ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా.. అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలు వినపడుతూనే ఉన్నాయి. భర్తను వదిలేసి భార్య.. మరొకరితో సంబంధం పెట్టుకోవడం లేదంటే.. భార్యను మోసం చేస్తూ.. భర్త మరో మహిళతో ఎఫైర్ పెట్టుకోవడం చాలా కామన్ అయిపోయాయి. ఈ బంధాల కోసం కుక్కుర్తిపడి ప్రాణాలు తీస్తున్నవారు కూడా లేకపోలేదు.
అయితే.. అసలు ఓ వ్యక్తి పెళ్లైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏం జరుగుతుంది..? ఇలాంటి బంధాలు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
చాలా మంది పెళ్లైన మహిళల వెంట ప్రేమ పేరిట వెంటపడుతుంటారు. పెళ్లైతే ప్రేమ పుట్టకూడదా అంటూ సోదికబుర్లు చెబుతుంటారు. అయితే.. నిజానికి పెళ్లైన వారికి వారకంటూ ఓ కుటుంబం ఉంటుంది. మీరు ప్రేమ అంటూ వెంటపడి.. వారి జీవితంలోకి అడుగుపెడితే.. వాళ్లు.. వాళ్ల కుటుంబానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే.. చాలా మంది అంత త్వరగా భర్తకు విడాకులు ఇచ్చేసి.. మీ జీవితంలోకి వచ్చేస్తారు అనుకోవడం మీ భ్రమ. ఇలాంటి కేసుల్లో విడాకులు అంత సులభమేమీ కాదు.
ఇక.. ఎవరైనా పెళ్లైన మహిళ మీ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తోంది అంటే.. అది మీ మీద ప్రేమ అని పూర్తిగా నమ్మడానికి లేదట. అది ఆమె తన భర్త మీద రివేంజ్ తీర్చుకోవడానికైనా కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
మీరు చదివింది నిజమే.. చాలా మంది మహిళలు.. తమ భర్త మీద పగ తీర్చుకోవడానికి.. వాల్లు ఏదైనా ఎఫైర్ పెట్టుకున్నారని తెలిస్తే.. బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో.. వాళ్లు కూడా ఇలాంటి చేస్తుంటారు. కాబట్టి.. చివరకు మీరు బకరా అయ్యే అవకాశం ఉంది.
పెళ్లైన మహిళలతో రిలేషన్ పెట్టుకుంటే.. అది ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం. జీవితాంతం ఆ బంధం ఉంటుందనే గ్యారెంటీ ఉండదు. వాళ్లు.. ఎప్పుడైనా ఓ ఫోన్ లోనే.. మెసేజ్ లోనో ఎండ్ కార్డ్ చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి బంధాలకు గ్యారెంటీ ఇవ్వలేం.
రోటీన్ జీవితం.. ఇంటి పని, వంటపని, ఆఫీస్ పనులుతో సతమతమయ్యే మహిళలు.. కొత్త జీవితం చూడాలనే ఆశతోనే కూడా ఇలాంటి ఎఫైర్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంతేకాని.. నిజంగా ప్రేమిస్తున్నారని అనుకోలేం.
ఇక పెళ్లైన మహిళతో ఎఫైర్లు పెట్టుకునే అబ్బాయిలు ఎక్కువ రోజులు ఆనందంగా, ప్రశాంతంగా ఉండలేరు. ఫ్యూచర్ లో వాళ్లకు పెళ్లై భార్యలు వస్తారు.. వాళ్లకు ఈ విషయం తెలిస్తే.. అక్కడితో ఆ బంధం ముగిసిపోతుంది. ఇటు భార్య పోయి.. అటు.. ఆ మహిళ మీతో ఉండక మధ్యలో మీరే నష్టపోతారు.
ఇక పెళ్లైన మహిళ అంటే.. ఆమెకు ఎన్నో బరువు బాధ్యతలు ఉంటాయి. వాటన్నింటినీ వదిలి.. మీకోసం ఎప్పుడు కావాలంటే అప్పుడు సమయం కేటాయించలేరు. మీరే సర్వస్వంగా బతుకుతారనే ఆశ పెట్టుకోవడం కూడా సమయం వృథా చేసుకోవడం లాంటిదే.
ఇక పెళ్లైన మహిళ.. తాను ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తిని ఎప్పుడూ సెకండ్ ఆప్షన్ గానే పెట్టుకుంటుంది. ముందు తన కుటుంబం, భర్తకు ప్రాముఖ్యత ఇచ్చిన తర్వాతే.. లవర్ కోసం ఏదైనా చేస్తుంది.
చాలా మంది మహిళలు వేరే వ్యక్తితో ఎపైర్ పెట్టుకున్నప్పటికీ.. తమ భర్తకు మోసం చేస్తున్నామని బాధలో ఉంటారు. వాళ్లనే ఎక్కువగా మిస్ అవుతూ ఉంటారు.
ఒక వేళ.. మీరు సదరు మహిళ తో ఎఫైర్ పెట్టుకొని.. ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారో.. ఇక మీ జీవితానికి అదే ఆఖరి రోజు అయినా ఆశ్చుర్యపోనక్కర్లేదు. చాలా మంది తమ భార్యల జీవితంలో మరో వ్యక్తి ఉన్నాడనే ఊహను కూడా భరించలేరు. అలాంటిది ఏకంగా.. మనిషే కనిపిస్తే.. ఏం చేయడానికి కూడా వెనకాడరు. కాబట్టి.. ఇలాంటి బంధాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.