మీ భార్యకు మీపై ప్రేమ లేదా? అయితే ఇలా చేయండి

First Published | Dec 17, 2023, 2:08 PM IST

భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం సమానంగా ఉన్నప్పుడే వైవాహిక జీవితం సాఫీగా నిండు నూరేళ్లు సాగుతుంది. కానీ కొన్ని జంటల్లో ఇది కనిపించదు. పెళ్లైన తర్వాత కూడా కొందరు తమ భాగస్వామిని ప్రేమించరు. ఇది భర్తను ఎంతో బాధిస్తుంది. 
 

పెళ్లి బంధం చాలా సున్నితమైంది. దీన్నినిర్వహించడం అనుకున్నంత సులువేం కాదు. అందుకే వైవాహిక జీవితం సాఫీగా సాగేందుకు భార్యాభర్తలిద్దరూ ప్రయత్నించాలి. అయితే భార్య మిమ్మల్ని ప్రేమించడం లేదని తెలిస్తే తట్టుకోవడం కష్టమే. దీనివల్ల మీరు విడిపోయే అవకాశం కూడా ఉంది. అయితే కొన్ని చిట్కాలతో భార్య మిమ్మల్ని ప్రేమించేలా చేయొచ్చు. అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఆలోచించండి

అసలు మీ భార్య మిమ్మల్ని ఎందుకు ప్రేమించడం లేదన్న విషయాన్ని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించండి. సమస్య ఎక్కుడుందనేది తెలుస్తుంది. ఏ కారణం వల్ల మీ భార్య మిమ్మల్ని ప్రేమిచడం లేదో కనిపెడితే మీరు సమస్యను సులువుగా పోగొట్టొచ్చు. తిరిగి మీ భార్య ప్రేమను దక్కించుకోవచ్చు. 
 

Latest Videos


ఒకరితో ఒకరు మాట్లాడటం

సరైన సమయాన్నిచూసుకుని మీ భార్యతో మాట్లాడండి. మీరు ఆమెను ఎంతగా  ప్రేమిస్తున్నారో అర్థమయ్యేలా చెప్పండి. అయితే మీ భార్యతో మీరు మాట్లాడేటప్పుడు "నేను" తో ప్రారంభమయ్యే వాక్యాలను ఉపయోగించండి. అంటే నేను ఇలా అనుకుంటున్నాను, అలాగు అనుకుంటున్నాను, నాకు నువ్వు చాలా ఇష్టం వంటి మాటలను మాట్లాడండి. ఇవి మీరు వారిని ప్రశ్నిస్తున్నట్టు ఉండవు. అలాగే ఒత్తిడి పెట్టినట్టు అనిపించదు. 

Image: Getty

వారి మాటలను వినండి

మీ భార్య చెప్పే మాటలను బాగా వినండి. అలాగే ఆమె మనసులోని మాటలను చెప్పేందుకు అవకాశం ఇవ్వండి. వారి భావాలను, భయాలను, ఆందోళలను అర్థం చేసుకోండి. ఇలా చేస్తే ఆమెకు మీపై నమ్మకం కలుగుతుంది. ప్రేమ పుట్టడం స్టార్ట్ అవుతుంది. 

నీ ప్రేమను చూపించు

అవకాశమున్నప్పుడల్లా మీ భార్యకు  నీ ప్రేమను, అభిమానాన్ని చూపించండి. అలాగే మీకు బ్రేక్ సమయంలో వారితో మాట్లాడండి. లేదా ఆమె కోసం పువ్వులను తీసుకెళ్లండి. అలాగే ఇంటి పనిలో ఆమెకు సాయం చేయండి. అలాగే మీ కోసం వంట చేసినప్పుడు కాంప్లిమెంట్స్ ఇవ్వండి. దీనివల్ల మీ భార్యకు మీపై ఎక్కడ లేని ప్రేమ కలుగుతుంది. 
 

కలిసి సమయాన్ని గడపండి

మీకు వీలైనప్పుడల్లా కలిసి సమయాన్ని గడపండి. ఎక్కడికైనా ప్లాన్ చేసుకోండి. లంచ్, డిన్నర్ లేదా సినిమా డేట్ కు కలిసి వెళ్లండి. అయితే వీటికి మీ భార్య పర్మిషన్ ను ఖచ్చితంగా తీసుకోండి. దీనివల్ల వారి మనస్సులో మీ పట్ల గౌరవం ఏర్పడుతుంది.

ఓపిక పట్టండి

వైవాహిక జీవితాన్ని ముందుకు సాగించడం కష్టం. ఇందుకు మీకు ఓపిక చాలా అవసరం. చెడు జరగడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ దాన్ని మెరుగుపడటానికి సంవత్సరాల సమయం పడుతుంది. అయితే పెళ్లైన ప్రతి జంట ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. కానీ వీటిని కాలంతో పాటుగా పరిష్కరించుకుంటారు. 
 

click me!