బ్లాక్ మార్కెట్లో సెక్స్ టాయ్స్.. తెగ కొనేస్తున్నారుగా..!

First Published | May 28, 2021, 2:26 PM IST

అక్కడ యువత, ముసలివారు, ఆడ, మగ తేడా లేకుండా ఆన్ లైన్ లో సెక్స్ సంబంధించిన విషయాలను ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారట.

సెక్స్ టాయ్స్ విపరీతమైన క్రేజ్, మార్కెట్ ఉందని చాలా మందికి తెలిసే ఉంటుంది. వీటిని ఆన్ లైన్ లో కొనుగోలు చేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరగుతోంది. మన దేశంలో.. సెక్స్ టాయ్స్ ని ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తుంటే.. పాకిస్తాన్ లో ఏకంగా బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు.
నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. పాక్ లో సెక్స్ టాయ్స్ ని బ్లాక్ మార్కెట్లో అమ్ముతుంటే.. కొనుగోలు చేసేవారు కూడా అంతే విపరీతంగా కొంటున్నారట. అక్కడ యువత, ముసలివారు, ఆడ, మగ తేడా లేకుండా ఆన్ లైన్ లో సెక్స్ సంబంధించిన విషయాలను ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారట.

పాక్ ఇస్లామిక్ దేశమన్న విషయం మనకు తెలిసిందే. ఇస్లామిక్ చట్టం, వ్యవస్థ, సాంస్కృతిక విలవల ప్రకారం.. ఇలాంటి విషయాల గురించి చర్చించకూడదు. ముఖ్యంగా సెక్స్ విషయంలో సంభాషించడం కూడా అక్కడ నిషిద్దం. అక్కడ ప్రభుత్వం అధికారికంగా నిషేధం విధించినప్పటికీ.. ఈ సెక్స్ టాయ్స్ పరిశ్రమ అక్కడ.. తమ కార్యకలాపాలను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిస్తుండటం గమనార్హం.
సెక్స్ విషయాల సంభాషణ మాత్రమే కాదు.. సెక్స్ టాయ్స్ అమ్మకాలు, తయారీపై కూడా పాకిస్తాన్ లో నిషేధం కొనసాగుతోంది. ఈ క్రమంలో.. వాటి నిర్వాహకులు బ్లాక్ మార్కెట్లో తమ దందా కొనసాగిస్తున్నారు.
కమర్ అనే ఓ వ్యక్తి ఈ వ్యాపారం ద్వారా అత్యధికంగా లాభాలు అర్జిస్తున్నాడట. తన స్వస్థలమైన సియాల్ కోట్ లో రహస్యంగా వీటి తయారీ చేపడుతున్నాడు. ఈ సెక్స్ టాయ్స్ ని అక్కడ తయారు చేయడంతోపాటు.. అక్కడి నుంచే ఎగుమతి చేయడం కూడా మొదలుపెట్టాడు.
పాకిస్తాన్ లాంటి దేశం నుంచి ఈ సెక్స్ టాయ్స్ కొనుగోలుకు ఇంత స్పందన వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదని అతను చెప్పడం విశేషం.
"మేము ఈ పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత త్వరగా మంచి డబ్బు సంపాదించడం ప్రారంభించాము. నేను నా స్నేహితులు నా స్వస్థలమైన సియాల్‌కోట్ నుండి స్టీల్ బట్ ప్లగ్‌లను తయారు చేసి ఎగుమతి చేయాలని నిర్ణయించుకున్నాం. అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను’ అని కమర్ చెప్పారు.
"మేము ఈ పనిని చాలా రహస్యంగా చేసేవాళ్ళం. ఎవరైనా దీని గురించి ప్రశ్నిస్తే..శస్త్రచికిత్సా ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నామని చెప్పేవాళ్లం’ అని పేర్కొన్నాడు.
సెక్స్ బొమ్మల తయారీని ప్రారంభించడానికి కమర్ సియాల్‌కోట్‌ను ఎంచుకోవడానికి ఒక కారణం ఏమిటంటే, ఈ నగరం ఉక్కు శస్త్రచికిత్సా పరికరాలను ఉత్పత్తి చేయడానికి ఎగుమతి చేయడానికి ప్రసిద్ది చెందింది ప్రపంచంలోనే అతిపెద్ద తోలు ఫుట్‌బాల్ తయారీదారులలో ఒకటిగా ఈ ప్రాంతం నిలిచింది.
యుఎస్, ఆస్ట్రేలియా యుకెతో సహా దేశాలకు ఎగుమతి చేయడం మాత్రమే కాకుండా.. ఆన్‌లైన్ అమ్మకాలు చేయడంలోనూ, ఎక్కువ సెక్స్ బొమ్మల తయారీ జరిగే నగరంగా సియాల్‌కోట్ నిలిచిందని కూడా చెప్పాలి.
దేశంలో సెక్స్ బొమ్మల పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నప్పటికీ, అశ్లీల వస్తువులపై సెక్స్ బొమ్మల కొనుగోలు, అమ్మకం, ప్రకటనలు తయారీని పాక్ ప్రభుత్వం నిషేధించింది.
నిషేధాన్ని పట్టించుకోకుండా ఎవరైనా వీటిని తయారు చేయడం.. సెక్స్ టాయ్స్ అమ్మకాలు చేపడుతూ పోలీసులు చిక్కితే.. వారికి జరిమానా, మూడు నెలల జైలు శిక్ష కూడా విధిస్తారు.

Latest Videos

click me!