అంతేకాకుండా టెక్నాలజీ పెరగడంతో ఈ మధ్య ఆన్ లైన్ లో చూసుకొని కూడా ప్రేమలో పడుతున్నారు. మొదట ఆన్ లైన్ లో వారి ఇష్టాయిష్టాలను (Preferences) తెలుసుకుని ఇద్దరూ ఒక అభిప్రాయానికి వస్తారు. తర్వాత వారు కొంత కాలం చాటింగ్ చేస్తూ వారి స్టేటస్, ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకుని ప్రేమలో పడుతుంటారు. ఇలా వారి గురించి అన్ని విషయాలను తెలుసుకున్నాక వ్యక్తిగతంగా (Personally) కలవడానికి ప్రయత్నిస్తారు.