స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అన్నాడో సినీ కవి. నిజంగానే కొన్ని స్నేహాలు రక్తసంబంధాన్ని కూడా మరిపించే లాగా ఉంటాయి. మనం కూడా మనం కష్టసుఖాలని బంధువులతో కన్నా స్నేహితులతోనే పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తాము.
అయితే కొన్ని విషయాలు మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ కి కూడా చెప్పొద్దంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అంటున్నారు అవేంటో చూద్దాం. సాధారణంగా భార్యాభర్తల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఫ్రెండ్స్ తో చెప్పుకోకూడదు.
ఎందుకంటే సమస్య తీరిన తరువాత భార్యాభర్తలు ఒకటవుతారు కానీ ఫ్రెండ్స్ మాత్రం ఆ విషయాన్ని పదేపదే గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు భర్తతో వచ్చే ఇష్యూస్ ఎవరికీ చెప్పకండి. అలాగే ఆర్థికంగా వచ్చే ఇబ్బందుల గురించి కూడా మీ ఫ్రెండ్స్ తో చర్చించకండి.
అలాగే భాగస్వామి పూర్వ సంబంధం లేదా ఇతర సంబంధాల గురించి మీ స్నేహితుడికి చెప్పకండి. అది మీ కుటుంబ నాశనానికి కారణం కావచ్చు. అలాగే మీ కలలను మీ లక్ష్యాలను వీలైనంతవరకు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోకండి. ఎందుకంటే మీకు ఉండే ప్రతి ఫ్రెండు మీ అభివృద్ధిని మాత్రమే కోరుకోరు.
అలాగే పడకగది వ్యవహారాలు కూడా ఫ్రెండ్స్ తో ఎప్పుడు చర్చించవద్దు. పొరపాటున ఈ విషయం మీ భర్తకి తెలిసిందంటే మీ ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ భాగస్వామి యొక్క బలహీనతలు కూడా ఎప్పుడూ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోకండి.
ఎందుకంటే మీకుండే ప్రతి మిత్రుడు మీయొక్క సౌఖ్యాన్ని కోరుకోడు. పొరపాటున ఈ విషయాలు మీ భాగస్వామికి చేరవేస్తే నష్టపోయేది మీరే. కాబట్టి ఎంత ఆప్తమిత్రుడైనప్పటికీ ఏ విషయం చెప్పాలో ఏ విషయం చెప్పకూడదో ఆలోచించి అప్పుడు మాట్లాడండి.