మీరు హోప్ లెస్ రొమాంటికా..? ఇదిగో క్లారిటీ..!

First Published Oct 25, 2021, 2:06 PM IST

ఈ హోప్ లెస్ రొమాన్స్ ని అందించేవారు  ప్రేమను  చాలా సానుకూల దృక్పథంతో చూస్తారు.అలాంటి ప్రేమను మీరు ఒకరికి అందించాలా..? లేక మీకు దక్కించుకోవాలంటే ఏం చేయాలో దీని గురించి నిపుణులు చెబుతున్నారు.

bed room

‘హోప్ లెస్ రొమాన్స్’ ఈ పదం ఎప్పుడైనా విన్నారా..? ఈ పదం వినగానే.. చాలా మందికి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే.. అలాంటి ప్రేమ.. సినిమాల్లో మాత్రమే లభిస్తుందని అనుకుంటూ ఉంటారు.   అయితే.. ఇలాంటి ప్రేమను మనలో చాలా మంది కోరుకుంటూ ఉంటారు. అయితే.. అసలు ఈ హోప్ లెస్ రొమాన్స్ అంటే ఏంటి..? ఇలాంటి రొమాన్స్, ప్రేమను అందరూ ఎందుకు కోరుకుంటారు...? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..

హోప్ లెస్ రొమాన్స్.. అంటే.. గతంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రేమను నమ్మడం ఆపకపోవడం. ప్రేమించడం ఆపకపోవడం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా..  ప్రేమ విజయం సాధింస్తుందని నమ్మడాన్ని హోమ్ లెస్  రొమాన్స్ అంటారు. ఈ హోప్ లెస్ రొమాన్స్ ని అందించేవారు  ప్రేమను  చాలా సానుకూల దృక్పథంతో చూస్తారు.అలాంటి ప్రేమను మీరు ఒకరికి అందించాలా..? లేక మీకు దక్కించుకోవాలంటే ఏం చేయాలో దీని గురించి నిపుణులు చెబుతున్నారు.
 


హోప్ లెస్ రొమాన్స్  అందించేవారు.. చాలా ఆశావాదులుగా ఉంటారు. కొత్త కొత్తగా ప్రేమించడం ఎలా అనేది వీరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఎప్పుడు ఎలా ప్రేమ అందించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వీరు తొందరగా ఎవర్నీ ఇగ్నోర్ చేయరు. ఏదైనా సమస్య వస్తే.. దానిని ఎలా పరిష్కరించాలనే ఆలోచిస్తూ ఉంటారు.

ఒక రిలేషన్ షిప్ ఆనందంగా ముందుకు సాగాలి అంటే..  ఆ రిలేషన్ లో ఉన్న ఇద్దరూ ఒకే మాటపై ఉండాలి. వారు తీసకునే నిర్ణయాలు.. వారి బంధం ఎంత బలంగా ఉంది అనే విషయం ప్రతిదీ 50-50 ఉంటుంది.  అయితే.. ఆ ఇద్దరిలో ఒక్కరే ఎక్కువ ప్రేమను చూపించడం.. బంధం పట్ల బాధ్యతగా ఉండటం లాంటివి చేస్తే.. వారిని హోప్ లెస్ రొమాన్స్ అందిస్తున్నారని చెప్పొచ్చట. 

వీరు..తమ గురించి కన్నా కూడా..  తమ భాగస్వామి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారట. అయితే.. మీరు అందించే ప్రేమను కూడా మీ భాగస్వామి అర్థం చేసుకోలేని సందర్భాలు కూడా వస్తూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
 

అంతేకాదు.. ఇలాంటి వారు తమ పార్ట్ నర్ కోసం చాలా కష్టపడతారు. వారితోనే ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటూ ఉంటారు.  ఎంతలా అంటే.. మీ ఇష్టాలను., మీ స్నేహితులను కూడా పట్టించకోకుండా.. ప్రతి  నిత్యం వారికోసమే పరితపిస్తూ ఉంటారు. తమ పార్ట్ నర్ కి ఎలా ఉంటే నచ్చుతుంది..? ఏం చేస్తే నచ్చుతుంది.. ఇలా ప్రతి విషయంపై దృష్టి పెడతారు.
 

అయితే.. ఇలాంటి ప్రేమను  చాలా మంది సినిమాటిక్ గా పోలుస్తూ ఉంటారు. సినిమాల్లో బాగుంటుంది కానీ... రియల్ లైఫ్ లో సెట్ అవ్వదు అని అనుకుంటూ ఉంటారు. అయితే..నిజ జీవితంలో జీవితంలోని వాస్తవికతలను గురించి మీకు అవగాహన ఉన్నంత వరకు ఇలాంటి ప్రేమను అందించాలని అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదని నిపుణులు చెబుతున్నారు.
 

అయితే.. మీరు అందిస్తున్న ప్రేమను ఎదుటివారు సరిగా స్వీకరించలేకపోతే మాత్రం నిరాశకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంత ప్రేమ చూపించేవారు.. రియల్ గా రొమాన్స్, సెక్స్ విషయంలో అంత సూపర్ గా ఉండరేమో అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. అయితే.. అందులో  ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.

click me!