భార్య వంటగదిని నిర్వహిస్తే, ఇంట్లో మిగిలిన వస్తువులను చక్కదిద్దే బాధ్యత మీరు తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా, పని కూడా త్వరగా ముగుస్తుంది. మీ ఇద్దరికీ కూర్చుని మాట్లాడుకోవడానికి సమయం లభిస్తుంది. ఈ సమయం జంటకు చాలా ముఖ్యమైనది.
స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వండి
భార్య ఎంత అలసిపోయినా, ఎంత దుర్భరమైన రోజైనా సరే, భర్త ఒక్క గులాబీని తీసుకువస్తే, భార్య మూడ్ మొత్తం మారిపోతుంది. ఈ చిన్న చిన్న విషయాలు రోజంతా జరిగిన వాటిని మరచిపోవడానికి, హృదయాన్ని సంతోషపెట్టడానికి సహాయపడతాయి. ఆమె దీన్ని గుర్తుంచుకుంటుంది. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఆమె ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తూ ఉంటుంది.