రొమాన్స్ కూడా వ్యాయామం లాంటిదే.. ఎలా అంటే?

First Published | Dec 16, 2023, 2:09 PM IST

కలయిక కూడా  ఒక గొప్ప వ్యాయామంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది కూడా వ్యాయామం మాదిరిగానే కేలరీలను కరిగించడానికి సహాయపడుతుంది. మీ బరువు తగ్గేందుకు ఉపయోకరంగా ఉంటుంది. 

మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండటం కూడా ఒక వ్యాయామం లాంటిదేనని చెప్తే ఆశ్చర్యపోతారు. అవును ఇది కూడా మీ శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే వ్యాయామం లాగే. ఎలా అంటే రతిక్రీడలో శరీరం ఎన్నో విధాలుగా కదులుతుంది. అలాగే శరీరాన్ని సాగదీస్తారు. ఇది మిమ్మల్ని ఫిట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

Sex Life

కేవలం ట్రెడ్ మిల్ పై పరిగెత్తడాన్నే కార్డియో వ్యాయామం అనుకుంటే పొరపాటే. ఆర్కైవ్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. లైంగిక కార్యకలాపాలు కూడా తేలికపాటి నుంచి మితమైన వ్యాయామం అని తేల్చింది.


పిఎల్ఓఎస్ లో ప్రచురించబడిన మరొక అధ్యయనం .. మహిళలు సెక్స్ సెషన్ కు 25 నిమిషాల పాటు 69 కేలరీలను బర్న్ చేయగలరని కనుగొన్నారు. ట్రెడ్ మిల్ పై పరిగెత్తడం కంటే ఇది తక్కువే అయినప్పటికీ.. ట్రెడ్ మిల్ పై పరిగెత్తడం కంటే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం చాలా సరదాగా ఉంటుందని చాలా మంది పాల్గొనేవారు నివేదించారు.
 

ఎక్కువ కేలరీలను బర్న్ చేయొచ్చు

పరిమిత సమయంలో ఎక్కువ కేలరీలను బర్న్ చేయాలనుకుంటే కలయిక ఇందుకు చక్కగా సరిపోతుంది. అవును కొత్త కొత్త లైంగిక భంగిమలు మీరు ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి సహాయపడతాయి. అంతేకాదు దీనిలో మీరు లైంగిక ఆనందాన్ని కూడా ఎక్కువగా పొందుతారు. 
 


అలాగే మీరు మరిన్ని ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి మంచంపై ఇంకొత సమయాన్ని పొంచొచ్చు. అయితే ఫోర్ ప్లే సమయాన్ని పెంచడంతో పాటు సెక్స్ సెషన్ల సమయాన్ని పెంచాలనుకుంటే మాత్రం మీ స్టామినాను ముందు పెంచాలి. అలాగే కెగెల్ వ్యాయామాలను చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వ్యాయామాలు మీకు మరింత నియంత్రణను ఇస్తూ మీ కటి ఫ్లోర్ కండరాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి.

Marrige sex

వ్యాయామానికి ప్రత్యామ్నాయం కాదు

లైంగిక కార్యకలాపాలు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. కానీ ఇది వ్యాయామాన్ని భర్తీ చేయదు. ముఖ్యంగా మీ ఫిట్నెస్ విషయంలో. ఫిట్ గా ఉండాలంటే మాత్రం మీరు ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. తీవ్రమైన సంభోగం 6 నుంచి 10 నిమిషాలు మాత్రమే సిఫార్సు చేయబడింది.
 

Latest Videos

click me!