వివాహబంధం (Marriage) పరమ పవిత్రమైనది. ప్రేమ వివాహమైన, పెద్దలు కుదిర్చిన వివాహమైన భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ బంధాన్ని కాపాడుకోవాలి. వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం ఓర్పు (Patience) ఉండాలి.
ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకొనుటకు ప్రయత్నం చేయాలి. ఇద్దరి మధ్య గొడవలు (Conflicts) వచ్చినప్పుడు ఆ గొడవకు గల కారణాన్ని వెంటనే పరిష్కరించుకోవాలి.
గొడవలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం (Neglected) వహించడం వలన బాధపడాల్సి వస్తుంది.
అయితే మా ఆయన అసలు పట్టించుకోవట్లేదు (Ignore) అనే మహిళలు తప్పనిసరిగా ఈ విషయాలను గ్రహించాలి. పెళ్లయిన కొత్తలో మొదట అన్యోన్యంగా చాలా ప్రేమగా ఉంటారు. కొంతకాలానికి మీ మీద ప్రేమ (Love) తగ్గిందని భావిస్తారు.
భర్త భార్యను నిర్లక్ష్యం (Neglected) చేసినప్పుడు వారు చాలా బాధపడి డిప్రెషన్ లోకి (Depression) వెళ్తారు. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతుంటారు. మీ భర్త అసలు మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో దానికి గల కారణాలను తెలుసుకోవాలి.
తనతో మనసువిప్పి (Mind blowing) మాట్లాడాలి. తనకు మీరు ఎలా ఉంటే నచ్చుతుందో తెలుసుకోవాలి. వారి కుటుంబ సభ్యులకు తగిన గౌరవం ఇవ్వాలి. అప్పుడు మీ భర్తకు మీ మీద తగిన గౌరవం ఏర్పడుతుంది. ఒక్కోసారి అతనికి ఉన్న పని ఒత్తిడి (Stress) వల్ల మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు.
లేకపోతే ఏమైనా సమస్యలు (Problems) ఉంటే వాటి గురించి అడిగి తెలుసుకోండి. వారితో మీరు ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి. కొందరు మగవారు తమ ప్రేమను బయటకు వ్యక్తపరచరు. ఆ ప్రేమను (Love) రాత్రి పడక మీద బయట పెడుతుంటారు.
అంతమాత్రాన వారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని భావించరాదు. పడకగదికి (Bedroom) ప్రాధాన్యత ఇస్తున్నారని అనుకోవడం తప్పు. కొందరి మనస్తత్వం (Psychology) అలానే ఉంటుంది. వారి మనసులో భావాభిప్రాయాలను బయటపెట్టరు.
కాబట్టి మహిళలు (Women) వాటిని అర్థం చేసుకుని తమ వివాహ జీవితాన్ని నిలబెట్టుకోవడం అవసరం. మీరు అనవసరంగా తప్పుదారిలో (Misguided) ఆలోచించి మీ మధ్య దూరాన్ని పెంచుకోకండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మీ వివాహ జీవితాన్ని సుఖమయం చేసుకోండి.