1000 అబద్ధాలతో ఒక పెళ్లి చేయడం న్యాయమేనా?

First Published Dec 2, 2021, 2:11 PM IST

పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు పెద్దలు. ఇలాంటి దాంపత్య జీవితంలో (Marital life) ఆలుమగలు అన్యోన్యంగా ఉంటూ వారి జీవన ప్రయాణాన్ని మంచి గమ్యంలో నడిచేలా తమ వంతు ప్రయత్నం చేయాలి. పూర్వకాలంలో 1000 అబద్ధలాడి ఒక పెళ్లి చేసే వారు పెద్దలు. ఇలా 1000 అబద్ధాలతో ఒక పెళ్లి చేయడం న్యాయమా.. అనే ప్రశ్న పై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ (Article) ముఖ్య ఉద్దేశం.
 

పూర్వకాలంలో 1000 అబద్ధాలతో (Lies) ఒక పెళ్లి (Married) చేసేవారు. ఇలా పెద్దలు అబద్ధాలు చెప్పి పెళ్లి చేయడానికి అబ్బాయి, అమ్మాయి పెళ్లి వయసు వచ్చిన పెళ్లి కాకపోవడం లేదా వారి ఆర్థిక ఇబ్బందులు, వారిలోని చెడు అలవాట్లు,  ఉద్యోగం చేయకపోవడం వంటివి ముఖ్య కారణాలు కావచ్చు. పెళ్లి తర్వాత అయినా వారి జీవితం సరైన దారిలో ఉంటుందని పెద్దలు అబద్ధాలు చెప్పి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తారు.  
 

పెళ్లికి ముందు భాగస్వామి గురించి చెప్పిన అబద్దాలను తెలుసుకొని వారిని తమకు అనుగుణంగా (Accordingly) మార్చుకునేందుకు ప్రయత్నించేవారు. పెద్దలు వారి భవిష్యత్తు గురించి ఆలోచించే ఇలా అబద్ధాలు ఆడి పెళ్లి చేశారనే విషయాన్ని అర్థం చేసుకొని భాగస్వామి మనసును నొప్పించకుండా వారిలోని లోపాలను (Errors) మనస్ఫూర్తిగా స్వీకరించి వారిని ప్రేమతో మంచి దారిలో నడిపించే ప్రయత్నం చేస్తారు. 
 

అయితే ఇలా అబద్ధాలాడి పెళ్లి చేసినప్పుడు కొందరి జీవితం ఆప్యాయతతో, అన్యోన్యంగా, సుఖశాంతులతో గడిచిపోయేది. కొందరు పెళ్లి తర్వాత భాగస్వామి అభిరుచులకు నచ్చినట్టు ప్రవర్తిస్తూ (Behaving) వారి ఇష్టానుసారం నడుచుకుంటూ ఏ ఇబ్బందులు (Difficulties) లేకుండా తమ జీవన ప్రయాణాన్ని కొనసాగించేవారు. వారి జీవితాలు మంచిగా ఉండేవి. వారు ఒకరి కోసం ఒకరు అన్నట్లు తమ జీవితాలను మంచిగా మార్చుకునే ప్రయత్నం చేసేవారు.  
 

ఇలా వారి జీవితాన్ని అందమైన పూల బాటగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి వారి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే వీరి విషయంలో అబద్ధాలు చెప్పి పెళ్లి చేయడం న్యాయం అనిపిస్తుంది. అయితే మరి కొందరి జీవితంలో ఈ అబద్ధాలు పెనుతుఫానును సృష్టిస్తాయి (Create). పెళ్లికి ముందు భాగస్వామి గురించి చెప్పిన అన్ని విషయాలు అబద్ధాలని తెలుసుకుని ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా తరచూ గొడవ (Conflict) పడుతుంటారు.

అబ్బాయి మంచివాడని, అబ్బాయికి ఎటువంటి చెడు అలవాట్లు లేవని, ఉద్యోగం (Job) చేస్తాడని ఈ విధంగా పలు అబద్ధాలు చెప్పి అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసే ప్రయత్నం చేస్తారు. పెళ్లికి ముందు అమ్మాయి తనకు కాబోయే భాగస్వామి గురించి ఎన్నో కలలు కంటుంది. పెళ్లి తర్వాత భర్త నిజస్వరూపం (Reality) తెలిసి తాను కన్న కలలు అన్నీ వృధా అని దిగులు చెందుతుంది. భర్తను మార్చే ప్రయత్నం చేసినా తను మారడానికి ప్రయత్నించడు. 
 

ఇలా కొందరి విషయంలో అబద్ధాలు చెప్పి పెళ్లి చేయడం వారి జీవితాన్ని నాశనం (Destroy life) చేసినట్లు అవుతుంది. అయితే వీరి విషయంలో అబద్ధాలు చెప్పి పెళ్లి చేయడం న్యాయం కాదు. అయితే పెద్దలు ఎన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసిన పెళ్లి తర్వాత ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకుంటూ మిమ్మల్ని నమ్మి మీతో జీవితాన్ని గడపడానికి వచ్చిన వ్యక్తిని ఇబ్బంది పెట్టరాదు. దాంపత్య జీవితంలో ఆనందాలను ఆస్వాదిస్తూ, ఆప్యాయత అనుబంధాలతో అల్లుకుపోతూ, ఆదర్శంగా, అన్యోన్యంగా (Reciprocally) తమ జీవితాన్ని కొనసాగించాలి.

click me!