పెళ్లయిన వెంటనే పిల్లలను కనడం వల్ల లైఫ్ ఎలాంటి మార్పులు జరుగుతాయ్?

First Published | Dec 3, 2021, 11:20 AM IST

పెళ్లి తర్వాత భార్యాభర్తల ప్రేమకు (Love) ప్రతిరూపమే వారి సంతానం. అయితే పెళ్లయిన వెంటనే పిల్లలను కనడం మంచిదా లేదా కొంతకాలం లైఫ్ ని ఎంజాయ్ చేసి తరువాత పిల్లల కనడం మంచిదా అని కొందరు ఆలోచిస్తుంటారు. అయితే సరైన వయసులో పిల్లలను కనడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఆర్టికల్ (Article) ద్వారా పెళ్లయిన వెంటనే పిల్లలను కనడంతో లైఫ్ ఎలా ఉంటుందో చూసుకుందాం..
 

పెళ్లి (Married) తరువాత పిల్లలను (Children) కనడం గురించి భార్యాభర్తలిద్దరూ సరైన ప్లాన్ చేసుకోవాలి. కుటుంబ కారణాల చేత కొంతమందికి చిన్న వయసులోనే వివాహం జరుగుతుంది. ఇటువంటి చిన్న వయసు అమ్మాయిలకు గర్భధారణ జరగడానికి శరీరం అనుకూలించదు. వారు లేత వయసులోనే గర్భం ధరించడంతో వారి శరీరం బలహీనపడుతుంది.
 

ఇది వారి ప్రాణానికి కూడా ప్రమాదం కావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వారికంటూ ఒక వయసు వచ్చాక పిల్లలను కనడం గురించి డాక్టర్లను సంప్రదించి ప్లాన్ చేసుకోవడం మంచిది. అయితే చిన్న వయసులోనే పిల్లలను కనడంతో వారికి బాధ్యతలు (Responsibilities) కూడా పెరిగిపోతాయి. వారు వివాహ జీవితాన్ని (Married life) కొన్ని రోజులు కూడా ఎంజాయ్ చేయలేకపోతుంటారు.
 

Latest Videos


పిల్లల బాధ్యత వారి బాధ్యతగా భావించి వారి పెంపకంపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఆలుమగల జీవితాన్ని కొంతకాలం కూడా పూర్తిగా ఆస్వాదించలేరు (Can not enjoy). వారికి కొత్త బాధ్యతలు ఏర్పడుతాయి. పిల్లలతోనే వారి కాలం గడిచిపోతుంది. అయితే కొందరు పెళ్లి తరువాత వెంటనే పిల్లలు కనేసి, వారు వయసులో ఉన్నట్టుగానే పిల్లల ఆలనాపాలనా  (Administration) పూర్తిగా చూడాలని తొందర పడుతుంటారు.
 

అందుకే వారు తొందరగా పిల్లలు కనడం గురించి ఆలోచిస్తారు. మరికొందరు పెళ్లి తర్వాత వెంటనే పిల్లలు వద్దని భావిస్తారు. వారు దాంపత్య జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించిన తరువాత  పిల్లలను కనడం గురించి దృష్టిపెడతారు (Focus). పిల్లలను తొందరగా కనడంతో వారు దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయలేమని కొత్త బాధ్యతలు తలెత్తుతాయని (Arise) భావిస్తారు.
 

అయితే మరి కొందరు ఆర్థిక పరంగా స్థిరపడ్డాక పిల్లల కనడంపై దృష్టి పెడతారు. ఇలా ఆర్థిక పరంగా స్థిరపడ్డాక పిల్లలను కనడంతో వారి ఆలనా పాలనా చూసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు (Difficulties) తలెత్తవని ఆలోచిస్తారు. ఇలా ఎవరి ధోరణిలో వారు ఆలోచిస్తూ పిల్లలను కనడంపై దృష్టి పెడతారు. అయితే ఇవన్నీ చేయడానికి మన వయస్సు (Age) ఎప్పటికీ ఒకే విధంగా ఉండదు.
 

వయస్సు అనేది ఎప్పటికీ పెరుగుతూ పోతుంది. మన వయసును బట్టి మనం పిల్లలను కనడం గురించి ప్లాన్ (Plan) చేసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ పిల్లలు పుట్టే అవకాశం (Opportunity) తగ్గుతుంది. అప్పుడు మీరు పిల్లలు కావాలనుకున్నా పుట్టే అవకాశం తక్కువ. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే వారి జీవితానికి మంచిది. సరైన వయసులో పిల్లలను కనడం గురించి ప్లాన్ చేసుకుంటే మంచిది. అప్పుడే వారు సంతాన ప్రాప్తి (Parental access) పొందగలుగుతారు.

click me!