Relationship: లవ్ ప్రపోజల్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతారు?

First Published | Aug 7, 2023, 1:05 PM IST

Relationship: ప్రేమించడం ఒక ఎత్తు అయితే నా ప్రేమని వ్యక్తపరచడం మరొక ఎత్తు. ఎదుటి మనిషి మన ప్రేమని ఒప్పుకునే లాగా మన మనసులో భావాన్ని చెప్పటం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
 

ప్రేమ వివాహారాలు సాధారణంగా స్నేహం నుంచే మొదలవుతాయి. ఒక వ్యక్తి పరిచయం అయిన తరువాత ముందుగా స్నేహం చేస్తారు. ఆ తర్వాత ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన వలన తెలియకుండానే మనం ఆ వ్యక్తి ప్రేమలో పడిపోతాం.అయితే అక్కడ వరకు బానే ఉంది.

కానీ మన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తితో చెప్తే ప్రేమ సంగతి పక్కన పెడితే ఉన్న స్నేహం పోతుందేమో, ఒప్పుకోకపోతే భరించడం ఎలాగో అని చాలామంది భయపడుతుంటారు. అందుకే మీరు ప్రేమించిన వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ఆమెకి ప్రపోజల్ చేయటం ఎలాగో చూద్దాం.


ముందుగా మీరు ప్రేమిస్తున్న వ్యక్తికి మీరంటే ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోండి. తన మనసులో మీకున్న ప్రాధాన్యత ఏమిటో పసిగట్టండి. తరువాత వారి ఇస్టాఇష్టాలని తెలుసుకోండి. వారికి నచ్చిన ప్రదేశానికి తీసుకువెళ్లి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ మనసులో మాట ఆమెకి అర్థమయ్యేలాగా చెప్పండి.
 

లవ్ ప్రపోజల్ అంటూ పెద్ద హడావిడి, ఫ్రెండ్స్ తో పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తూ అనవసరమైన హంగామా చేయకండి. ఒకవేళ మీ ప్రేమను ఎదుటి వ్యక్తి స్వీకరించకపోతే మీరే అబాసుపాలవుతారు. మీరు లవ్ ప్రపోజ్ చేస్తున్నారంటే అందుకు బలమైన కారణాలు ఆ అమ్మాయి గుర్తించగలగాలి.

ఎందుకంటే తెలియని వ్యక్తి వచ్చి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే అది అసహజంగా ఉంటుంది. లవ్ ప్రపోజ్ చేయడానికి టైమింగ్ కూడా ఎంతో ముఖ్యం. టైమింగ్ మిస్ అయితే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తన మూడ్ ఎలా ఉందో గమనించి అప్పుడు మీ మనసులో మాటని ఆమెకి తెలియ చెప్పండి. మీరు ఐ లవ్ యు చెప్పటానికి ముందే మీరు తనని ప్రేమిస్తున్నాను అనే కొన్ని హింట్స్ ఆమెకి ఇచ్చే ప్రయత్నం చేయండి.

 దీనివల్ల ఆమె మీ ప్రపోజల్ కి కొంచెం ప్రిపేర్ గా ఉంటుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ముందుగానే కాస్త హోంవర్క్ చేయండి. మీరు ప్రపోజ్ చేయగానే ఆమె యాక్సెప్ట్ చేయాలని భావించకండి. ఆమెకు నిర్ణయించుకోవటానికి కాస్త టైం ని  ఇవ్వండి. ఇలా చేయటం వలన ఆ అమ్మాయికి మీ మీద గౌరవం పెరిగి కచ్చితంగా మీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది.

Latest Videos

click me!