భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్త ఏం చేయాలో తెలుసా.. ఎలా స్పందించలో తెలుసా?

First Published Nov 26, 2021, 1:34 PM IST

వివాహబంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటవుతారు. పెళ్ళంటే (Marriage) నూరేళ్ళ పంట అని అంటారు పెద్దలు. అయితే పెద్దలు కుదిర్చిన వివాహమైనా, ప్రేమ వివాహమైనా వారిలోని విభేదాల కారణంగా వారి కాపురాలు కూలిపోతున్నాయి. ఇలా వారి కాపురాలు కూలి పోవడానికి పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ముఖ్య కారణం. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్త ఏం చేయాలో తెలుసుకుందాం..
 

వివాహబంధంతో ఒక్కటైన జంట వారి దాంపత్య జీవితాన్ని (Life) సరైన మార్గంలో వెళ్లడానికి ఇద్దరూ తమ వంతు ప్రయత్నం చేయాలి. దాంపత్య జీవితాన్ని ఇతరులతో పోల్చుకోరాదు. తమ స్థాయిని బట్టి, స్థితిగతులను బట్టి వారి దాంపత్య జీవితం ఎలా ఉండాలనేది చక్కగా ప్లాన్ చేసుకోవాలి. దాంపత్య జీవితాన్ని ఇతరులతో పోల్చి చూసినప్పుడు కాపురంలో విభేదాలకు (Conflicts) దారితీస్తుంది.
 

కుటుంబ కలహాలచేత, వారి ఆర్థిక స్థితి కారణంగా, భార్యాభర్తల మధ్య సఖ్యత సరిగ్గా లేకపోవడం చేత ఇలా అనేక కారణాలతో మహిళలు ఇతరులతో అక్రమ సంబంధానికి దారితీస్తోంది. వారి వివాహేతర సంబంధం (Extramarital affair) వారి కాపురంలో విభేదాలకు కారణమవుతూ విడాకులకు దారితీస్తుంది. పరాయి వ్యక్తులతో అక్రమ (Illegal affair) సంబంధం వారి జీవిత పతనానికి దారి తీస్తుంది.
 

ఇలా వారు పరాయి వ్యక్తులతో సంబంధం పెట్టుకోవడానికి ముఖ్య కారణం భర్త ప్రవర్తన సరిగా లేకపోవడం. వివాహ బంధంలో భార్య భర్తల మధ్య సఖ్యత (Compatibility) అనేది ఉండాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం (Believe) అనేది ఏర్పడినప్పుడే వారి జీవితం సరైన దారిలో నడుస్తుంది. వివాహ బంధంలో నమ్మకం అనేది వారి వైవాహిక జీవితానికి పునాది లాంటిది. భార్య మనసును అర్థం చేసుకోవడానికి భర్త ప్రయత్నించాలి.
 

ఆమెపై ప్రేమను (Love) ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆమెను సంతోషపరచాలి. ఆమె కోరికలు తెలుసుకుంటూ వాటిని వీలైనంత వరకూ తీర్చడానికి తమవంతు ప్రయత్నం చేయాలి. ఆమెకు మీపై గౌరవం (Respect), నమ్మకం ఏర్పడేలా చూసుకోవాలి. ఆమెకు మీ పై మంచి అభిప్రాయం ఉన్నప్పుడు పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఆలోచన ఉండదు.
 

కొందరు మహిళలు విలాసవంతమైన జీవితం (Luxurious life) కోసం పరాయి వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటారు. ఇలా వారి వివాహేతర సంబంధము బయటపడినప్పుడు వారి కాపురం కూలిపోతుంది. భర్త ఎలాంటివాడైనా అతను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అంతేకానీ పరాయి వ్యక్తితో సంబంధం మంచిది కాదు. ఇలా చేయడంతో సమాజం దృష్టిలో మీరు చెడ్డవారిగా (Bad guys)  మిగిలిపోతారు.
 

ఒకవేళ భర్త మిమ్మల్ని వేధిస్తుంటే, భర్త ప్రవర్తన సరిగా లేకుంటే, భర్త సంసారానికి పనికి రాకుంటే మీరు లాయర్ ను సంప్రదించి విడాకులు (Divorce) తీసుకోవడం మంచిది. అలా కాకుండా పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుని చెడ్డవారిగా మారకండి. ఇలా చేయడంతో పిల్లల దృష్టిలో మీరు చెడ్డవారిగా మిగిలిపోతారు. పిల్లలకు తల్లి పైన అభిప్రాయం (Opinion) ఎప్పుడూ మంచిగానే ఉండాలి.  అప్పుడే పిల్లల ప్రవర్తన కూడా సరైన దారిలో ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది.

click me!