శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనాలని వయాగ్రా వంటి మాత్రలు వేసుకుంటున్నారా? దీనివల్ల ఏమౌతుందో తెలుసా?

First Published | Sep 3, 2023, 10:25 AM IST

శృంగారాన్ని మరింత ఎక్కువ సేపు ఆస్వాదించడానికి స్త్రీపురుషులిద్దరూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం చాలా మంది వయాగ్రా వంటి టాబ్లెట్స్ ను తీసుకుంటున్నారు. ఇది మంచిదా? చెద్దడా? నిపుణులు ఏమంటున్నారంటే? 
 

భాగస్వాముల మధ్య శారీరక సంబంధం ఖచ్చితంగా ఉండాలి. ఇదే వారిద్దరిని కాలకాలం కలిసుండేలా చేస్తుంది. అంతేకాదు ఇది ఇద్దరికీ ఎన్నో రోగాల ముప్పును తగ్గిస్తుంది. ముఖ్యంగా బిజీ లైఫ్ స్టైల్ ను మెయింటైన్ చేస్తున్న వారికి ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గించడనికి సెక్స్ ఎంతో సహాయపడుతుంది. భార్యాభర్తలు ఏకాంతంగా ఒక దగ్గర కూర్చొని ఎన్నో విషయాల గురించి మాట్లాడుకోవడం, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. 
 

Sexual Relationship

వారానికి రెండు మూడు సార్లు శృంగారంలో పాల్గొనే భార్యాభర్తలకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది తక్కువ లిబిడో, అంగస్తంభన లోపం, తక్కువ సెక్స్ కోరికలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనడానికి వయాగ్రా వంటి కొన్ని మాత్రలు వేసుకుంటుంటారు. 
 


ఇది మంచిదేనా? కాదా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మార్కెట్లో ఇవి చాలా తక్కువ ధరకే,  శక్తిమంతంగా ఉంటాయనే ఫేక్ న్యూస్ ఆధారంగా ఇలాంటి టాబ్లెట్లను వాడుతుంటారు. ఇలా వీటిని వాడి శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనాలని నిర్ణయించుకుంటే ముందుగా నిపుణులను సంప్రదించి వారు ఇచ్చిన మాత్రలను చాలా తగు మోతాదులో వాడొచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ మీ సొంతంగా వీటిని ఎక్కువ మొత్తంలో వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

ఈ మాత్రలను వాడటం వల్ల తలనొప్పి, వికారం, ముక్కు దిబ్బడ వంటి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనాలనుకునే జంటలు ఇలాంటి మాత్రలు వేసుకోకుండా పౌష్టికాహారం, పండ్లు తీసుకోవడం మంచిదని నిపుణులు సలహానిస్తున్నారు.
 

అయితే మీరు వీటిని ఖచ్చితంగా వాడాలనుకుంటే 100 శాతం నిపుణులను సంప్రదించి మాత్రమే ఇలాంటి మాత్రలను వాడటం మంచిదని నిపుణులు, డాక్టర్లు సలహానిస్తున్నారు. 

Latest Videos

click me!