షెడ్యూలింగ్,  కొత్త ప్రాజెక్ట్ ఎలా జరగబోతోంది లాంటి వాటి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు.

Latest Videos

click me!